బైక్ పై వచ్చి 6లక్షలు కోట్టేశారు | 6 lacks Theft at nellore | Sakshi
Sakshi News home page

బైక్ పై వచ్చి 6లక్షలు కోట్టేశారు

Oct 6 2015 6:15 PM | Updated on Jul 25 2019 5:24 PM

బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఓ వ్యక్తి నుంచి రూ.6 లక్షల నగదు బ్యాగును గుంజుకుని పరారయ్యారు.

బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఓ వ్యక్తి నుంచి రూ.6 లక్షల నగదు బ్యాగును గుంజుకుని పరారయ్యారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖరపురంలోని ప్రియాంక ఆగ్రో లిమిటెడ్ కంపెనీకి చెందిన రూ.6 లక్షల నగదును నార్త్ రాజుపాలెంలోని ఎస్‌బీఐలో డిపాజిట్ చేసేందుకు గుమస్తా రాఘవరావు తీసుకువెళుతున్నారు. కంపెనీకి అరకిలోమీటరు దూరంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు రాఘవరావు చేతిలో ఉన్న నగదు బ్యాగును లాక్కుని పరారయ్యారు. దీనిపై బాధితుడు కొడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement