రోడ్డున పడ్డ 300 మంది రెగ్యులర్ కార్మికులు | 300 workers lose their jobs | Sakshi
Sakshi News home page

రోడ్డున పడ్డ 300 మంది రెగ్యులర్ కార్మికులు

May 22 2015 10:11 AM | Updated on Sep 3 2017 2:30 AM

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలోని మెట్‌కోర్ ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమకు చెందిన 300 మంది కార్మికులు రోడ్డున పడ్డారు.

టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలోని మెట్‌కోర్ ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమకు చెందిన 300 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. యాజమాన్యం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో లాకౌట్ ప్రకటించింది. పరిశ్రమకు తాళాలు వేయడంతో అందులో రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్న 300 మంది కార్మికులు హతాశులయ్యారు. శుక్రవారం ఉదయం వారు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిష్కారం కోసం అక్కడే బైటాయించారు. కాగా, యాజమాన్యం అందుబాటులో లేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement