గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం | The Main Aim Is Development Of Villages | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం

Mar 4 2019 1:38 PM | Updated on Mar 4 2019 1:41 PM

The Main Aim Is Development Of Villages - Sakshi

పిప్పల్‌కోటిలో ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావును సన్మానిస్తున్న గ్రామస్తులు

సాక్షి,తాంసి: నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు అన్నారు. ఆదివారం తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్‌ గ్రామంలో బుడగ జంగం సంఘం ఆధ్వర్యంలో భీంపూర్‌ మండలంలోని పిప్పల్‌కోటి గ్రామంలో నిర్వహించిన గ్రామస్తుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండల్‌నాగాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమెల్యే రాథోడ్‌ బాపూరావును బుడగ జంఘం సంఘం నాయకులు పూలమాల శాలువాతో సన్మానించారు. పిప్పల్‌కోటి గ్రామంలో ఎమ్మెల్యేను నూతనంగా ఎన్నికైన సర్పంచ్, పాలకవర్గసభ్యులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు మాట్లాడుతూ పిప్పల్‌కోటి గ్రామంలో 368 కోట్ల రూపాయల రిజర్వాయర్‌ నిర్మాణంతో గ్రామంలో చుట్టుపక్కల భూములు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. రిజర్వాయర్‌ నిర్మాణానికి రైతులు భూములను అందించటం అభినందనీయమన్నారు. భూములను అందించిన రైతులకు నష్టపరిహారంతో పాటు అన్నివిధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములందించి సహకరించిన పిప్పల్‌కోటి గ్రామాన్ని దత్తత తీసుకొని  అబివృద్ధి చేస్తానని గ్రామస్తులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement