Top Stories
ప్రధాన వార్తలు

భారత్ భీకర దాడులతో పాక్ కకావికలం
India-Pakistan War Updates:ఆపరేషన్ సిందూర్‌పై విదేశాంగ శాఖ మీడియా సమావేశంగత రాత్రి పాక్.. సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసింది300 నుంచి 400 వరకూ డ్రోన్లను ప్రయోగించిందిఎల్‌ఓసీ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందిజమ్మూ, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ లక్ష్యంగా పాక్ దాడులు చేసిందిజమ్మూలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు34 చోట్ల పాక్ దాడులకు పాల్పడిందిపాక్ దాడులను తిప్పికొట్టాంపౌర విమానాలను టార్గెట్ గా పాక్ దాడులు చేసిందిఆ డ్రోన్లు టర్కీకి చెందినవి తెలుస్తోందిలేహ్ నుంచి సర్ క్రీక్ వరకూ పాక్ దాడులకు ప్రయత్నించిందిబటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారుకశ్మీర్‌లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడిందిభారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై దాడికి యత్నించారులేహ్ నుంచి సర్ క్రీక్ వరకూ పాక్ దాడులకు ప్రయత్నించిందిబటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారుకశ్మీర్‌లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడిందిభారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై దాడికి యత్నించారుపాక్ ఉపయోగించిన డ్రోన్లు టర్కీకి చెందినవిపాక్ సైన్యం కాల్పుల్లో అనేకమంది గాయపడ్డారు.పాక్ దాడులను భారత వాయుసేన సమర్థవంతంగా అడ్డుకుందికర్తర్‌పూర్ కారిడార్ ను తాత్కాలికంగా మూసివేశాం అమృత్‌సర్‌లో పాక్ బాంబును నిర్వీర్యం చేసిన ఇండియన్ ఆర్మీమక్నా దిండి విలేజ్‌ను టార్గెట్ చేసిన పాకిస్తాన్‌బాంబును నిర్వీర్యం చేసిన భారత సైనికులుసరిహద్దుల్లో పాక్ దాడిని తిప్పికొడుతున్న భారత సైన్యంతిరుమలభారత్- పాక్ యుద్ద వాతావరణం నేపథ్యంలో తిరుమలలో భద్రత బలగాలు మాక్ డ్రిల్..తిరుమల ప్రవేశ మార్గంలో ఆక్టోపస్, పోలీస్, విజిలెన్స్, ఇతర బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహణఢిల్లీ:అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ లేఖసివిల్ డిఫెన్స్ రూల్స్ కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశంఅత్యవసర సమయంలో కావలసిన అన్ని వస్తువులను సేకరణకు అనుమతిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచిస్తున్న 1968 సివిల్ డిఫెన్స్ రూల్స్ఢిల్లీ ;ఢిల్లీలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ఐటీఓ వద్ద టెస్ట్ సైరెన్ చేసిన అధికారులువైమానిక దాడి సైరన్లను పరిశీలించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పరవేశ్ వర్మ8 కి.మీ వరకు వినిపించేలా సైరన్ ఏర్పాటుఅమరావతి:ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల ర్యాలీర్యాలీలో పాల్గొన్న ఏపీ సచివాలయ ఉద్యోగులుఅమరుడైన మురళి నాయక్ అమర్ రహే అంటూ నినాదాలుపాక్‌స్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్‌జమ్మూకశ్మీర్, రాజస్తాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీఢిల్లీ, హరియాణా, హిమాచల్‌లోనూ భద్రత కట్టుదిట్టంపోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేసిన సరిహద్దు రాష్ట్రాలుగుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలుఅవసరమైతే టరిటోరియల్ ఆర్మీని పిలిపించుకునేందుకు అనుమతిఆర్మీ చీఫ్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన రక్షణమంత్రి రాజ్ నాథ్‌టెరిటోరియల్ ఆర్మీలో ధోనీ, మోహన్‌లాల్, సచిన్ పైలట్, అనురాగ్ ఠాకూర్ దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంపుభద్రతను రెండోస్థాయికి పెంచుతూ కేంద్రం ఆదేశాలు పోర్టులు, టర్మినళ్లు, నౌకలకు భద్రత పెంచిన కేంద్రంఇస్రో కేంద్రాల దగ్గర హైఅలర్ట్‌ఇస్రో కేంద్రాల దగ్గర సీఐఎస్ఎఫ్ భద్రత పెంపుశ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో అలర్ట్‌పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం ప్రయాణికులు విమానయాన శాఖ అడ్వైజరీఎయిర్‌పోర్ట్‌లకు మూడు గంటల ముందుగానే చేరుకోవాలి75 నిమిషాల ముందే చెక్ ఇన్ క్లోజ్ అవుతుంది జాతీయ రక్షణ నిధికి తెలంగాణ నేతల విరాళంనెల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచననెల వేతనం విరాళంగా ప్రకటించనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌అప్రమత్తమైన అధికారులుఎయిర్ పోర్ట్ లో తనిఖీలు సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్‌గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సీఎంలతో మాట్లాడిన మోదీసరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని సూచనప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీఢిల్లీ:అమిత్ షా నివాసంలో హైలెవల్‌మీటింగ్‌హాజరైన ధోవల్, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలుసరిహద్దుల్లో పరిస్థితులపై అమిత్ షా రివ్యూ ఢిల్లీ:ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ భేటీపాక్ పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చ బ్యాంకులు, ఆర్థిక సంస్థల భద్రతపై నిర్మలా సీతారామన్ రివ్యూసైబర్ భద్రత సన్నద్ధతపై సమీక్షించనున్న నిర్మాలా సీతారామన్ పాక్ పార్లమెంట్ లో రక్షణ మంత్రి అసిఫ్ కీలక వ్యాఖ్యలుమన ఎయిర్ డిఫన్స్ వ్యవస్థ విఫలంపాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసిందిమన రక్షణ విభాగం పూర్తి విఫలమైందిపాక్ ప్రభుత్వంపై ఎంపీలు విమర్శలుచేతగాని ప్రభుత్వం అంటూ మండిపాటు👉కాసేపట్లో ప్రధాని మోదీతో రాజ్‌నాథ్ భేటీపాక్‌పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చఉదయం త్రివిధ దళాధిపతులతో రెండున్నర గంటల పాటు భేటీఅమిత్‌షా అత్యున్నతస్థాయి సమావేశంహాజరైన ధోవల్, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలుసరిహద్దు పరిస్థితులపై అమిత్‌షా సమీక్ష 👉పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలుమరో పక్క బీఎల్ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరితెహ్రిక్‌ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతం👉జమ్మూకశ్మీర్ లో తెలుగు జవాన్ వీర మరణంభారత్-పాక్ యుద్ధభూమిలో మురళీ నాయక్ మృతిజవాన్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లితండా గ్రామం 👉ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదాఐపీఎల్ నిరవధిక వాయిదా వేసిన బీసీసీఐభారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం👉జమ్మూ కశ్మీర్ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యే రైళ్లుపాకిస్థాన్ సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్‌ఇండియా గేట్, వార్ మెమోరియల్ వద్ద భద్రత కట్టుదిట్టంసరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచనబోర్డర్ వెళ్లిన 10 మంది పంజాబ్ మంత్రులుదేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఆదేశాలు👉జమ్మూలో భద్రతా బలగాల భారీ ఆపరేషన్‌సాంబా సెక్టార్లో ఏడుగురు అనుమానిత ఉగ్రవాదుల హతంచైనా తయారీ పీఎల్-15 మిస్సైల్‌ను కూల్చేసిన భద్రతా బలగాలుపంజాబ్ పంట పొలాల్లో కూలిన పీఎల్-15 మిస్సైల్‌భారత్ భీకర దాడులతో పాక్ కకావికలంకంటోన్మెంట్లను ఖాళీ చేస్తున్న పాక్ ఆర్మీ కుటుంబాలు👉చండీగఢ్‌లో మోగిన సైరన్లుప్రజలు ఇళ్లలోనే ఉండాలిదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన ఎయిర్ ఫోర్స్👉త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీసరిహద్దులో ఉద్రిక్తతలపై రాజ్‌నాథ్ సింగ్ సమీక్షప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్న రక్షణ మంత్రితదనంతర వ్యూహాలపై చర్చిస్తున్న రాజ్‌నాథ్ సింగ్👉అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటనభారత్ - పాక్ యుద్ధం మధ్యలో మేం జోక్యం చేసుకోంఇది మాకు సంబంధం లేని విషయంఆయుధాలు పక్కన పెట్టమని మేము ఎవరిని కోరంఏదైనా ఉంటే దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేస్తాంఈ ఘర్షణలు అణు యుద్ధానికి తీయకుండా ఉండాలని కోరుకుంటున్నాం👉ఢిల్లీలో హైఅలర్ట్.. ఇండియా గేట్ దగ్గర భద్రత పెంపుఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేతఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలు బంద్👉కాసేపట్లో సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీపాకిస్థాన్ దాడులు, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించనున్న రక్షణ మంత్రిజమ్మూ చేరుకున్న సీఎం ఒమర్ అబ్ధుల్లాపరిస్థితిని సమీక్షిస్తున్న ఒమర్ అబ్ధుల్లాహోంమంత్రి అమిత్‌షాతో బీఎస్ఎఫ్ చీఫ్ భేటీ 👉ఆపరేషన్ సిందూర్.. పాక్ దాడులపై ఇండియన్ ఆర్మీ ప్రకటనపాకిస్థాన్ సాయుధ దళాలు నిన్న మధ్య రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు ఆయుధ సామగ్రితో అనేక దాడులను చేశాయి.జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను పాల్పడ్డాయిడ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయిభారత సైన్యం దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందిదుర్మార్గపు కుట్రలకు దీటుగా స్పందిస్తాం👉పాకిస్థాన్‌లో మరోసారి బలూచిస్థాన్ ఆర్మీ దాడిహజారా, క్వెట్టాపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కాల్పులు👉పాకిస్థాన్‌లో అంతర్గత సంక్షోభంపాకిస్తాన్ వ్యాప్తంగా పీటీఐ నిరసన ర్యాలీలుప్రధాని షెహబాజ్ అసమర్థ ప్రధాని అంటూ నినాదాలుఇప్పటికే సురక్షిత ప్రాంతానికి పారిపోయిన షెహబాజ్👉ఆపరేషన్ సింధూర్ .3.o పై ఉదయం 10 గంటలకి మీడియా సమావేశంరాత్రి నిర్వహించిన దాడులపై బ్రీఫింగ్కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి, ఆర్మీ ప్రతినిధుల మీడియా బ్రీఫింగ్జమ్ము సరిహద్దు గ్రామాల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటనపాకిస్తాన్ కాల్పుల్లో చనిపోయిన గాయపడిన కుటుంబాలను పరామర్శించనున్న ఒమర్ 👉నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలుపాక్ దాడులు, భారత్ ప్రతిదాడులపై ప్రధాని మోదీ సమీక్షసరిహద్దులతో పరిస్థితులపై అజిత్ ధోవల్‌తో చర్చసరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీపాకిస్థాన్‌పై కౌంటర్ ఎటాక్ దిగిన భారత్‌లాహోర్, సియాల్కోట్, కరాచీపై భారత్ ప్రతిదాడిజమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌ఆరేబియా సముద్రంలో భారత నౌకాదళం గర్జనపాక్‌పై గురిపెట్టిన 26 యుద్ధనౌకలుపాక్‌లోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసిన ఇండియన్ నేవీఇప్పటికే కరాచీ సీ పోర్టును ధ్వంసం చేసిన భారత్ నేవీ👉సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్ ఫైటర్ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్ మొదలుకుని జమ్మూ కశ్మీర్ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి.👉శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్ఎస్ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది.👉మన ‘ఆకాశ్’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్ యుద్ధ విమానాన్ని ఎస్–400 వ్యవస్థ నేలకూలి్చంది. వాటిలో రెండు జేఎఫ్–17, ఒక ఎఫ్–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది.👉ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, కరాచీ, రావలి్పండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్ తదితర నగరాల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్ వారి్నంగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్)ను తుత్తునియలు చేసింది. పాక్ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచి్చతత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.👉సరిహద్దు భద్రతా చీఫ్‌లతో అమిత్ షా భేటీ ఇరువైపులా పరస్పర దాడుల వేళ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సహా వేర్వేరు సరిహద్దు భద్రతా చీఫ్‌లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) బలగాల అధినేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంట తాజా పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల వద్ద భద్రతా పరిస్థితులపై సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) చీఫ్‌తో అమిత్ షా చర్చించారు. ఇండో–పాక్ సరిహద్దుసహా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట భద్రతను బీఎస్ఎఫ్ బలగాలు చూసుకుంటున్నాయి. ఇక చైనాతో సరిహద్దు వెంట పహారా బాధ్యతలను ఐటీబీపీ, నేపాల్, భూటాన్లతో సరిహద్దు భద్రతను సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ) బలగాలు పర్యవేక్షిస్తున్న విషయం విదితమే.

రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ సూచనలు
భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, పరిపాలనాధికారులకు లేఖ రాసింది. సివిల్ డిఫెన్స్ రూల్స్‌కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించింది.ప్రజలు, ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడానికి.. శత్రు దాడి సమయంలో కీలకమైన సేవల నిరంతరాయ పనితీరును నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని హోం మంత్రిత్వ శాఖ తమ లేఖలో గుర్తు చేసింది.1968 నాటి పౌర రక్షణ నియమాలలోని సెక్షన్ 11, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను, ఆస్తులను హాని లేదా నష్టం నుండి రక్షించడానికి త్వరిత చర్యలు తీసుకునే అధికారం ఇస్తుంది. అటువంటి సంక్షోభాల సమయంలో విద్యుత్, నీటి సరఫరా, రవాణాతో సహా ముఖ్యమైన సేవలు నిరంతరాయంగా పనిచేస్తాయని కూడా ఇది నిర్ధారిస్తుంది.As per the communique, Section 11 of the Civil Defence Rules, 1968, can be invoked and necessary Emergency Procurement Powers to the Director Civil Defence of state/UT, may be granted so that efficient implementation of the necessary precautionary measures can be implemented.— ANI (@ANI) May 9, 2025

ఇండిగో కీలక ప్రకటన: 10 నగరాల్లో విమానాల రద్దు
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన 'ఇండిగో' మే 10న రాత్రి 11:59 గంటల వరకు 10 నగరాలకు విమాన సేవలను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రయాణికులు తమ బుకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవాలని, రీషెడ్యూల్ కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని ఎయిర్‌లైన్ సూచించింది. రేపు (శనివారం) రాత్రి 11:59 గంటల వరకు శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్‌పూర్, కిషన్‌గఢ్, రాజ్కోట్లకు విమాన సదుపాయం ఉండదు.విమానాలకు రద్దుకు కారణమేమిటనే విషయాన్ని.. ఎయిర్‌లైన్ అధికారికంగా వెల్లడించలేదు. కానీ భారతదేశంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య విమానాలను రద్దు చేసి ఉండొచ్చని సమాచారం. మే 10 తరువాత విమాన సేవలు యధావిధిగా కొనసాగుతాయా?, లేదా మళ్ళీ నిలిపివేస్తారా.. అనే విషయాన్ని ఇండిగో వెల్లడించాల్సి ఉంది.ఇలాంటి పరిస్థితిలో ప్రయాణికులు ఏం చేయాలి?➤అప్డేట్ కోసం కోసం ఇండిగో మెసేజస్ లేదా ఇమెయిల్‌లను చేస్తూ ఉండండి.➤రీషెడ్యూల్ చేయడానికి లేదా రద్దు చేయడానికి ఎయిర్‌లైన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌ను సందర్శించండి.➤ప్రత్యామ్నాయ ప్రయాణ ఎంపికల కోసం కస్టమర్ సేవను సంప్రదించండి.ప్రయాణికులు విమానయాన శాఖ అడ్వైజరీ➤ఎయిర్‌పోర్ట్‌లకు మూడు గంటల ముందుగానే చేరుకోవాలి.➤75 నిమిషాల ముందే చెక్ ఇన్ క్లోజ్ అవుతుంది.#6ETravelAdvisory: Your safety is paramount. Flights to/from the following cities are cancelled until 2359 hrs on 10th May. We are here to help you travel with ease. Check flight status here https://t.co/ll3K8PwtRV. To rebook or claim a refund, visit https://t.co/51Q3oUe0lP. pic.twitter.com/v5BSdX3dDo— IndiGo (@IndiGo6E) May 9, 2025

మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
లాహోర్, కరాచీ, రావల్పిండితో సహా పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకట్టవేయలేకపోయిందన్నారు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. తమ దళాలు అడ్డగించి కూల్చివేసాయని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. భారత డ్రోన్లను పాక్ అడ్డుకోలేకపోయిందంటూ క్లారిటీ ఇచ్చారు. ‘మన ఎయిర్ డిఫన్స్ వ్యవస్థ విఫలమైంది. పాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది. మన రక్షణ విభాగం పూర్తిగా విఫలమైంది. ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. గోప్యత పాటించాల్సిన కారణంగా ఇంకా వివరణ ఇవ్వలేను’ అని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు. దీనిపై పాక్ ప్రతిపక్ష ఎంపీలు(పీటీఐ పార్టీకి చెందిన వారు) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం పాకిస్తాన్ అన్ని రకాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్ఏ దాడులతో ఊపిరి తీసుకోలేని పరిస్థితికి చేరుకుంది. తెహ్రిక్‌ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు.పాక్ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్ చేశారు. పాక్ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని షెహబాజ్‌పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్ పిరికిపంద అంటూ పాక్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.“We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025 “We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025

ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. బాబు సర్కార్‌కు సజ్జల వార్నింగ్
సాక్షి, గుంటూరు: గుంటూరు సీఐడి కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని.. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు.‘‘దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్లో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందునుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘మా వాళ్లు కేసు ఇస్తే తీసుకోలేదు.. వాళ్లు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది?. మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది. పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలటం లేదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించండి’’ అంటూ సజ్జల హితవు పలికారు.‘‘మీరు ఎంతమందిని జైలులో పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసే. ఏడాది దాటింది.. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

దెబ్బ మీద దెబ్బ.. భారత్ దాడులతో పాక్ బెంబేలు
పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెహ్రిక్‌ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు. ఇదిలా ఉండగా, పాక్ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్ చేశారు. పాక్ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని షెహబాజ్‌పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్ పిరికిపంద అంటూ పాక్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.హెచ్‌క్యూ–9పీ, హెచ్‌క్యూ–9బీఈ, ఎఫ్ డీ– 2000, హెచ్‌క్యూ–16ఎఫ్ఈ గగనతల రక్షణ వ్యవస్థలపై పాక్ ఆధారపడుతోంది. వీటితోపాటే పాతతరం ఎల్వై–80, ఎఫ్ఎం–90 రకాలూ ఎంతోకొంత పాక్‌కు సాయపడుతున్నాయి. 40 కిలోమీటర్ల స్థాయిలో లక్ష్యాలను ఛేదించడానికి ఎల్వై–80ను పాక్ వాడుతోంది. మే 7వ తేదీ అర్థరాత్రి దాటాక భారత్ చేసిన దాడిలో హెచ్‌క్యూ–16 వ్యవస్థ నాశనమైంది. చైనా నుంచి 2021లో హెచ్‌క్యూ–9పీ దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను దిగుమతి చేసుకుంది. తమ గగనతలంలోకి వచ్చిన శత్రు క్షిపణులను 125 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి నేలమట్టంచేయగలదు. యుద్ధ విమానాలనూ అడ్డుకోగలదు.

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా.. అధికారిక ప్రకటన
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ ఇవాళ (మే 9) అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేదిక, తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. యుద్ద పరిస్థితుల్లో లీగ్ నిర్వహించలేమని బీసీసీఐ చెప్పింది. దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని బోర్డు ఉన్నతాధికారి వివరించారు. ఉద్రిక్తతల కారణంగా పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దునిన్న (మే 8) ధర్మశాల వేదికగా పంజాబ్-ఢిల్లీ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైన మ్యాచ్‌ను బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు.మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్ ద్వారా పఠాన్‌కోట్ గుండా ఢిల్లీకి తరలించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ స్కోర్ 122/1గా (10.1 ఓవర్లలో) ఉండింది. పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (34 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) భారీ షాట్లతో విధ్వంసం సృష్టించారు.ఏం జరిగిందంటే..?ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత కొద్ది రోజుల కామ్‌గా ఉన్న భారత్.. ఈ మంగళవారం అర్దరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరిట సాగిన ఈ ప్రతి దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇందుకు బదులుగా పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. రాకెట్లు, మిసైళ్లతో జనావాసాలను టార్గెట్ చేసింది. పాక్ దుశ్చర్యకు భారత్ సైతం ధీటుగా బదులిస్తోంది. భారత బలగాలు పాక్ మిస్సైల్లను గాల్లోనే పేల్చేస్తున్నాయి. సమాంతరంగా పాక్‌లోని కీలక నగరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే భారత బలగాలు పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి. అయినా పాక్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. కాల్పులకు పాల్పడుతూనే ఉంది.

138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
ప్రస్తుత కాలంలో అందర్నీ భయపెడుతున్న సమస్య అధిక బరువు. జీవన శైలి, ఆహార అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు పెరిగిపోతున్నారు. చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఈ బాధలనుంచి విముక్తి పొందేందుకు, స్లిమ్‌గా కనిపించేందుకు భారీ కసరత్తులే చేస్తున్నారు. అంతేకాదు బరువు తగ్గడంతో తాము సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 14 నెలల్లో 63 కిలోలు తగ్గిన మహిళ వెయిట్ లాస్ జర్నీ నెట్టింట వైరల్‌గా మారింది. ఈమె కథ చాలా హైలైట్‌గా నిలిచింది. కొన్ని టిప్స్‌ను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. అవేంటో తెలుసుకుందాం ఈ కథనంలో.ఫిట్నెస్ మోడల్ నెస్సీ చుంగత్ వెయిట్ లాస్ జర్నీ చాలా స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. 138 కిలలో బరువున్న ఆమె కష్టపడి 75 కిలోలకు చేరింది. 2023లో నవంబరులో మొదలు పెట్టి, 2025 జనవరి నాటికి అంటే 14 నెలల్లో ఏకంగా 63 కిలోల బరువు తగ్గించుకుంది. "138 కిలోల నుండి బరువు తగ్గే ప్రయాణం అంత సులభం కాదు" అని నెస్సీ తన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను 40 లక్షలమంది వీక్షించారు. బరువు తగ్గాలనే స్థిర చిత్తం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, బలమైన సంకల్ప శక్తి ద్వారా 63 కిలోల బరువును తగ్గించుకుంది. "ఇది ఒక మైండ్ గేమ్" అని చెబుతుంది నెస్సీ.‘‘ఇక నేను చేయలేను .. ఆపేస్తా..’’అని చాలాసార్లు అనిపించినా .. ఆమె దివంగత తల్లి ఊబకాయం సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడిన తీరు గుర్తొచ్చి, తన ప్రయత్నాన్ని కొనసాగించింది. తన సొంత అనుభవంతో రూపొందించుకున్న నిబంధనలు, సూత్రాల ద్వారా నెస్సీ తన ఫ్యాట్‌ను తగ్గించుకునే ప్లాన్‌కు కట్టుబడి ఉంది. చివరికి అనుకున్నది సాధించింది.ఇదీ చదవండి: రెండేళ్ల వయసులో అనాథలా ఆశ్రమానికి : కట్ చేస్తే..!మూడంటే..మూడు టిప్స్షుగర్కు చెక్: ముఖ్యంగా మూడే మూడు డైట్ చిట్కాలు పాటించినట్టు నెస్సీ చెప్పుకొచ్చింది. చక్కెరను తగ్గించండి, కానీ ఆనందాన్ని , సంతోషాన్ని కాదు సుమా. రోజువారీ ఆహారం నుంచి చక్కెను పూర్తిగా తొలగించాలి. కానీ వారానికి ఒక కేక్ ముక్క లేదా చిన్న చాక్లెట్ ముక్క తినవచ్చు.ఉదయాన్నే వేడి నీళ్లు : ఉదయం గోరువెచ్చని నీటితో ప్రారంభించాలి. ఇది ఒక చిన్న అడుగే, కానీ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఇది వెయిట్లాస్కు బాగా ఉపయోగపడుతుంది.చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీట్రస్ట్ది ప్రాసెస్: మీరు పాటిస్తున్న పద్ధతిపై విశ్వాసాన్ని కోల్పోకండి. అద్దాన్ని కాదు.. నమ్మేది.. ట్రస్ట్‌ది ప్రాసెస్ మొదలు పెట్టిన తొలినెలలో మార్పు కనిపించకపోతే.. భయపడకండి అంటుంది ఆమె. ఆ నమ్మకమే తనకు బాగా ఉపయోగపడిందని నెస్సీ వెల్లడించింది. తక్షణం వచ్చే ఫలితంపై కాకుండా, నిరాశపడకుండా, దీర్ఘకాలిక లక్ష్యంపై గురి పెట్టి తన శరీర బరువును తగ్గించుకున్న నెస్సీ స్టోరీ నెటిజనులను బాగా ఆకర్షిస్తోంది.నోట్ : బరువు పెరగడం, తగ్గడం అనేది శరీరతత్వం, మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి శరీరం భిన్నంగా ఉంటుందనే గమనించాలి. ఆరోగ్య మార్పులు, వ్యాయామం, విశ్వాసం ప్రధాన పోషిస్తాయి. ఏదైనా కొత్త ఆహారం లేదా ఫిట్నెస్ దినచర్యను ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Nessy chungath ❇️🧸🌸 (@call_me_nessykutty)

‘#సింగిల్’ మూవీ రివ్యూ
శ్రీవిష్ణు.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది ఓం భీమ్ బుష్, శ్వాగ్ చిత్రాలతో రెండు సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రీవిష్ణు.. ఇప్పుడు ‘#సింగిల్’ అంటూ ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్లుగా నటించగా, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. . ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘సింగిల్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మే 9) ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(#Single Movie Review).కథేంటంటే..?ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. విజయ్ ఓ బ్యాంక్‌లో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్‌గానే ఉంటాడు. తన జీవితంలోకి కూడా ఒక అమ్మాయి రావాలని ప్రతి రోజు ఆ దేవుడిని కోరుకుంటాడు. ఓ సారి మెట్రో ట్రైన్లో పూర్వ(కేతికా శర్మ)ను చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి స్నేహితుడు అరవింద్(వెన్నెల కిశోర్)తో కలిసి రకరకాల ప్లాన్ వేస్తాడు. ఇదే సమయంలో విజయ్ లైఫ్‌లోకి హరిణి(ఇవానా) వస్తుంది. పూర్వని ప్రేమలో పడేయడానికి విజయ్ ఏంఏం పనులో చేస్తాడో.. హరిణి కూడా కూడా అలానే చేస్తుంది. అసలు హరిణి ఎవరు? విజయ్ ఛీ కొట్టినా అతని వెనకాలే ఎందుకు తిరిగింది? చివరకు విజయ్ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదా హరిణి ప్రేమలో విజయ్ పడిపోయాడా? లేదంటే మళ్లీ విజయ్ సింగిల్‌గానే మిలిగిపోయాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే(#Single Movie Review ).ఎలా ఉందంటే.. హీరో ఒక హీరోయిన్ని ప్రేమించడం, మరో హీరోయిన్ అతన్ని ప్రేమించడం.. చివరకు ఈ విషయం ముగ్గురికి తెలిసి.. ఒకరు త్యాగం చేసి మరొకరు హీరోని పెళ్లి చేసుకోవడం.. ట్రయాంగిల్ లవ్‌స్టోరీలు అన్ని ఇలానే ఉంటాయి. దర్శకుడు కార్తీక్ రాజు రాసుకున్న స్టోరీ కూడా ఇలానే ఉంటుంది కానీ క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చిన ట్వీస్ట్ కొత్తగా ఉంటుంది. ‘క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటే నా కల్ట్ ప్యాన్స్ ఒప్పుకోరు’ అంటూ హీరోతోనే ఓ డైలాగ్ చెప్పించడమే కాకుండా..దానికి తగ్గట్లుగానే ముగింపు డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. కథ పరంగా చూస్తే ఇదొక్కటే కొత్త పాయింట్. మిగతాదంతా రొటీన్, రెగ్యులర్ స్టోరీ. కానీ దర్శకుడు దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ , రాసుకున్న స్క్రీన్‌ప్లే సినిమాను కాపాడాయి. తెలిసిన కథే అయినా తెరపై శ్రీవిష్ణు వేసే పంచ్ డైలాగులకు, వెన్నెల కిశోర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ని అందిస్తాయి. ఎలాంటి సాగదీతలు లేకుండా సినిమా ప్రారంభంలోనే ట్రైయాంగిల్ ప్రేమకథను మొదలు పెట్టాడు దర్శకుడు. పూర్వని పడేసేందుకు విజయ్ చేసే పనులన్నీ రొటీన్‌గానే ఉన్నా.. శ్రీవిష్ణు బాడీ లాంగ్వెజ్, వన్‌లైన్ పంచ్‌లు బాగా పెలడంతో బోర్ కొట్టదు. కథ ఏమిలేకున్నా ఫస్టాఫ్ కథనం ఫాస్ట్‌గానే సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. అయితే మూర్తి(రాజేంద్ర ప్రసాద్) పాత్ర ఎంట్రీ తర్వాత కథనం కొంతమేర ఎమోషనల్‌గా సాగుతుంది. ఇక చివరి 20 నిమిషాలు డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు దర్శకుడు. ఓ యంగ్ హీరో తో పాటు ఇద్దరు హీరోయిన్లు గెస్ట్ అప్పీయరెన్స్ ముగింపు మరింత కొత్తగా అనిపిస్తుంది. ముందుగా చెప్పినట్లు చెప్పుకోవడానికి పెద్ద కథ లేకపోయినా.. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటాం. ఎలాంటి అంచనాలు లేకుండా.. కొత్తదనం ఆశించకుండా సినిమాకు వెళితే మాత్రం కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. శ్రీవిష్ణు ఓ సినిమా ఒప్పుకున్నాడంటే..అందులో కొత్త పాయింట్ అయినా ఉండాలి లేదంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయినా అందించాలి. ఇది రెండో రకం సినిమా. దానికి తగ్గట్లుగానే శ్రివిష్ణు తనదైన బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించాడు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇదే సినిమాకు ప్లస్ అయింది. రొటీన్ సీన్లను కూడా తనదైన నటనతో హీలేరియస్‌గా మార్చేశాడు. ఇందులో బూతు డైలాగులు ఉన్నప్పటికీ.. అవి బూతులు అనే విషయం తెలియకుండా శ్రీవిష్ణు తనదైన డైలాగ్ డెలివరీతో మ్యానేజ్ చేశాడు. శ్రీవిష్ణుకి తోడుగా వెన్నెల కిశోర్ ఉండడం మరో ప్లస్ పాయింట్. కామెడీ విషయంలో వీరిద్దరు పోటీపడి నటించారు. కేతికా శర్మ, ఇవానా కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక రాజేంద్రప్రసాద్ తెరపై కనిపించేంది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విశాల్ చంద్ర శేఖర్ అందించిన పాటలు గుర్తుంచుకునే విధంగా ఉండవు కానీ కథలో భాగంగా వస్తూ.. వినసొంపుగానే ఉంటాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్, ఆర్ట్స్ డిపార్ట్‌మెట్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉనాయి.

ఉర్సాకు పెట్టుపోతలు పూర్తయినట్టేనా?
కంపెనీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాయితీల్లాంటివి ఇవ్వడం సహజమే కానీ.. ఓ స్టార్టప్ కంపెనీకి ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టే ప్రయత్నం మాత్రం కని విని ఎరగనిదే! ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రెండు నెలల వయసున్న ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో సుమారు 60 ఎకరాల భూమిని ధారాదత్తం చేసింది. ప్రతిపక్షాల అభ్యంతరాలు, ఆందోళనలన్నింటినీ తోసిరాజంటోంది అక్కడి ప్రభుత్వం. ఉర్సా వ్యవస్థాపకుల గత చరిత్ర.. వారి వెనుక ఉన్న పెద్దల సంగతి అన్నింటిలోనూ పలు అనుమానాలున్నా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రభుత్వం భూమిని కట్టబెట్టేందుకే సై అనింది.పెందుర్తి విజయకుమార్, అబ్బూరి సతీష్ అనే ఇద్దరు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు మొదట వార్తలొచ్చినా.. ఆ తరువాత కంపెనీ డైరెక్టర్లుగా కొత్త కొత్త పాత్రలు ప్రవేశిస్తున్నాయి. అమెరికా వాసి తాళ్లూరి జయశేఖర్ అనే వ్యక్తి ఉర్సా తరఫున ఆన్లైన్లో మీడియా సమావేశం నిర్వహించి తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. అయితే అనుకూల మీడియాతోనే నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన పలు అంశాలకు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. ఈ కంపెనీ సుమారు రూ.5600 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెబుతున్నారు.తొలుత రూ.200 కోట్లు వచ్చిస్తారట. ఆర్థిక సహకారం అందించే వారెవ్వరన్నది వారి కోరిక మేరకు రహస్యంగా ఉంచారట. ఈయనకు బీజేపీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్‌కూ బంధుత్వం కూడా ఉందట. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేరు ఈ వివాదంలోకి రావడం, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నానినే ఆరోపణలు సంధించడం సంచలనంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటటన్నది ఇంకా స్పష్టత రానప్పటికీ, డీల్ వెనుక చాలా ప్రముఖుల హస్తమే ఉండవచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. పరిశ్రమల ముసుగులో ఎవరికి పడితే వారికి, ఇష్టారీతిన భూములు కట్టబెడితే అది ఏపీకి తీరని నష్టం చేస్తుంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక ఎలాగైనే చేయవచ్చులే అనుకుంటే అనుకోవచ్చు. కాని పరిస్థితి ఎల్లకాలం ఒకేలా ఉండకపోవచ్చు.విశాఖలో ప్రముఖ కంపెనీ టీసీఎస్‌కు ఎకరా కేవలం 99 పైసలకే కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. టీసీఎస్‌కు 21 ఎకరాలు ఇస్తే, ఊరు పేరు లేని ఈ ఉర్సా కంపెనీకి అరవై ఎకరాలా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. విశాఖలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది కనుక తమకు నచ్చిన వారికి పందారం చేస్తున్న నేతలు అమరావతిలో ఇచ్చి ఉండవచ్చు కదా అని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. ఉర్సా కంపెనీకి భూమి ఇస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఎవరికి అర్థం కాలేదు. డిజిటల్ మీడియా దీనిపై పరిశీలన చేసినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కంపెనీకి కూడా ఎకరా 99 పైసలకే ఇస్తున్నారన్న అభిప్రాయం కలిగింది.అప్పుడు కేవలం టీసీఎస్‌కు ఇచ్చిన భూమి విలువ చెప్పి ఈ ఉర్సా కంపెనీకి ఎంతకు ఇచ్చింది ప్రభుత్వం వెల్లడించలేదు. వివాదం చెలరేగిన తర్వాత ఉర్సా కంపెనీ డైరెక్టర్‌గా చెప్పుకున్న జయశేఖర్ తమకు ఎకరం రూ.ఏభై లక్షల చొప్పున ఇచ్చారని వెల్లడించారు. ఆ రకంగా చూసినా ఈ కంపెనీకి కేవలం రూ.మూడు వేల కోట్ల విలువైన భూమిని రూ.30 కోట్లకే ఇచ్చినట్లవుతుంది. అసలు ప్రభుత్వం భూమి అమ్మకం కాకుండా, లీజు పద్దతిలో ఇచ్చి ఉంటే, ఏదో కొంత ఎక్కువ, తక్కువకు భూమి కేటాయించారులే అని సరి పెట్టుకోవచ్చు.ఏ మాత్రం అనుభవం లేని సంస్థలకు భూములు అమ్మేస్తే, తదుపరి ఈ సంస్థలు ఆశించిన రీతిలో పని చేయకపోయినా, మూతపడినా, ఆ భూమి మాత్రం వారి సొంతం అవుతుంది. అప్పుడు వారికి భారీ లాభం చేకూరుతుంది కదా అన్నది మేధావుల భావన. దీనికి ప్రభుత్వం నుంచి ఎవరూ సమాధానం ఇస్తున్నట్లుగా లేదు. విశేషం ఏమిటంటే ఈ ఉర్సా కంపెనీ హైదరాబాద్‌లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ అడ్రస్ లో రిజిస్టర్ చేయడం. దీనికి ఒక వెబ్సైట్ కాని, ఇతరత్రా సిబ్బంది తదితర హంగు ఆర్భాటాలేవీ లేవు. ఆ తర్వాత ఏదో వెబ్‌సైట్‌ను చూపించినా, దాని అనుమతి ఒక ఏడాదికే ఉన్నట్లు తెలిసింది. అందులో ఉన్న వివరాలపై కూడా అనేక సందేహాలు వచ్చాయి.మాజీ ఎంపీ కేశినేని నాని అయితే ఈ కంపెనీ టీపీపీ ఎంపీ కేశినేని చిన్ని బినామీ సంస్థ అని ఆరోపించారు. అబ్బూరి సతీష్, ఈయన వ్యాపార భాగస్వాములని, ఒక ప్రాపర్టీ సంస్థను స్థాపించి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. విశాఖలో భూమి కొట్టేయడానికే ఈ ప్లాన్ అని ఆయన అన్నారు. దీన్ని చిన్ని ఆయన మద్దతుదారులు కొందరు ఖండించినప్పటికీ, అసలు ఉర్సా కంపెనీ సామర్ధ్యం, అమెరికాలో ఈ సంస్థ కట్టిన పన్ను, అనుభవం తదితర వివరాలు బయటకు వచ్చాక, ఇది ఎవరికో బినామీనే అన్న అనుమానాలు బలపడ్డాయి. సతీష్ అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి. పెందుర్తి విజయకుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నారని వైసీపీ సంయుక్త కార్యదర్శి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంత్రి లోకేశ్‌కు వీరికి ఉన్న స్నేహ సంబంధాలపై కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన దీనిపై వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు.ఏ కంపెనీ అయినా పెట్టుబడి పెడతామని అంటే పరిశ్రమల శాఖ అన్ని విషయాలను పరిశీలించాలి. అవేవి చూడకుండా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించి, ఆ పైన మంత్రివర్గం ఓకే చేయడం కచ్చితంగా సందేహాలకు తావిస్తుంది. ఒక వైపు గత ప్రభుత్వ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అధికంగా ఆర్డర్లు, మరికొన్నిటికి తక్కువ ఆర్డర్లు ఇవ్వడంతో రూ.మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వం పిచ్చి కేసు పెడుతోంది. మరో వైపు ఒక్క డీల్లోనే రూ.మూడు వేల కోట్ల భూమి స్కామ్ కు ప్రభుత్వ పెద్దలు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖను కారుచౌకగా అమ్మేస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, దేశంలో కూడా గగ్గోలుగా చెప్పుకుంటున్నారు.గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి బోగస్ కంపెనీలకు భూములు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లో బిల్లీరావు అనే వ్యక్తి సంస్థకు 400 ఎకరాల భూమిని విక్రయించడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అలాగే సదస్సులు పెట్టి పలు బోగస్ ఒప్పందాలు చేసుకున్నారన్న అప్రతిష్ట కూడా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చింది. ఏది ఏమైనా ఉర్సా కంపెనీకి అరవై ఎకరాల భూమి కేటాయింపును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తుందా?లేక ఇదే రీతిలో ముందుకు సాగుతుందా అన్నది చర్చ.కాని ప్రభుత్వం తీరు చూస్తే ఈ అడ్డగోలు తతంగాన్ని కొనసాగించేలానే కనిపిస్తోంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
జవాన్ మురళి నాయక్ మృతి పట్ల బండి సంజయ్ దిగ్భ్రాంతి
మంచు మనోజ్.. 'కన్నప్ప'తో పోటీ పడట్లేదు
సీఎం చంద్రబాబుకు నిరసన సెగ
ఇషా అంబానీ డైమండ్ నెక్లెస్ రూ. 1,267 కోట్లా? నెయిల్ ఆర్ట్ స్పెషల్ ఏంటి?
ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్‌కు బాంబు బెదిరింపులు
మా సపోర్ట్ సైనికులకే.. లాభాల్లో కొంత భాగం వాళ్లకే
ఈ సమ్మర్లో చిన్నారులకు కథ రాయడం నేర్పండిలా..!
రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ సూచనలు
రూ.50 లక్షల ఆభరణాలు : చెల్లని చెక్కు ఇచ్చి చెక్కేసిన కిలాడీ
ఐపీఎల్ వాయిదా ఎన్ని రోజులంటే? బీసీసీఐ కీలక ప్రకటన
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. శుభవార్తలు వింటారు
మొదట్నుంచి మీరే ఏదో రకంగా విదేశీయులకు హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూపిస్తున్నారుగా సార్!!
ఫ్లాష్ ఫ్లాష్: పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..30 మంది ఉగ్రవాదుల హతం
ఆపరేషన్ సిందూర్ అప్డేట్స్.. రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం
భారత్ దాడులు.. పాక్ ప్రధాని రియాక్షన్ ఇదే..
ప్రసాదంలో పాము పిల్ల
టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: హార్దిక్
MI vs GT: ముంబై జోరుకు బ్రేక్
పవన్, విజయ్ ఇద్దరూ ఒక్కటే.. అవగాహన శూన్యం: ప్రకాష్‌రాజ్
అక్కడ జరిగిందేమిటి?.. మీరు చేస్తున్నదేమిటి?
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్.. లైవ్
భారత్‌కే మా మద్ధతు- భారత్‌కు ప్రపంచ దేశాల మద్ధతు
భారత్ తడాఖా.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ విలవిల (ఫొటోలు)
Operation Sindoor: శాంతించండి.. ‘ఆపరేషన్ సిందూర్’పై.. భారత్‌కు చైనా రిక్వెస్ట్
కన్నీటి నిశ్చితార్థం
Operation Sindoor: ‘ఆపరేషన్ సింధూర్’ అంటే ఏమిటి?
ఆపరేషన్ సిందూర్.. అర్ధరాత్రి ఎప్పుడేం జరిగింది..
భారత్ విమానాలు కూల్చివేత అంటూ పాక్ ప్రచారం.. నిజమెంత?
ఒక తార పుట్టింది!
భారత్ మెరుపు దాడులపై స్పందించిన ట్రంప్, పాక్
జవాన్ మురళి నాయక్ మృతి పట్ల బండి సంజయ్ దిగ్భ్రాంతి
మంచు మనోజ్.. 'కన్నప్ప'తో పోటీ పడట్లేదు
సీఎం చంద్రబాబుకు నిరసన సెగ
ఇషా అంబానీ డైమండ్ నెక్లెస్ రూ. 1,267 కోట్లా? నెయిల్ ఆర్ట్ స్పెషల్ ఏంటి?
ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్‌కు బాంబు బెదిరింపులు
మా సపోర్ట్ సైనికులకే.. లాభాల్లో కొంత భాగం వాళ్లకే
ఈ సమ్మర్లో చిన్నారులకు కథ రాయడం నేర్పండిలా..!
రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ సూచనలు
రూ.50 లక్షల ఆభరణాలు : చెల్లని చెక్కు ఇచ్చి చెక్కేసిన కిలాడీ
ఐపీఎల్ వాయిదా ఎన్ని రోజులంటే? బీసీసీఐ కీలక ప్రకటన
సినిమా

Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ
స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’. ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌లో సమంత పాల్గొనడం..వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి ఆసక్తికర విషయాలు చెప్పడంతో ‘శుభం’పై బజ్ క్రియేట్ అయింది. ఓ మోస్తరు అంచనాల మధ్య నేడు(మే 09) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వైజాగ్‌లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను(హర్షిత్‌రెడ్డి)‘మన టౌన్ కేబుల్ టీవీ’ ఆపరేటర్. అతని స్నేహితులు(గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ)లకు అల్రేడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరిదా, గాయత్రి(శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి) చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా.. బ్యాచిలర్ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లీ(శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్ అయిపోతాడు. ఫస్ట్‌నైట్ రోజు శ్రీవల్లీ శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్ మెదలవుతుంది. రాత్రి 9గంటలు కాగనే శ్రీవల్లి టీవీ ఆన్ చేసి ‘జన్మజన్మల బంధం’ సీరియల్ చూస్తుంది. ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీను అడిగితే..దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిసుంది. ఇది తన ఒక్కడి సమస్యే అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్‌కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ(సమంత) వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది? అనేది తెలియాలంటే ‘శుభం’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..సందేశం ఇవ్వాలంటే కథను సీరియస్‌గానే చెప్పాలా? లేదంటే ఇదిగో మేం ఈ మంచి మేసేజ్ ఇస్తున్నాం అని తెలిసేలా సన్నివేశాలను తీర్చిదిద్దాలా? అలా చేయకుండా, నవ్విస్తూ కూడా ఓ మంచి విషయం చెప్పొచ్చు అనేది ‘శుభం’ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల. సీరియల్ పిచ్చి అనే కాన్సెప్ట్‌ని తీసుకొని.. అందులోనే పురుషాధిక్యత ఎత్తిచూపుతూ మహిళల అణచివేత, ఆత్మాభిమానం లాంటి సున్నితమైన అంశాలను జోడించి, కథను నడిపించిన తీరు చాలా బాగుంది. చిన్న చిన్న సన్నివేశాలతోనే మంచి సందేశం ఇచ్చాడు. ఓ హారర్-కామెడీ చిత్రంలో ఇలాంటి మంచి విషయం చెప్పడం ‘శుభ’ పరిణామం. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే కామెడీ-హారర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో హారర్ నేపథ్యం అంతగా ఆకట్టుకోలేదు. కామెడీ కొన్ని చోట్ల మాత్రమే నవ్వులు పూయిస్తుంది. అయితే ఈ హారర్ కానీ, కామెడీ కానీ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ఇంతకు మంచి కామెడీ-హారర్ కథలను మనం చూశాం. ఉన్నంతలో కొత్తదనం ఏదైన ఉందంటే.. సీరియల్‌కి ముడిపెడుతూ నిజ జీవిత వ్యక్తులను హారర్ యాంగిల్లో చూపించడమే. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. పెళ్లి చూపులు, పెళ్లి, ఫస్ట్‌నైట్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. ఫస్ట్‌నైట్ రోజు శ్రీవల్లీ ఇచ్చే ట్విస్ట్‌తో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆ ఆసక్తిని మరింత పెంచుతుంది. అయితే సెకండాఫ్‌కి వచ్చేసరికి మాత్రం కథనం కాస్త గాడి తప్పుతుంది. సమస్యను పరిష్కరించుకునేందుకు శ్రీనుబృందం చేసే ప్రయత్నం సాగదీతగా అనిపిస్తుంది. ఇక లాజిక్ గురించి ప్రస్తావించకపోవడమే మంచింది. దర్శఖుడు తన ‘సినిమా బండి ’టీమ్‌ని ఈ కథకు వాడుకున్న విధానం బాగుంది. అయితే సీరియల్ సమస్యను క్లోజ్ చేసే సన్నివేశాలు కూడా సీరియల్‌గా సా..గడంతో కథ అక్కడడక్కడే తిరిగినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా కథను తీర్చిదిద్దారు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం కొత్త నటీనటులతోనే తెరకెక్కించారు. అయినా కూడా ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కేబుల్ ఆపరేటర్‌గా హర్షిత్ రెడ్డి, అతని స్నేహితులుగా గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ బాగా నటించారు. ఇక ఈ ముగ్గురి భార్యలుగా శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి తమదైన నటనతో కొన్ని చోట్ల భయపెడుతూనే నవ్వించారు. ముఖ్యంగా శ్రీవల్లీగా శ్రీయ కొంతం తనదైన నటనతో ఆకట్టుకుంది..సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని కథకు తగ్గట్లుగా ఉంది. సమంత నిర్మించిన తొలి చిత్రం కాబట్టి నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయని చెప్పలేం కానీ.. సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

'థగ్ లైఫ్' ఈవెంట్ వాయిదా.. ఇది వేడుకల సమయం కాదు: కమల్
కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. మే 16న ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో జరగాల్సి ఉంది. అయితే, భారత్-పాకిస్థాన్ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. ఇలాంటి సమయంలో భారత పౌరలకు ఇబ్బంది కలిగించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.'ఆర్ట్ కెన్ వెయిట్.. ఇండియా కమ్స్ ఫస్ట్' అనే శీర్షికతో కమల్ హాసన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'మన దేశ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మే 16న జరగాల్సిన 'థగ్ లైఫ్' ఆడియో విడుదలను వాయిదా వేస్తున్నాం. తిరిగి షెడ్యూల్ వివరాలను తెలుపుతాము. మన సైనికులు మన మాతృభూమి రక్షణలో అచంచలమైన ధైర్యంతో ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నారు. ఇది నిశ్శబ్ద సంఘీభావం కోసం నిర్ణయం తీసుకున్నాం. వేడుకలకు ఇదీ సరైన సమయం కాదని నేను నమ్ముతున్నాను. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం' అని ఆయన పంచుకున్నారు.‘నాయగన్’ (1987) వంటి హిట్ మూవీ తర్వాత 38 సంవత్సరాలకు మళ్లీ కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో ‘థగ్ లైఫ్’ సినిమా వస్తుంది. శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకుడిగా, రవి కె. చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. Statement from Kamal Haasan#Thuglife #ThuglifeFromJune5 #KamalHaasan #SilambarasanTR @ikamalhaasan #ManiRatnam @arrahman @SilambarasanTR_ #Mahendran @bagapath @trishtrashers @AishuL_ @AshokSelvan @abhiramiact @C_I_N_E_M_A_A #Nasser @manjrekarmahesh @TanikellaBharni… pic.twitter.com/jkMiXDBNG0— Raaj Kamal Films International (@RKFI) May 9, 2025

పాక్ నటుడు చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి ఫైర్
పాక్ నటుడు ఫవాద్ ఖాన్‌పై బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ (Rupali Ganguly) మండిపడ్డారు. పహల్గాం ఘటనతో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పాక్ నటుడు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమె ఒక పోస్ట్ పెట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడులను ఫవాద్ ఖండించాడు. ఈ సిగ్గుచేటైన దాడిలో గాయపడిన, మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అంటూ పాక్‌కు పూర్తి మద్ధతుగా వ్యాఖ్యలు చేశాడు. ఆపై భారత్‌ను తక్కవ చేస్తూ కామెంట్లు చేశాడు. దీంతో బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ ఫైర్ అయింది.సోషల్ మీడియా వేదికగా ఫవాద్ గురించి ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ' మీలాంటి వాళ్లు ఇండియన్ సినిమాల్లో నటించడం మాకు సిగ్గుచేటు' అని అతని ఫోటోను షేర్ చేసింది. దానికి ఆపరేషన్ సిందూర్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హ్యాష్ ట్యాగ్‌లను ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఫవాద్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. భారతీయ సినిమాల మీద ఆధారపడి బతికిన నువ్వు మా గురించి మాట్లాడటం ఏంటి అంటూ విరుచుకుపడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ కూడా అతన్ని విమర్శించకపోవడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్‌పై వ్యాఖ్యలు చేసిన పాక్ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్‌లను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఖండించింది. వారిని వెంటనే పరిశ్రమ నుంచి బహిష్కరించాలని కోరింది. సినిమాల పేరుతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఇలాంటివారికి గుడ్డిగా ఎవరూ మద్దతు ఇవ్వొద్దని చిత్ర పరిశ్రమను అసోసియేషన్ కోరింది. ఫహల్గామ్ దాడి తర్వాత వెంటనే ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ‘అబీర్ గులాల్’ సినిమాను భారత్‌లో బ్యాన్ చేశారు. ఆపై పాక్ యూట్యూబ్, ఓటీటీ సంస్థల కంటెంట్‌ను ఇండియాలో స్ట్రీమింగ్ కాకుండా పూర్తిగా బ్యాన్ చేశారు. You working in Indian films was also 'shameful' for us.#OperationSindoor #IndianArmy #IndianAirForce pic.twitter.com/B7CeuQcb2t— Rupali Ganguly (@TheRupali) May 7, 2025

‘#సింగిల్’ మూవీ రివ్యూ
శ్రీవిష్ణు.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది ఓం భీమ్ బుష్, శ్వాగ్ చిత్రాలతో రెండు సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రీవిష్ణు.. ఇప్పుడు ‘#సింగిల్’ అంటూ ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్లుగా నటించగా, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. . ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘సింగిల్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మే 9) ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(#Single Movie Review).కథేంటంటే..?ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. విజయ్ ఓ బ్యాంక్‌లో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్‌గానే ఉంటాడు. తన జీవితంలోకి కూడా ఒక అమ్మాయి రావాలని ప్రతి రోజు ఆ దేవుడిని కోరుకుంటాడు. ఓ సారి మెట్రో ట్రైన్లో పూర్వ(కేతికా శర్మ)ను చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి స్నేహితుడు అరవింద్(వెన్నెల కిశోర్)తో కలిసి రకరకాల ప్లాన్ వేస్తాడు. ఇదే సమయంలో విజయ్ లైఫ్‌లోకి హరిణి(ఇవానా) వస్తుంది. పూర్వని ప్రేమలో పడేయడానికి విజయ్ ఏంఏం పనులో చేస్తాడో.. హరిణి కూడా కూడా అలానే చేస్తుంది. అసలు హరిణి ఎవరు? విజయ్ ఛీ కొట్టినా అతని వెనకాలే ఎందుకు తిరిగింది? చివరకు విజయ్ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదా హరిణి ప్రేమలో విజయ్ పడిపోయాడా? లేదంటే మళ్లీ విజయ్ సింగిల్‌గానే మిలిగిపోయాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే(#Single Movie Review ).ఎలా ఉందంటే.. హీరో ఒక హీరోయిన్ని ప్రేమించడం, మరో హీరోయిన్ అతన్ని ప్రేమించడం.. చివరకు ఈ విషయం ముగ్గురికి తెలిసి.. ఒకరు త్యాగం చేసి మరొకరు హీరోని పెళ్లి చేసుకోవడం.. ట్రయాంగిల్ లవ్‌స్టోరీలు అన్ని ఇలానే ఉంటాయి. దర్శకుడు కార్తీక్ రాజు రాసుకున్న స్టోరీ కూడా ఇలానే ఉంటుంది కానీ క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చిన ట్వీస్ట్ కొత్తగా ఉంటుంది. ‘క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటే నా కల్ట్ ప్యాన్స్ ఒప్పుకోరు’ అంటూ హీరోతోనే ఓ డైలాగ్ చెప్పించడమే కాకుండా..దానికి తగ్గట్లుగానే ముగింపు డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. కథ పరంగా చూస్తే ఇదొక్కటే కొత్త పాయింట్. మిగతాదంతా రొటీన్, రెగ్యులర్ స్టోరీ. కానీ దర్శకుడు దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ , రాసుకున్న స్క్రీన్‌ప్లే సినిమాను కాపాడాయి. తెలిసిన కథే అయినా తెరపై శ్రీవిష్ణు వేసే పంచ్ డైలాగులకు, వెన్నెల కిశోర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ని అందిస్తాయి. ఎలాంటి సాగదీతలు లేకుండా సినిమా ప్రారంభంలోనే ట్రైయాంగిల్ ప్రేమకథను మొదలు పెట్టాడు దర్శకుడు. పూర్వని పడేసేందుకు విజయ్ చేసే పనులన్నీ రొటీన్‌గానే ఉన్నా.. శ్రీవిష్ణు బాడీ లాంగ్వెజ్, వన్‌లైన్ పంచ్‌లు బాగా పెలడంతో బోర్ కొట్టదు. కథ ఏమిలేకున్నా ఫస్టాఫ్ కథనం ఫాస్ట్‌గానే సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. అయితే మూర్తి(రాజేంద్ర ప్రసాద్) పాత్ర ఎంట్రీ తర్వాత కథనం కొంతమేర ఎమోషనల్‌గా సాగుతుంది. ఇక చివరి 20 నిమిషాలు డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు దర్శకుడు. ఓ యంగ్ హీరో తో పాటు ఇద్దరు హీరోయిన్లు గెస్ట్ అప్పీయరెన్స్ ముగింపు మరింత కొత్తగా అనిపిస్తుంది. ముందుగా చెప్పినట్లు చెప్పుకోవడానికి పెద్ద కథ లేకపోయినా.. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటాం. ఎలాంటి అంచనాలు లేకుండా.. కొత్తదనం ఆశించకుండా సినిమాకు వెళితే మాత్రం కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. శ్రీవిష్ణు ఓ సినిమా ఒప్పుకున్నాడంటే..అందులో కొత్త పాయింట్ అయినా ఉండాలి లేదంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయినా అందించాలి. ఇది రెండో రకం సినిమా. దానికి తగ్గట్లుగానే శ్రివిష్ణు తనదైన బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించాడు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇదే సినిమాకు ప్లస్ అయింది. రొటీన్ సీన్లను కూడా తనదైన నటనతో హీలేరియస్‌గా మార్చేశాడు. ఇందులో బూతు డైలాగులు ఉన్నప్పటికీ.. అవి బూతులు అనే విషయం తెలియకుండా శ్రీవిష్ణు తనదైన డైలాగ్ డెలివరీతో మ్యానేజ్ చేశాడు. శ్రీవిష్ణుకి తోడుగా వెన్నెల కిశోర్ ఉండడం మరో ప్లస్ పాయింట్. కామెడీ విషయంలో వీరిద్దరు పోటీపడి నటించారు. కేతికా శర్మ, ఇవానా కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక రాజేంద్రప్రసాద్ తెరపై కనిపించేంది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విశాల్ చంద్ర శేఖర్ అందించిన పాటలు గుర్తుంచుకునే విధంగా ఉండవు కానీ కథలో భాగంగా వస్తూ.. వినసొంపుగానే ఉంటాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్, ఆర్ట్స్ డిపార్ట్‌మెట్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉనాయి.
న్యూస్ పాడ్‌కాస్ట్

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్
క్రీడలు

యూ టర్న్ తీసుకున్న యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మనసు మార్చుకున్నాడు. దేశవాలీ క్రికెట్లో గోవాకు ఆడాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. జైస్వాల్ కొద్ది రోజుల కిందట ముంబై నుంచి గోవాకు వలస వెళ్లాలని (దేశవాలీ క్రికెట్) నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా అతను ముంబై క్రికెట్ అసోసియేషన్‌పై (MCA) ఒత్తిడి తెచ్చి మరీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) పొందాడు. తాజాగా ఈ విషయంలో జైస్వాల్ యూ టర్న్ తీసుకున్నాడు. తిరిగి తాను ముంబైకే ఆడాలని నిర్ణయించుకున్నట్లు ఎంసీఏకు ఈ-మెయిల్ ద్వారా సందేశాన్ని పంపాడు. వారు జారీ చేసిన ఎన్వోసీని వెనక్కు తీసుకోవాలని కోరాడు. గోవాకు వలస వెళ్లాలనుకున్న తన ప్రణాళికను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపాడు. ఈ దేశవాలీ సీజన్లో సెలెక్షన్‌కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఎంసీఏ తిరిగి తనను ముంబైకి ఆడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశాడు. ఎంసీఏ ఇచ్చిన ఎన్వోసీని బీసీసీఐకి కానీ గోవా క్రికెట్ అసోసియేషన్‌కు కాని సమర్పించలేదని తెలిపాడు.కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో పుట్టిన జైస్వాల్.. ముంబై తరఫున దేశవాలీ క్రికెట్ ఆడి టీమిండియాలో, ఐపీఎల్లో చోటు దక్కించుకున్నాడు. వ్యక్తిగత కారణాల చేత తనకు జీవితాన్ని ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌నే వదిలి వెళ్లాలనుకున్న జైస్వాల్ ఎందుకో తిరిగి మనసు మార్చుకున్నాడు. వాస్తవానికి గోవా క్రికెట్ అసోసియేషన్ జైస్వాల్‌కు కెప్టెన్సీ ఆశ చూపి తమవైపు మళ్లేలా చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, అతను తిరిగి పాత జట్టు ముంబైకే ఆడాలనుకుంటున్నాడు.జైస్వాల్‌కు ముంబై తరఫున ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆ జట్టు తరఫున ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. 2018-19 రంజీ సీజన్లో తొలిసారి ముంబైకు ప్రాతినిథ్యం వహించిన జైస్వాల్.. అతి తక్కువ వ్యవధిలో చాలా పాపులర్ అయ్యాడు. ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 60కి పైగా సగటుతో 13 సెంచరీలు, 12 అర్ద సెంచరీల సాయంతో 3712 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.2019-20 సీజన్లో ముంబై తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోకి అడుగుపెట్టిన జైస్వాల్.. విజయ్ హజారే ట్రోఫీలో జరిగిన ఓ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే జైస్వాల్‌కు ఐపీఎల్ ఛాన్స్ దక్కింది. 2020 సీజన్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జైస్వాల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోని జైస్వాల్ ఫార్మాట్లకతీతంగా దేశవాలీ క్రికెట్లో, అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్లో చెలరేగిపోతున్నాడు.

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా.. అధికారిక ప్రకటన
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ ఇవాళ (మే 9) అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేదిక, తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. యుద్ద పరిస్థితుల్లో లీగ్ నిర్వహించలేమని బీసీసీఐ చెప్పింది. దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని బోర్డు ఉన్నతాధికారి వివరించారు. ఉద్రిక్తతల కారణంగా పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దునిన్న (మే 8) ధర్మశాల వేదికగా పంజాబ్-ఢిల్లీ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైన మ్యాచ్‌ను బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు.మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్ ద్వారా పఠాన్‌కోట్ గుండా ఢిల్లీకి తరలించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ స్కోర్ 122/1గా (10.1 ఓవర్లలో) ఉండింది. పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (34 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) భారీ షాట్లతో విధ్వంసం సృష్టించారు.ఏం జరిగిందంటే..?ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత కొద్ది రోజుల కామ్‌గా ఉన్న భారత్.. ఈ మంగళవారం అర్దరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరిట సాగిన ఈ ప్రతి దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇందుకు బదులుగా పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. రాకెట్లు, మిసైళ్లతో జనావాసాలను టార్గెట్ చేసింది. పాక్ దుశ్చర్యకు భారత్ సైతం ధీటుగా బదులిస్తోంది. భారత బలగాలు పాక్ మిస్సైల్లను గాల్లోనే పేల్చేస్తున్నాయి. సమాంతరంగా పాక్‌లోని కీలక నగరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే భారత బలగాలు పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి. అయినా పాక్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. కాల్పులకు పాల్పడుతూనే ఉంది.

IPL 2025, DC VS PBKS: బ్లాక్ అవుట్‌కు ముందు బ్లో అవుట్
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న (మే 8) ధర్మశాల వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమైన మ్యాచ్‌ను బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. బ్లాక్ అవుట్ ప్రకటనకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ పరుగుల వరద పారించింది. ఆ జట్టు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (34 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) భారీ షాట్లతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి ధాటికి పంజాబ్ పవర్ ప్లేలో 69 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన ప్రియాంశ్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రభ్‌సిమ్రన్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి సీజన్లో వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించాడు. ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్ పోటీపడి చెలరేగడంతో పంజాబ్ 10 ఓవర్లలో ఏకంగా 122 పరుగులు చేసింది.అనంతరం 11వ ఓవర్ తొలి బంతికే సీజన్ తొలి మ్యాచ్ ఆడుతున్న నటరాజన్ ప్రియాంశ్ ఆర్యను ఔట్ చేశాడు.అప్పుడే అధికారుల నుంచి బ్లాక్ అవుట్ సమాచారం రావడంతో స్టేడియం నిర్వహకులు ఓ ఫ్లడ్ లైట్‌ను బంద్ చేశారు. కొద్ది సేపటికి మరో రెండు ఫ్లడ్ లైట్లు కూడా బందయ్యాయి. దీని తర్వాత మరి కొద్ది సేపటికి మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆటగాళ్లు సహా స్టేడియం మొత్తం ఖాళీ చేయాలని అత్యవసర ప్రకటన వచ్చింది.తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు. మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్ ద్వారా పఠాన్‌కోట్ గుండా ఢిల్లీకి తరలించారు.బ్లాక్ అవుట్ అంటే ఏంటి..?యుద్ధం లేదా ఎమర్జెన్జీ పరిస్థితుల్లో నగరాన్ని మొత్తం చీకటి చేయడం. శత్రువుల వైమానిక దాడులను కష్టతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇలా చేస్తే శత్రువుల టార్గెట్ మిస్ అవుతుంది. ఫలితంగా దాడుల నుంచి రక్షణ పొందొచ్చు.

IPL 2025: భారత్‌ను వీడి వెళ్లే యోచనలో ఆస్ట్రేలియా క్రికెటర్లు..?
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. లీగ్ కొనసాగింపుపై ఇవాళ (మే 9) అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ లోపే ఐపీఎల్లో పాల్గొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత్‌ను విడిచి వెళ్లాలని భావిస్తున్నట్లు ప్రముఖ ఆస్ట్రేలియా దినపత్రిక సిడ్ని మార్నింగ్ హెరాల్డ్ ఓ కథనంలో పేర్కొంది. భారత్‌లో యుద్ద పరిస్థితుల నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు భయాందోళనలకు గురవుతున్నట్లు ఆటగాళ్ల ఏజెంట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ద్వారా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సందేశం చేరవేశారట. ముఖ్యంగా భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆసీస్ ప్లేయర్లు బిక్కుబిక్కుమంటున్నట్లు సిడ్ని మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. వీలైనంత త్వరగా తమను భారత్ నుంచి దాటించాలని కొందరు ఆసీస్ ప్లేయర్లు క్రికెట్ ఆస్ట్రేలియాకు విన్నవించుకున్నారట.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, మార్కస్ స్టోయినిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, జోస్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, స్పెన్సర్ జాన్సన్, ఆరోన్ హార్డీ, నాథన్ ఇల్లిస్, జేవియర్ బార్ట్లెట్ వివిధ ఫ్రాంచైజీలకు ఆడుతున్నారు. వీరితో పాటు రికీ పాంటింగ్, బ్రాడ్ హడిన్, మైక్ హస్సీ వంటి వారు వేర్వేరు జట్ల తరఫున కోచింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.కాగా, నిన్న (మే 8) ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ బ్లాక్ అవుట్ కారణంగా రద్దైంది. తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశామని ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించారు. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు. మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్ ద్వారా పఠన్కోట్ గుండా ఢిల్లీకి తరలించారు.బ్లాక్ అవుట్ అంటే యుద్ధం లేదా ఎమర్జెన్జీ పరిస్థితుల్లో నగరాన్ని మొత్తం చీకటి చేయడం. శత్రువుల వైమానిక దాడులను కష్టతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇలా చేస్తే శత్రువుల టార్గెట్ మిస్ అవుతుంది. ఫలితంగా దాడుల నుంచి రక్షణ పొందొచ్చు. నేటి ఆర్సీబీ, లక్నో మ్యాచ్ జరుగుతుందా..?ధర్మశాలలో నిన్న జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యాక ఐపీఎల్ 2025 కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే నిన్న ఈ విషయంపై ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ.. ఇవాళ (మే 9) జరగాల్సిన ఆర్సీబీ, లక్నో మ్యాచ్ యధాతథంగా కొనసాగుతుందన్నట్లు చెప్పాడు. నేటి మ్యాచ్‌లో ఎలాంటి అపాయమూ లేని లక్నోలో జరుగనుండటమే అప్పుడు ధుమాల్ చేసిన ప్రకటనకు కారణం కావచ్చు. అయితే దీనిపై తుది నిర్ణయం మరి కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది.
బిజినెస్

ఐటీలో ఒక్కో ఉద్యోగి వల్ల ఆదాయం ఎంతంటే..
దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో 2025 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతి ఉద్యోగి ద్వారా సమకూరే ఆదాయం(రెవెన్యూ పర్ ఎంప్లాయి-ఆర్పీఈ) పెరిగింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల ద్వారా సమకూరే ఆదాయం ఏడేళ్ల గరిష్టాన్ని తాకినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. మెరుగైన వనరుల వినియోగం, ఆటోమేషన్, కార్యాచరణ సామర్థ్యాల ద్వారా ఇది సాధ్యమైందని కంపెనీలు తెలిపాయి. కాగా, ఇటీవల సంస్థల త్రైమాసిక లాభాలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఒక్కో ఉద్యోగి ద్వారా 2024-25లో ఏయే సంస్థకు ఎంత సమకూరిందో కింద తెలుసుకుందాం.టీసీఎస్: 49,638 డాలర్లు(సుమారు రూ.41.67 లక్షలు) గతేడాది కంటే ఇది 2.7 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్టాన్ని చేరింది. టీసీఎస్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 6,07,979.ఇన్ఫోసిస్: 59,575 డాలర్లు(సుమారు రూ.50 లక్షలు). గతంలో కంటే 1.8% పెరిగి ఏడేళ్ల గరిష్టానికి చేరింది. ఇన్ఫోసిస్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 3,17,240.హెచ్‌సీఎల్ టెక్: 61,946 డాలర్లు (సుమారు రూ.51.9 లక్షలు). గతంలో కంటే 6.2% పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 2,27,000.విప్రో, టెక్ మహీంద్రా రెండూ ఆర్‌పీఈలో క్షీణతను నమోదు చేశాయి.క్రమబద్ధీకరించిన కార్యకలాపాలు, సమర్థవంతంగా ప్రాజెక్ట్‌ల అమలు, అధునాతన ఆటోమేషన్ వ్యూహాల కారణంగా ఆర్‌పీఈలో మెరుగుదల కనిపించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, లేఆఫ్స్ పేరుతో ఇటీవల కాలంలో చాలామంది ఉద్యోగులను తొలగించడంతోనే కంపెనీలకు ఇలా ఆర్పీఈ పెరిగినట్లు కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?కంపెనీలకు లాభాలు ఉన్నప్పటికీ ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితితో ఐటీ రంగం సవాళ్లు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఐటీ సేవలకు డిమాండ్ మందగించడం, వ్యయ ఒత్తిళ్లు, లేఆఫ్స్ ఆందోళనలు భవిష్యత్ రాబడులపై ప్రభావం చూపనున్నాయని కొందరు అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలతో ఐటీ సంస్థలు స్కిల్ డెవలప్మెంట్, ఆటోమేషన్, కాస్ట్ ఎఫిషియెన్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.

60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?
శరవేగంగా మారుతున్న భారత కార్పొరేట్ ప్రపంచంలో 60 ఏళ్ల వరకు హాయిగా పనిచేయాలనే ఆలోచన మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. ఈ రోజుల్లో వృత్తి నిపుణులు పని వాతావరణంలో చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. దాంతో యువ ఉద్యోగుల్లో 45 ఏళ్లు వచ్చేవరకే రిటైర్ అవ్వాలనే ధోరణి పెరుగుతోంది. అయితే ఇది ఆదోళన కలిగించే అంశమని కొందరు నిపుణులు భావిస్తున్నారు.ఈ సందర్భంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, అడ్వైజర్ సార్థక్ అహుజా మాట్లాడుతూ..‘ఉద్యోగుల్లో ఈ మార్పు వాస్తవమే. ఇది ఆందోళన కలిగించే అంశం. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 45 ఏళ్లకు మారుతుండడంతో భారతీయ కార్పొరేట్లలో ఆందోళన కలిగించే అంశం. ఇది మంచి పద్ధతి కాదు. లీగల్ లేదా వైద్యం వంటి రంగాల్లో పని చేస్తున్న వృత్తి నిపుణుల వయసు పెరిగే కొద్దీ ఎక్కువ గౌరవం, అధిక వేతనం అందుతాయి. అదే సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్, టెక్ వంటి కార్పొరేట్ ఉద్యోగాలు ఇందుకు పూర్తి విరుద్ధం. వయసు పెరిగేకొద్దీ పనితీరు కాస్త తగ్గుతుంది. కొత్త టెక్నాలజీలకు అలవాటుపడే మనస్తత్వం ఉండదు. సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ముఖ్యంగా టెక్నాలజీ వంటి విభాగాల్లో 40 ఏళ్ల పైబడినవారు పనికిరారని చాలా కంపెనీలు భావిస్తున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువ‘40 ఏళ్లు పైబడినవారు నైపుణ్యం లేనివారు కాదు. వారు యువ ప్రతిభావంతుల మాదిరి చురుకుగా ఉండకపోవచ్చు. కానీ వారి అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే చాలా కంపెనీలు వీరిని పూర్తిగా తొలగించడం లేదు. అయితే కంపెనీల్లో కొత్త విభాగాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మాత్రం వీరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో 40 ఏళ్లు పైబడిన వారికి మెరుగైన నైపుణ్యాలు ఇచ్చేందుకు అప్ స్కిల్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది’ అని అహుజా వివరించారు.

ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు (Gold Prices) ఒక్కసారిగా పడిపోయాయి. వరుసగా నాలుగు రోజులుగా భగ్గుమన్న పసిడి ధరలు నేడు (మే9) భారీగా దిగివచ్చాయి. గత నాలుగు రోజుల్లో పసిడి 10 గ్రాములకు ఏకంగా రూ.4వేలకు పైగా ఎగిసి మళ్లీ రూ.లక్షకు చేరువైంది. దీంతో ఆందోళన చెందుతున్న కొనుగోలుదారులకు నేటి భారీ తగ్గుదల ఊరట కలిగించనుంది. మే 9 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.👉ఇది చదివారా? బంగారం మాయలో పడొద్దు.. సీఏ చెప్పిన లెక్కలు చూస్తే..చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,500- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,300ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,11,000 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 99,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

భారత్-పాక్ యుద్ధం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 211 పాయింట్లు నష్టపోయి 24,063కు చేరింది. సెన్సెక్స్(Sensex) 542 పాయింట్లు దిగజారి 79,805 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.81 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 63 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.36 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.58 శాతం లాభపడింది. నాస్డాక్ 1.07 శాతం ఎగబాకింది.ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్–పాకిస్థాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమవడంతో స్టాక్ సూచీలు ఒడిదొడులకు లోనవుతున్నాయి. ఇటీవల భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా దాడులు చేసిన పాక్‌పై ప్రతీకార చర్యగా లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు భారత రక్షణ శాఖ ప్రకటనతో దలాల్ స్ట్రీట్ సెంటిమెంట్ నిన్న ఒక్కసారిగా మారిపోయింది. ట్రేడింగ్ మరో గంటలో ముగుస్తుందనే సమయంలో ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్ షేర్లలో భారీ విక్రయాలు తలెత్తాయి. అమెరికాతో చైనా, తాజాగా బ్రిటన్ వాణిజ్య ఒప్పంద చర్చలు సఫలం అవ్వొచ్చనే అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.ఇదీ చదవండి: ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువపరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ

Rahu Ketu రాహుకేతువుల కథ
భారతీయ సంస్కృతిలో సూర్య, చంద్రగ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇందుకు ఈ కథ ఒక కారణం: విష్ణువు జగన్మోహినిగా దేవతలకు అమృతాన్ని పంచిపెడుతుంటాడు. రాక్షసులకు సుర మాత్రం ఇచ్చి తాగిస్తుంటాడు. దీనిని దక్షప్రజాపతి శాపవశంతో రాహువు తెలుసుకునిఅసురుల వైపు నుంచి లేచొచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటాడు. ఈ విషయాన్ని సూర్య చంద్రులు కను సైగలతో విష్ణువుకి తెలియ జేస్తారు. అయితే అప్పటికే రాహువుకి విష్ణువు అమృతం ఇవ్వడం వల్ల అతడు అమృతాన్ని తాగుతాడు.తర్వాత విషయం తెలుసుకున్న విష్ణువు వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి రాహువు కంఠాన్ని ఖండిస్తాడు. కానీ అప్పటికే రాహువు అమృతాన్ని సేవించడం వల్ల అతని తల, మొండెం కూడా సజీవాలై ఉంటాయి. తల విష్ణువుతో ‘మహాత్మా! అకారణంగా నా కంఠాన్ని తెగగొట్టావు. నువ్వు ఇస్తేనే కదా నేను అమృతం తాగాను. నువ్వే ఇలా చేయడం మంచిదా’అని అడుగుతాడు.రాహువు మాటలు విన్న విష్ణువు మనసు కరుగుతుంది. ‘సరే జరిగిపోయిన దానినే తలచి బాధ పడడం తగదు. అది విధివిధానం. నీకేం కావాలో కోరుకో’ అంటాడు విష్ణువు. అప్పుడు రాహువు ‘దేవా! సూర్యచంద్రులు చెప్పబట్టే కదా నువ్వు నా మీద ఈ చర్యకు పాల్పడ్డావు. కనుక వారిద్దరిని మింగడానికి నాకు అనుమతి ఇవ్వు’ అంటాడు.ఇదీ చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీఅందుకు విష్ణువు ‘నువ్వు సూర్యచంద్రులను మింగితే లోకాలన్నీ సంక్షోభంలో చిక్కుకుంటాయి. ఏడాదిలో ఏదైనా ఓ అమావాస్యనాడు సూర్యుడిని, పౌర్ణమినాడు చంద్రుడిని మింగి వెంటనే విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టకపోతే నీ తల వెయ్యి ముక్కలయి చనిపోతావు. సూర్యచంద్రులు నీకు చేసిన తప్పుకు వారికీ శిక్ష చాలు’ అంటాడు.రాహువుకు తల, మొండెం వేర్వేరు అయినప్పటికీ అమృతం సేవించిన కారణంగా ఒకరిద్దరయ్యారు. తల కేతువుగా సూర్యుడిని మింగడానికి, మొండెం రాహువుగా చంద్రుని మింగడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ విధంగా సూర్యచంద్రులు రాహుకేతువుల పాల్పడి గ్రహణాలు మొద లయ్యాయని పురాణ కథ. అయితే గ్రహణాలు ఏర్పడడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయన్నది గమనించాలి. – యామిజాల జగదీశ్

మినీ ఆఫ్రికా@ టోలిచౌకీ..!
టోలిచౌకీని ఆనుకుని ఉన్న పారామౌంట్ కాలనీ మినీ ఆఫ్రికాను తలపిస్తుంది. అధునాతన నివాస గృహాలు ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ఈ కాలనీ ప్రస్తుతం సూడాన్, సొమాలియా వాసుల అడ్డాగా పేరుగాంచింది. ఇక్కడ ఉంటున్న వారిలో 90 శాతం మంది మినీ ఆఫ్రీకాకు చెందిన వారే. ప్రశాంత వాతావరణంలో ఉండడంతో పాటు ఫిలింనగర్, జూబ్లీహిల్స్, టోలిచౌకీ చౌరస్తా తదితర ప్రదేశాలకు అత్యంత సమీపంలో ఉన్న పారామౌంట్ కాలనీ ఆఫ్రీకా దేశాలకు చెందిన విద్యార్థులకు అడ్డాగా నిలుస్తోంది. పదేళ్ల క్రితం స్థానికులతో నిండి ఉన్న ఈ కాలనీ నేడు ఆఫ్రికా దేశస్తులతో నిండివుంది. కొత్తగా నిర్మితమవుతున్న భవనాలను సైతం సూడాన్, సొమాలియా దేశాలకు చెందిన విద్యార్థులు అద్దెకు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. గతంలో ఇక్కడ ఉన్న ఇరానీ రెస్టారెంట్లు, చిన్న చిన్న కిరాణా దుకాణాలు మాయమై వాటి స్థానంలో అత్యాధునిక ఆఫ్రికన్ కిచెన్లు వెలిశాయి. ఆఫ్రికన్ తరహా జీవనశైలి.. టీ సెంటర్లలో సైతం అరేబియన్ టీ అందుబాటులో ఉంటుంది. ఇక్కడి షాపులు ఆఫ్రికన్ దేశాల వారికి అవసరమయ్యేవే ఎక్కువగా లభిస్తున్నాయి. రేడీమేడ్ షాపుల్లో సైతం సూడాన్ యువకులు ఇష్టపడి తొడిగే టీషర్ట్స్ మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఆఫ్రికన్ దేశాల నుంచి విద్యాబ్యాసం కోసం వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం పలు కారణాలతో ఇక్కడకు వస్తున్నారు. ఒక సూడానీస్‌తో పాటు అదనంగా ఇద్దరు ముగ్గురు వారి కుటుంబ సభ్యులు ఒక్కొ ప్లాట్‌లో ఉంటున్నారు. దీంతో స్థానికులు, వ్యాపారులు సైతం నెమ్మదిగా ఇంగ్లిష్తో పాటు సూడానీస్, సొమాలియా భాషను నేర్చుకుంటున్నారు. (చదవండి: రేపటి నుంచే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ పోటీలు..!)

Miss world 2025: అందరి చూపు.. భాగ్యనగరం వైపు..
ప్రస్తుతం ప్రపంచమంతా హైదరాబాద్ నగరం వైపే చూస్తోంది. దాదాపు 120 దేశాలకు పైగా ఆయా దేశ అధికార ప్రతినిథులు, ప్రముఖులు నగరానికి గగనతల ప్రయాణం చేస్తున్నారు. నగర వేదికగా ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతి రోజూ వివిధ దేశాలకు చెందిన సుందరీమణులతో కళకళలాడుతోంది. అయితే రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లోనూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పోటీల్లో పాల్గొనే 109 దేశాలకు చెందిన పోటీదారులు ఇప్పటికే నగరానికి చేరుకోగా మరికొన్ని దేశాలకు చెందిన వారు శుక్రవారం రానున్నారు. ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ ఘన వేదికగా మారిన విషయం విధితమే.. ఇందులో పాల్గొనే సుందరీమణులు ఇప్పటికే ప్రీ ట్రయల్స్‌లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతో పాటు, అథెనా క్రాస్బీ (అమెరికా), ఎమ్మా మోరిసన్ (కెనడా), వాలేరియా కాన్యావో (వెనిజులా) వంటి తారలు మిస్ వరల్డ్ వేదిక పై ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. అంతేకాకుండా అమెరికా, దక్షిణాఫ్రికా, వెనిజులా వంటి ప్రముఖ దేశాలతో పాటు గ్వాడలూప్, గిబ్రాల్టర్, మార్టినిక్, క్యురాకావ్ వంటి చిన్న దేశాల నుంచి కూడా 72వ మిస్ వరల్డ్ పోటీల్లో అభ్యర్థులు పాల్గోనుండడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో వరల్డ్ టాప్ మోడల్స్‌తో పాటు విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, సామాజిక వేత్తలు, ఆరి్టస్టులు, విభిన్న రంగాలకు చెందిన ఉద్యమకారులు తమ దేశాల తరపున ప్రాతినిధ్యం వహిస్తూ పోటీపడుతుండటం మరో విశేషం. దేశవ్యాప్తంగా డిజిటల్ వెల్కమ్.. పోటీదారులు దాదాపు నెల రోజులపాటు తెలంగాణలో పర్యాటక, సాంస్కృతిక, వైద్య, చేనేత, ఆవిష్కరణ కేంద్రాలను సందర్శించనున్నారు. గతేడాది ముంబయిలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరగగా, ఈ ఏడాది మే 31న హైదరాబాద్, హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే జరగనుంది. మిస్ వరల్డ్ పోటీలను వరుసగా రెండేళ్ల పాటు భారత్‌లో నిర్వహించడం తొలిసారి. ఈ అరుదైన గౌరవం దేశానికి మాత్రమే కాదు, తెలంగాణకు కూడా విశ్వవేదికపై విశిష్ట గుర్తింపునిస్తుంది. ఈ విశిష్ట కార్యక్రమానికి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు చెందిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ వెల్కమ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోటీలను తిలకించడానికి సామాన్యులకు సైతం ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడంతో వివిధ నగరాల నుంచి ఫ్యాషన్ ఔత్సాహికులు నగరానికి రావడానికి సన్నద్ధమవుతున్నారు. (చదవండి: Miss World 2025: అందాల పోటీలో హైలెట్‌గా 'పోచంపల్లి చీరలు')

మిస్ వరల్డ్ 2025 : అందాల పోటీలో హైలెట్‌గా 'పోచంపల్లి చీరలు'
ఆ రంగులు, పువ్వులు, పక్షులు, జంతువుల జ్యామెట్రీ నమూనా డిజైన్లు నేత శైలి చూడగానే పోచంపల్లి ప్రత్యేకత ఇట్టే తెలిసిపోతుంది. మన దేశీయ సాంస్కృతిక, వారసత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. మిస్ వరల్డ్ 2025 కాంటెస్ట్ ఈవెంట్లో భాగంగా ఈ నెల 15న ఒక బృందం ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామమైన పోచంపల్లి(Pochampally )ని సందర్శించనుంది. దీంతో దేశంలో అత్యంత ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలలో ఒకటైన పోచంపల్లి ఇకత్ ఫ్యాషన్ మరోమారు ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పోచంపల్లి దాని సంక్లిష్టమైన ఇకత్ నేత పద్ధతులు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాయి. యునెస్కో ‘ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక గ్రామం’గా పోచంపల్లి ప్రశంసలు అందుకుంది. చేతిపనులు, సంస్కృతి, వారసత్వానికి సజీవ సాక్ష్యంగా నిలిచి ఈ చేనేతలో అబ్బురపరిచే డైయింగ్ టెక్నిక్స్‌ను ఉపయోగిస్తారు. ఈ టెక్నిక్‌లో సంప్రదాయ చిలుక, ఏనుగు, వజ్రం, పూల మోటిఫ్లతోపాటు ఇప్పుడు వందల రకాల డిజైన్లు సృష్టిస్తున్నారు వీవర్స్. హుందాతనాన్ని చాటేలా! పోచంపల్లి ఇకత్ కాటన్‌తో ఎన్నో మోడల్స్ యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కుర్తా పైజామాలు, లాంగ్ అండ్ షార్ట్ జాకెట్స్, ఫ్రాక్స్, జంప్‌సూట్స్, లెహంగాలు.. ఇండో–వెస్ట్రన్ డిజైన్స్ ఆధునికతను చాటుతున్నాయి. సౌకర్యంతోపాటు క్యాజువల్, అఫిషియల్ అండ్ పార్టీవేర్‌గానూ హుందాతనాన్ని చూపుతున్నాయి.పట్టు ప్రత్యేకత బ్రైట్ కలర్స్, సంప్రదాయ డిజైన్లు, జరీ మెరుపులు చూపు తిప్పుకోనివ్వవు. కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్‌లు, క్రాప్టాప్స్తో ఈ చీరలను జత చేసి మరిన్ని స్టైల్స్ తీసుకువస్తున్నారు. ఇతర అలంకారాలుచీర కట్టు, టెంపుల్ జ్యువెలరీతో సంప్రదాయ శైలిని తీసుకువస్తే ఫ్యాబ్రిక్ లేదా సిల్వర్ జ్యువెలరీతో వెస్ట్రన్ స్టైల్‌ని మెరిపించవచ్చు. ఏ జ్యువెలరీ, కేశాలంకరణ స్టైల్స్ లేక΄ోయినా ఫ్యాబ్రిక్‌నే అలంకారంగా ధరించవచ్చు. దేశభక్తి చాటేలా! పోచంపల్లి, ఇకత్లో యువతను ఆకట్టుకునేలా నేస్తున్న డిజైన్స్ గురించి స్టేట్ అవార్డ్ గ్రహీత వీవర్ బోగ సరస్వతి మాటల్లో.. ‘‘నేను పాతికేళ్లుగా, మావారు బోగ బాలయ్య యాభై ఏళ్లుగా ఈ చేనేత వస్త్రాలను నేస్తున్నాం. కొత్త కొత్త డిజైన్స్‌ను తయారు చేస్తున్నాం. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని, వారి ఆధునిక వస్త్రాలకు తగినట్టుగా, హుందాగా ఉండే డిజైన్స్ రూపకల్పనలో కృషి చేస్తున్నాం. ఇటీవల ఆజాదీ కా అమృత మహోత్సవాలను పురస్కరించుకుని దేశభక్తి చాటేలా ఇండియా మ్యాప్ మధ్యన చరఖా రాట్నం వచ్చేలా స్కార్ఫ్ నేశాం. ఎకో ఫ్రెండ్లీ రంగులను ఉపయోగించాం. 2023 డిసెంబర్లో డబుల్ ఇకత్లో చరకా వచ్చేలా స్కార్ఫ్ డిజైన్ చేసి, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కానుకగా ఇచ్చాం. 121 కలర్స్‌లో 121 మోటిఫ్స్‌తో చీర తయారుచేశాం. 2021లో 100 అడ్డు చిటికీలు 100 నిలువు చిటికీలు రూపొందించి 100*100 అంటే 10,000 షేడ్ వచ్చేలా చీరలు రూపొందించాం. ఆ కృషికి గుర్తింపుగా స్టేట్ అవార్డు వరించింది. బెస్ట్ వీవర్ అప్రిసియేషన్, బెస్ట్ వీవర్ అవార్డ్ సర్టిఫికెట్ లభించింది. మహిళా దినోత్సవం సందర్భంగా బెస్ట్ వీవర్‌గా ప్రశంసలు అందుకున్నాను. కొంగొత్త డిజైన్లుమా కృషి, దృష్టి అంతా అనుకున్న డిజైన్లు, డైయింగ్, టైయింగ్, మోటిఫ్స్, షేడ్స్, వీవింVŠ పైన ఉంటుంది. నచ్చిన డిజైన్లకు ఎక్కువ మొత్తంలో కోరితే డిమాండ్‌ను బట్టి బయట ఆర్డర్ ఇస్తాం. సంప్రదాయ ఏనుగులు, పక్షులు మాత్రమే కాకుండా మార్కెట్ ట్రెండ్‌ను అనుసరించి డిజైన్ చేస్తున్నాం. రాజకీయ నాయకులు, ప్రముఖులు మా వద్ద నుంచి చీరలు తీసుకెళతారు. బాలీవుడ్ నటి జయాబచ్చన్, ఇన్ఫోసిస్ సుధామూర్తికి కూడా మా చీరలు వెళ్లాయి. పదివేల షేడ్స్‌తో తయారుచేసిన ఇకత్ స్పార్ఫ్కు మంచి గుర్తింపు లభించింది. జాతీయస్థాయి మా డిజైన్స్ గుర్తింపు సాధించాలని కృషి చేస్తున్నాం.– బోగ సరస్వతి, పోచంపల్లి ఇకత్ వీవింగ్ డిజైనర్ (చదవండి: Miss World 2025: ఆ దేశాలు డుమ్మా..! ఆఖరి నిమిషంలో..)
ఫొటోలు


ఫ్రెండ్ పెళ్లిలో ఒకప్పటి హీరోయిన్ మీనా సందడి (ఫొటోలు)


హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి రోజు.. భర్తతో ఇలా (ఫొటోలు)


తమిళ సినీ నిర్మాత కూతురి పెళ్లిలో ప్రముఖులు (ఫోటోలు)


బర్త్ డే స్పెషల్.. సాయిపల్లవి గురించి ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)


అన్నవరం : కన్నుల పండువగా సత్యదేవుని దివ్య కల్యాణోత్సవం (ఫొటోలు)


హైదరాబాద్ : సైన్యానికి సంఘీభావం..సీఎం రేవంత్ క్యాండిల్ ర్యాలీ (ఫొటోలు)


తిరుపతి : గంగమ్మా..కరుణించమ్మా సారె సమర్పించిన భూమన (ఫొటోలు)


బర్త్‌డే స్పెషల్.. విజయ్ దేవరకొండ గురించి 10 ఆసక్తికర విషయాలు (ఫొటోలు)


నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని గ్లామరస్ స్టిల్స్ (ఫొటోలు)


అరుణాచల దర్శనం చేసుకున్న నటుడు ప్రభాకర్ ఫ్యామిలీ (ఫొటోలు)
అంతర్జాతీయం

ఉన్నట్టుండి భారత్ వచ్చిన సౌదీ మంత్రి
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్ జుబేర్ ఉన్నట్టుండి భారత్‌లో ప్రత్యక్షమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ జరిపిన సైనిక దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా మంత్రి అప్రకటిత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.చెప్పాపెట్టకుండా భారత్ వచ్చిన అదెల్ అల్ జుబేర్ గురువారం న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలిశారు. సౌదీ అరేబియా వాతావరణ రాయబారి కూడా అయిన అదెల్ అల్ జుబేర్ తనను కలిసినట్లు జైశంకర్ నుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ ఉదయం సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్ జుబేర్‌తో మంచి సమావేశం జరిగింది" అని ఆయన అన్నారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది చోట్ల ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుధవారం భారత్ జరిపిన సైనిక దాడులను ప్రస్తావిస్తూ ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవడంపై భారత్ దృక్పథాలను సౌదీ మంత్రితో పంచుకున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు.భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో ద్వైపాక్షిక జాయింట్ కమిషన్ సమావేశానికి సహ అధ్యక్షత వహించేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి బుధవారం అర్ధరాత్రి న్యూఢిల్లీకి చేరుకున్న కొద్ది గంటల్లోనే జైశంకర్ తో సౌదీ మంత్రి భేటీ కావడం గమనార్హం.A good meeting with @AdelAljubeir, Minister of State for Foreign Affairs of Saudi Arabia this morning. Shared India’s perspectives on firmly countering terrorism. 🇮🇳 🇸🇦 pic.twitter.com/GGTfItZ3If— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 8, 2025

పాకిస్తాన్ లాహోర్‌లో పేలుళ్లు.. పరుగు తీసిన ప్రజలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో పేలుడు ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌లోని వాల్టన్ విమానాశ్రయం సమీపంలోని లాహోర్‌లోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాలలో వరుసగా బాంబు పేలుడు ఘటన సంభవించింది. ఎయిర్‌పోర్టు వద్ద గురువారం ఉదయం ఒక్కసారిగా సైరన్లు మోగడంతో ఇళ్ల నుంచి పాక్ ప్రజలు బయటకు పరుగులు తీశారు.అయితే, డ్రోన్ కారణంగానే పేలుడు సంభవించినట్లు పాక్ పోలీసులు చెబుతున్నారు. 5-6 అడుగుల పొడవున్న డ్రోన్ పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రోన్ వ్యవస్థను జామ్ చేయడం ద్వారా కూల్చివేసినట్లు చెప్పుకొచ్చారు. వరుస బాంబు పేలుడు ఘటనలతో పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్ సహా పలు విమనాశ్రయాలను అధికారులు మూసివేశారు. ఇక, భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన మరుసటి రోజే పేలుళ్లు సంభవించడం గమనార్హం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ బాంబు పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Panic in Lahore after blast near laWhore airport pic.twitter.com/zsQNyoE4hx— Team Jhaat Official (@TeamJhaant__) May 8, 2025 Utter chaos in Lahore after drone strike at Walton Road which leads to Lahore cantonment. People out on streets in panic. Asim Munir's Jihadist policies have invited war to Pakistan's streets. pic.twitter.com/1195BQxlhf— Divya Kumar Soti (@DivyaSoti) May 8, 2025Something hit Naval college besides #Askari 5. Sirens are #lahore One 1x Drone intercept in #Walton road.#IndiaPakistanWar#Pakistan#PakistanZindabadpic.twitter.com/XN8HkYsi4S— Muhammad Asif (Parody) (@MuhammadAsif26_) May 8, 2025

అది భారత సోషల్ మీడియా.. పాక్ మంత్రి వింత సమాధానం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) విజయవంతమైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత దళాలు మెరుపు దాడులు చేశాయి. ఇందుకు తామూ సమర్థవంతంగా ప్రతిఘటించామంటూ పాకిస్తాన్ ప్రకటించుకుంది. రాఫెల్స్ సహా ఐదు భారత యుద్ధ విమానాలను తమ బలగాలు కూల్చివేశాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసింది. అయితే దీనిపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు.భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్ బలగాలు కూల్చివేశాయంటూ సోషల్ మీడియాలో చేసిన ఫేక్ ప్రచారాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ తన వాదనను నిరూపించడానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో విలేకరి అడిగ్గా ఆసిఫ్ వింత సమాధానం ఇచ్చాడు. ‘అదంతా ఇండియన్ సోషల్ మీడియాలోనే తప్ప మన సోషల్ మీడియాలో కాదు. జెట్ విమానాల శిథిలాలు వారి వైపు పడ్డాయి. ఇదంతా భారత మీడియాలోనే ఉంది' అని వింతగా బదులిచ్చారు.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా తామూ రెండు రాఫెల్ జెట్లు, ఒక సు-30తో సహా మూడు భారత వైమానిక దళ (IAF) యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. అయితే, ఈ వాదనలను భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. కార్యకలాపాల సమయంలో ఐఏఎఫ్ విమానాలు ఏవీ కోల్పోలేదని పేర్కొంది. ఇదంతా ఫేక్ ప్రచారమని తెలిపింది.పాకిస్తాన్ చేస్తున్నది ఫేక్ ప్రచారమని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ నివేదించింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా బహవల్ పూర్ సమీపంలో భారత రాఫెల్ జెట్ ను పాకిస్థాన్ కూల్చివేసిందంటూ సోషల్ మీడియా షేర్ చేసిన ఫొటో 2021లో జరిగిన ప్రమాదానికి సంబంధించినదని తెలిపింది.

