breaking news
Budaga Jangam community
-
వారికి ఏ కులం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు
సాక్షి, అమరావతి: ఊరూరు తిరుగుతూ సంచార జీవితం గడుపుతున్న బుడగ జంగాలను ఆదుకోవాలని అసెంబ్లీలో పలువురు సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్సార్సీపీ సభ్యుడు శ్రీ ఆర్థర్ మాట్లాడుతూ.. బుడగ జంగాలకు ఒక కులమంటూ లేదని, దీంతో వారికి కుల ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోజుకు కూడా బుడగ జంగాలు ఊరూరు తిరుగుతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. బుడగ జంగాలను ఆదుకుంటామని చంద్రబాబు సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. బుడగ జంగాలు తమ పిల్లలను చదివించుకోవాలని, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలని ఆరాటపడుతున్నారని, వారికి ఏదో ఒక కులం కల్పించి ఆదుకోవాలని శ్రీ ఆర్థర్ కోరారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు, ప్రభుత్వ పథకాలను వారు పొందలేకపోతున్నారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఏదో ఒకు కుల గుర్తింపు వారికి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ.. ఏదైనా కులాన్ని ఎస్సీ, ఎస్టీలలో చేర్చాలనుకున్నప్పుడు సమగ్రంగా విచారణ జరిపి... వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసి రాజ్యాంగంప్రకారం ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా మెరుగ్గా కులాలను ఎస్సీ, ఎస్టీలలో చేరిస్తే.. రాజ్యాంగ రక్షణ పొందిన ఆ వర్గాలు నష్టపోతాయని అన్నారు. దీనికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ సమాధానం ఇస్తూ.. బుడగ జంగాల కులాలకు సంబంధించి ఇది సున్నితమైన సమస్య అని తెలిపారు. వారు ఏ కులంలోనూ లేరని, తమను ఏదో ఒక కులంలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని తెలిపారు. విభజన సమయంలో బుడగ జంగాలు తెలంగాణలో మాత్రమే ఉన్నారని భావించి.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీల్లోంచి వారిని కేంద్రం తీసేసిందని తెలిపారు. చంద్రబాబు గతంలో ప్రతి కులాన్ని ఎస్సీల్లో చేరుస్తాను? బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చి మోసగించారని, ఎన్నికల సమయంలో మాత్రమే ఆ కులాలను మభ్యపెట్టే చర్యలను తీసుకున్నారని మండిపడ్డారు. బుడగ జంగాలకు సంబంధించి ఏదో ఒక కులాన్ని కల్పించే అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ప్రస్తుతానికైతే వారికి ఏ కులం సర్టిఫికెట్ ఇవ్వడం లేదని చెప్పారు. -
గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం
సాక్షి,తాంసి: నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. ఆదివారం తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్ గ్రామంలో బుడగ జంగం సంఘం ఆధ్వర్యంలో భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి గ్రామంలో నిర్వహించిన గ్రామస్తుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండల్‌నాగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమెల్యే రాథోడ్ బాపూరావును బుడగ జంఘం సంఘం నాయకులు పూలమాల శాలువాతో సన్మానించారు. పిప్పల్‌కోటి గ్రామంలో ఎమ్మెల్యేను నూతనంగా ఎన్నికైన సర్పంచ్, పాలకవర్గసభ్యులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ పిప్పల్‌కోటి గ్రామంలో 368 కోట్ల రూపాయల రిజర్వాయర్ నిర్మాణంతో గ్రామంలో చుట్టుపక్కల భూములు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు భూములను అందించటం అభినందనీయమన్నారు. భూములను అందించిన రైతులకు నష్టపరిహారంతో పాటు అన్నివిధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములందించి సహకరించిన పిప్పల్‌కోటి గ్రామాన్ని దత్తత తీసుకొని అబివృద్ధి చేస్తానని గ్రామస్తులకు తెలిపారు. -
బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలి
-
బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలి: పెద్దిరెడ్డి
అమరావతి: రాష్ట్రంలోని బుడగ జంగాలను ఎస్సీల్లోకి చేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఏపీ అసెంబ్లీలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు లక్షల మంది బుడగ జంగాలు ఉన్నారని... సంచార జీవనం గుడుపుతున్న వీరందరినీ పక్క రాష్ట్రాల్లో ఎస్సీలుగా పరిగణిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంలోనూ వారిని ఎస్సీలుగానే పొందుపరిచారన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో కమిటీల పేరుతో జాప్యం చేస్తోందని వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని పెద్దిరెడ్డి కోరారు.