55 కిలోల గంజాయి పట్టివేత | 55 kgs of marijuana seized | Sakshi
Sakshi News home page

55 కిలోల గంజాయి పట్టివేత

Apr 11 2016 3:08 PM | Updated on Sep 3 2017 9:42 PM

విశాఖ జిల్లా రోలుగుంట మండలం పెద్దపేట గ్రామం వద్ద సుమారు 55 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడింది.

రోలుగుంట (విశాఖపట్టణం) : విశాఖ జిల్లా రోలుగుంట మండలం పెద్దపేట గ్రామం వద్ద సుమారు 55 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడింది. సోమవారం ఉదయం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రోడ్డు పక్కన మూడు బస్తాల్లో గంజాయి నింపుకుని వాహనం కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు అపరిచితులు కనిపించారు. వారిని అనుమానించి ప్రశ్నిస్తుండగా ఒక వ్యక్తి పరారయ్యాడు. మిగతా ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, బస్తాల్లో పరీక్షించగా గంజాయి కనిపించింది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని, గంజాయిని సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement