గుంటూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మాచర్ల: గుంటూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాచర్ల మండలం బూర్జ- అడిగొప్పల రహదారిలో ఆదివారం ఉదయం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 22 టన్నుల రేషన్ బియ్యంతో పాటు 9మందిని అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యాన్ని రెండు లారీల్లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని, నిందితులను బూర్జ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.