ఆగని మరణాలు | 15 peoples died sunstroke in nellimarla | Sakshi
Sakshi News home page

ఆగని మరణాలు

Jun 16 2014 2:17 AM | Updated on Sep 2 2017 8:51 AM

ఆగని మరణాలు

ఆగని మరణాలు

వేడి గాలులకు జనం ప్రాణాలు వదులుతున్నారు. వారం రోజుల్లో మండలానికి చెందిన ఏడుగురు వడదెబ్బకు గురయ్యారు. ఆదివారమే మండలంలో ము గ్గురు మృతి చెందారు.

 నెల్లిమర్ల రూరల్: వేడి గాలులకు జనం ప్రాణాలు వదులుతున్నారు. వారం రోజుల్లో మండలానికి చెందిన ఏడుగురు వడదెబ్బకు గురయ్యారు. ఆదివారమే మండలంలో ము గ్గురు మృతి చెందారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటలోని లక్ష్మీదేవిపేటలో ఆదివారం ఉద యం కనకల సరోజిని(60) వడగాలులకు తట్టుకోలేక ప్రా ణాలు వదిలింది. అదే గ్రామానికి చెందిన జూట్‌మిల్లు కా ర్మికుడు తొగరాపు నాగేశ్వరరావు(53) కూడా తీవ్రమైన వే డి గాలులకు తట్టుకోలేక మృతి చెందారు. ఈయనకు భా ర్య, కూతురు, కుమారుడు ఉన్నారు. అలాగే పారసాం గ్రా మానికి చెందిన చోడవరపు వెంకమ్మ(55) కూడా ఆది వారం సూర్యుని ప్రతాపానికి బలైంది. వడదెబ్బకు గురైన వెంటనే కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందారు.
 
 గొల్లుపాలెంలో ముగ్గురు మృతి
 దేవుపల్లి (బొండపల్లి ) : గొల్లుపాలెం గ్రామంలో ఆదివా రం వడదెబ్బకు మాదాబత్తుల సూర్యనారాయణ(60), పే కేటి తిరుపతి(52), తామరాపల్లి అప్పలకొండమ్మ(50) లు మృతిచెందారు.  మృతి చెందిన విషయాన్ని గ్రామ సర్పంచ్ పల్లి రామునాయుడు, తహశీల్దార్‌కు, ఆర్డీఓకు తెలియజేశారు.  
 
 ఇద్దరు మృతి...
 వేపాడ: వేపాడ మండలంలో వడగాలులకు ఆదివారం ఇద్ద రు మృతి చెందారు. వేపాడలో రెడ్డి పైడితల్లి (75) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోందని, ఎండ తీవ్రతకు తట్టుకోలేక శనివారం రాత్రి చనిపోయిందని కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలు పైడితల్లికి ఇద్దరు కుమార్తె లు గోకేడ దేముడమ్మ, చింతల దేముడమ్మలున్నారు. పైడితల్లి భర్త కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. అలాగే వల్లంపూడి గ్రామానికి చెందిన తోటాడ సన్యాసి(56) వారం రో జులుగా వీస్తున్న వేడి గాలులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఆయాసం ఎ క్కువవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యసేవలు అందించామని, రాత్రి 10.30 సమయంలో మృతి చెందినట్లు కుటుం బ సభ్యులు తెలిపారు. మృతుడు సన్యాసికి భార్య పెంట మ్మ, కుమార్తె సింహాచలం(వివాహమైంది) ఇద్దరు కుమారులు  దేముడు, రాజు ఉన్నారు.
 
 బొబ్బిలిలో ఇద్దరు...
 బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలో ఆదివారం వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. మున్సిపల్ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలు పత్తిగుళ్ల రా మరాజ్యం (34) ఆదివారం మృతి చెందింది. గత మూడు రోజులుగా ఎండ వేడిమి తట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ప్రాణాలు వదిలినట్లు బంధువులు తెలిపారు. అలాగే నా యుడుకాలనీకి చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు ఉరిటి వెం కటరమణ పట్నాయక్ (87) ఆదివారం మృతి చెందారు. పట్నాయక్ మృతి చెందిన సమాచారం తెలియగానే టీచర్లు అధిక సంఖ్యలో వెళ్లి నివాళులు అర్పించారు.  
 
 గేదులవానిపాలెంలో...
 గేదులవానిపాలెం(లక్కవరపుకోట): గేదులవానిపాలేనికి చెందిన గేదుల చంద్రమ్మ(68) ఆదివారం వడదెబ్బకు గురై మృతి చెందింది. వారం రోజులుగా వీస్తున్న వేడి గాలులకు తట్టుకోలేకపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
 
 వృద్ధుడు...
 జామి: అలమండ పంచాయతీ నారాయణపురం గ్రామం లో ఎండ వేడికి తట్టుకోలేక పల్ల పోలిపల్లి (68) ఆదివారం మృతి చెందాడు. ఉదయం వరకు బాగానే ఉన్న పోలిపల్లి మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగడంతో అస్వస్థతకు గురై సొమ్మసిల్లి మృతి చెందాడు. మృతుడికి భార్య అప్పయ్య మ్మ, కుమార్తె ఎర్నమ్మ, ముగ్గురు  కుమారులు  ఉన్నారు.
 
 వృద్ధురాలు...
 మెరకముడిదాం: బాడాం గ్రామానికి చెందిన రెడ్డి సూరమ్మ(63) వడదెబ్బకు గురై ఆదివారం మృతి చెందారు. రోజూ లాగానే పొలం పనులు చేసుకునేందుకు వెళ్లిన సూరమ్మ మధ్యాహ్నం అయ్యే సరికి ఇంటికి తిరిగి వచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. కుటుంబ సభ్యులు నీళ్లు తాగించడానికి లే వదీసే సరికే ఆమె చనిపోయింది. మృతురాలికి కుమారు డు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
 
 ఒకరు మృతి...
 గజపతినగరం: దత్తిరాజేరు మండలం పెదమానాపురం ఎ స్సీ కాలనీకి చెందిన గోటివాడ లచ్చయ్య (55) ఆదివారం వడ దెబ్బకు గురై మృతి చెందారు. లచ్చయ్య గ్రామంలో గల చర్చికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ స్పృహ కోల్పోయారు. స్థానికులు ఇంటికి తీసుకువస్తుండగా మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
 
 కొంకడివరంలో...
 గరుగుబిల్లి: కొంకడివరం గ్రామంలో వడదెబ్బకు గురై అ ల్లు అప్పలస్వామి (65) ఆదివారం మృతి చెందాడు. అనారోగ్యంగా ఉందని ఆయన ఆదివారం పార్వతీపురం హో మియో క్లినిక్ బయలుదేరారు. బస్టాండ్ నుంచి హోమియో క్లినిక్‌కు నడిచివెళ్తూ సొమ్మసిల్లిపడిపోయారు. దీన్ని గమనించిన స్థానికులు పార్వతీపురంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స ప్రారంభించకముందే ఆయన కన్ను మూసినట్లు వైద్యులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement