షిరిడీ యాత్రకు వెళ్లిన తెలుగు మహిళా బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 18 మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
గండేపల్లి (తూర్పు గోదావరి) : షిరిడీ యాత్రకు వెళ్లిన తెలుగు మహిళా బృందం రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 18 మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన 18 మంది మహిళలు శుక్రవారం ఉదయం షిరిడీ సాయి బాబా దర్శనానికి వెళ్లారు.
సాయిబాబా దర్శనం అనంతంర ఒక వాహనంలో నాసిక్ వెళ్తుండగా.. వీళ్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.