భారత్‌కు దాడి చేసే హక్కు ఉంది.. బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ సపోర్ట్
లండన్: పాకిస్తాన్‌పై భారత్ తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రపంచ దేశాల నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు భారత్‌కు మద్దతు ప్రకటించారు. ఇక, తాజాగా భారత సంతతి, యూకే ఎంపీ ప్రీతి పటేల్.. బ్రిటన్ పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మరక్షణలో భాగంగా పాకిస్తాన్‌పై దాడి జరిపే హక్కు భారత్‌కు ఉందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో భారత్‌కు మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు.పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై బ్రిటన్ పార్లమెంట్లో తాజాగా భారత సంతతి ఎంపీ ప్రీతి పటేల్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రీతి పటేల్.. భారత్‌తో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేక బ్రిటన్ పోరాడాల్సిన అవసరం ఉందనన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల వల్ల సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాద ముప్పును బ్రిటన్ ప్రభుత్వం గుర్తించాలని కోరారు. పహల్గాం ఘటనలో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను దారుణంగా హతమార్చారని గుర్తు చేశారు. ముంబై, న్యూఢిల్లీ వంటి ఉగ్రవాద ప్రభావిత నగరాల జాబితాలో ఇప్పుడు పహల్గాం కూడా చేరిపోయింది.పహల్గాం దాడిని ఉగ్రవాద చర్యగా ప్రపంచ దేశాలు సైతం గుర్తించాయి. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని నేను కోరుకుంటున్నాను. దేశాల మధ్య సైనిక చర్య, యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు ఏర్పడకూడదు. ఆత్మరక్షణలో భాగంగా తమను తాము రక్షించుకోవడానికి, ఉగ్రవాద క్యాంపులను నేలమట్టం చేయడానికి భారత్‌కు సహేతుక కారణాలు ఉన్నాయి. ఇది భారత్ హక్కు. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదుల ముప్పు భారత్‌కు మాత్రమే కాదని, అనేక దేశాలు ప్రభావితమవుతున్నాయి. ఒసామా బిన్ లాడెన్ వంటి వ్యక్తి పాకిస్తాన్‌లోనే దాక్కున్నాడు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ విషయమేనని అన్నారు.Today in the House of Commons I reiterated my condolences for those impacted by the atrocity that took place in Pahalgam. We must stand with those affected by terrorism. The UK must work with our friends in India to tackle terrorist threats and engage with India, Pakistan and key… pic.twitter.com/8RXezaJHx0— Priti Patel MP (@pritipatel) May 7, 2025ఇక, బ్రిటన్- భారత్ నిఘా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడి తర్వాత బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు ఏదైనా ప్రత్యేక భద్రతా సహాయం అందించిందా? ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి బ్రిటన్ ప్రత్యేక మద్దతును అందించగలదా?" అని ప్రీతి పటేల్ ప్రశ్నించారు. చివరగా.. భారత్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడులు, సృష్టించిన హింసాత్మక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బ్రిటన్ తన వంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
జాతీయం

ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలో గురువారం జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి సహా ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఎం.భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ఏరో ట్రాన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బెల్ హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి గంగోత్రి సమీపంలోని ఖర్సాలీ హెలిప్యాడ్‌కు టేకాఫ్ తీసుకుంది.ఉదయం 8.45 గంటల సమయంలో రిషికేశ్–గంగోత్రి నేషనల్ హైవేపై గంగ్నానీ సమీపంలో అదుపు తప్పిన హెలికాప్టర్ సుమారు 250 మీటర్ల లోతైన లోయలో కూలిపోయింది. ఆ సమయంలో అందులో పైలట్ సహా ఏడుగురున్నారు. ఘటనలో మృతి చెందిన వారిని ఏపీకి చెందిన వేదవది కుమారి(48), విజయా రెడ్డి(57), కళ చంద్రకాంత్ సోని(61), రుచి అగర్వాల్(56), రాధ అగర్వాల్(79), కెపె్టన్ రాబిన్ సింగ్(60)గా గుర్తించారు.రాబిన్ సింగ్ స్వస్థలం గుజరాత్ కాగా ముగ్గురిది ముంబై, ఒకరిది యూపీ. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏపీ వాసి ఎం.భాస్కర్(51)ను వెంటనే మరో హెలిక్టాపర్లో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించామని జిల్లా మేజి్రస్టేట్ మెహర్బన్ సింగ్ బిష్త్ చెప్పారు. ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

పిల్లలకు సిందూర్ పేరు
కతిహార్: పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి నివాళిగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను యావత్ భారతం స్వాగతించింది. అయితే.. ఆ పేరుపై ట్రేడ్‌మార్క్ కోసం వ్యాపారవేత్తలు పోటీ పడుతుంటే.. ప్రజలు మాత్రం ఆ ఆపరేషన్‌ను మరింత గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు. పాక్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపిన బుధవారం రోజే పుట్టిన తమ బిడ్డలకు ఆపరేషన్ పేరు పెట్టుకుంటున్నారు. అమ్మాయిలయితే సిందూరి అని, అబ్బాయికయితే సిందూర్ అని పేరు పెట్టుకుంటున్నారు. బిహార్‌లో ఉన్న కతిహార్ జిల్లాలోని ఓ చిన్న ఆసుపత్రిలో కుందన్ కుమార్ మండల్ తన కూతురుకు సిందూరి పేరు పెట్టాడు. భారత సాయుధ దళాల ఆపరేషన్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన కుందన్.. ఆ పేరు తన కూతురుకు పెట్టుకోవడం గర్వంగా ఉందన్నారు. ఒక్క కుందన్మాత్రమే కాదు.. ఆ పేరు పెట్టినందుకు కుటుంబమంతా సంతోషంగా ఉంది. ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ పేరును ఆమోదించారు. పెరిగి పెద్దయ్యాక అమ్మాయి తన పేరు వెనుక ఉన్న ప్రాముఖ్యతను, చరిత్రను తెలుసుకుంటుందని కుటుంబం ఆశిస్తోంది. ఒక్క కుందన్ మాత్రమే కాదు.. బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో 12 మంది ఈ పేరు పెట్టుకున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’జరిపిన రోజు పుట్టిన 12 మంది పిల్లలకు ముజఫర్‌పూర్‌లో ఈ పేరే పెట్టుకున్నారు. రెండు ఆనందాలు కలిసి వచ్చాయని సంబరపడిపోతున్నారు. పెద్దయ్యాక తమ పిల్లలను సైన్యంలో చేరి్పస్తామని అంటున్నారు. కన్హారా నివాసి హిమాన్షు రాజ్ కూడా తన కూతురికి ‘సిందూరి’అని నామకరణం చేశాడు. ‘సిందూరి’పేరు కుటుంబానికి గర్వకారణంగా మారింది. జాఫర్పూర్కు చెందిన పవన్ సోనీతన కొడుకుకి సిందూర్ అని పేరు పెట్టాడు. ‘సిందూర్’కేవలం పేరు కాదు.. అదొక గర్వమని చెబుతున్నారు.

బెంగళూరులో సిద్ధమైన ఆర్మీ డ్రోన్లు!
సాక్షి, బెంగళూరు: భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’లో ఉపయోగించిన ఆత్మాహుతి డ్రోన్లను బెంగళూరులో తయారు చేశారు. స్వయం చాలితమైన ఈ డ్రోన్లు పాక్ ఆక్రమిత కశీ్మర్, పాకిస్తాన్లలోని 9 ఉగ్రవాద స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో నేలమట్టం చేశాయి. బాలాకోట్ దాడి తర్వాత వీటిని ఆర్మీలో చేర్చారు. పశి్చమ బెంగాల్‌కు చెందిన ఆల్ఫా డిజైన్, ఇజ్రాయెల్ ఎల్బిట్ సెక్యురిటీ సిస్టమ్స్ సంయుక్తంగా ఈ డ్రోన్లను తయారు చేసినట్లు తెలిసింది. ఈ కంపెనీల ప్రధాన కార్యాలయాలు బెంగళూరులోనే ఉండడం గమనార్హం. భారత ఆర్మీ ప్రత్యేకంగా 100 డ్రోన్ల కొనుగోలుకు ఆర్డర్ చేసింది. ఎలాంటి శబ్దం లేకుండా, తక్కువ ఎత్తులో ఎగురుతూ 5–10 కిలోల బరువైన పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల ఈ డ్రోన్లకు 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల సత్తా ఉంది.

ఆర్మీలో చేరతా.. ఉగ్రవాదులను మట్టుబెడతా..
బాలాసోర్: ‘భారత సైన్యంలో చేరి పాక్ ఉగ్రవాదులను అంతమొందించాలనుకుంటున్నా’పహల్గాం దాడిలో తండ్రిని కోల్పోయిన ఓ బాలుని కోరిక ఇది. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నానని తొమ్మిదేళ్ల తనూజ్ కుమార్ సత్పతి గురువారం వెల్లడించాడు. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం వస్తే.. తనలా ఏ బిడ్డా తండ్రిని కోల్పోకుండా చూడాలని చెబుతానన్నాడు. తనూజ్ తండ్రి ప్రశాంత్ సత్పతి పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం వారి కుటుంబాన్ని మీడియా కలవగా.. తనూజ్ మాట్లాడాడు. ‘‘నేనూ, అమ్మ బుధవారం ఉదయం నుంచి వార్తలు చూస్తూనే ఉన్నాం. పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి మాకు చయాలా సంతృప్తినిచ్చింది. మన సైన్యాన్ని చూసి గరి్వస్తున్నా’’అని తెలిపాడు. అంతేకాదు.. సైన్యం మొదటి నుంచి తనకు, తన తల్లికి అండగా ఉందని తనూజ్ చెప్పారు. ‘‘కొండపై నుంచి కిందకు వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని చెప్పాడు. ‘‘నాన్న వెంటనే పడిపోయాడు. నేను, అమ్మ అతని దగ్గరికి పరిగెత్తాం. తల నుంచి రక్తస్రావం అవుతోంది. నీళ్లు కావాలా అని అమ్మ అడగ్గానే.. అవునన్నాడు. నీళ్లు ఇచ్చాను’’అని పహల్గాంలో జరిగిన భయానక పరిస్థితులను తనూజ్ గుర్తు చేసుకున్నాడు. తనూజ్ పెద్దరికంగా మాట్లాడుతుండటంపై అతని తల్లి ప్రియా దర్శిని ఆందోళన వ్యక్తం చేసింది.‘‘అతను అకస్మాత్తుగా తన బాల్యాన్ని కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. పిల్లలు క్రమంగా పరిణితి చెందాలి. భగవంతుడు నా కొడుకును ఆశీర్వదించాలి’’అని ఆమె కోరుకున్నారు.
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

ఉద్యోగం కోసం వచ్చి ఐఫోన్లు మాయం చేశాడు
సనత్‌నగర్: ఉద్యోగం కోసం వచ్చినన ఓ వ్యక్తి రూ.1.40 లక్షల విలువైన రెండు ఐఫోన్లను చోరీ చేసిన ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బేగంపేట డీఐ జి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..బేగంపేటలోని ఎఫ్డీఆర్ ఆర్డీ టవర్స్‌లో గల జెప్టో కార్యాలయానికి స్టోర్ ప్యాకర్‌గా పనిచేసేందుకు బాలానగర్‌లోని జింకలవాడకు చెందిన గౌతమ్ అంకిత్‌పాత్ర (24) ఈ నెల 3వ తేదీన వచ్చాడు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత స్టోర్‌లో పనిచేసేందుకు అంగీకరించాడు. స్టోర్‌ను ఒకసారి చూసి వస్తానని చెప్పి స్టోర్‌లో కనిపించిన రెండు విలువైన ఐఫోన్లను తీసి దాచుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి కార్యాలయానికి రాలేదు. ఆ తర్వాత స్టోర్ ఆడిట్ చేసిన నిర్వాహకులు రెండు ఐఫోన్లు కనిపించడం లేదని గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా గౌతమ్ అంకిత్‌పాత్ర సెల్ఫోన్లను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు స్టోర్ ఉద్యగి తిలక్‌కుమార్ బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత అదృశ్యం సికింద్రాబాద్: భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచి్చన వివాహిత అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. ఒడిశా రాష్ట్రం పలపాతి గ్రామానికి చెందిన జడునాథ్ ముర్ము, మల్హో మణి ముర్ము(26) దంపతులు. ఈ నెల 6న సాయంత్రం 8 గంటల సమయంలో భార్యభర్తలు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్ తీసుకొని విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలెక్కారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ప్లాట్ ఫాం నంబర్ 1లోని గేట్ నంబర్ 5 వద్ద కూర్చున్నారు. టూత్‌పేస్ట్ తీసుకొచ్చేందుకు భర్త జడునాథ్ బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య కనిపించకుండా పోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా భార్య మల్హో మణి ఆచూకీ లభించకపోవడంతో జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లో యువకుడి ఆత్మహత్య చిక్కడపల్లి: పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రో స్టేషన్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం చిక్కడపల్లి మెట్రోస్టేషన్‌కు వచి్చన గుర్తుతెలియని యువకుడు అక్కడే వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనిని గుర్తించిన మెట్రో సిబ్బంది 108కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నారాయణరెడ్డి హత్య కేసులో.. 11 మందికి జీవిత ఖైదు
కర్నూలు (సెంట్రల్)/వెల్దుర్తి: కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త లక్ష్మీనారాయణరెడ్డి, ఆయన అనుచరుడు బోయ సాంబశివుడు హత్య కేసులో 11 మంది నిందితులపై నేరం రుజువైంది. వీరందరికీ జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి జి. కబర్థి గురువారం తీర్పు చెప్పారు. మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డి అనుచరులతో కలిసి కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో పెళ్లికి రెండు వాహనాల్లో బయల్దేరారు. నిందితులు రెండు ట్రాక్టర్లలో వచ్చి నారాయణరెడ్డి కారును ఢీకొట్టి నారాయణరెడ్డిపై దాడిచేసి హత్యచేశారు. అడ్డుకోబోయిన సాంబశివుడునూ అంతమొందించారు. కృష్ణగిరి పోలీసులు కేసు నమోదుచేసి 19 మందిపై చార్జిషీటు దాఖలు చేశారు. నిందితులుగా ఉన్న ప్రస్తుత పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ప్రస్తుత వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మలు హైకోర్టును ఆశ్రయించగా వీరి పేర్లు కేసు నుంచి తొలగించారు. ఏ4గా ఉన్న కోతుల రామాంజనేయులు చనిపోవడంతో మొత్తం 16 మందిపై తుది విచారణ సాగింది. ఇందులో 11 మందికి జీవిత ఖైదు పడగా, ఐదుగురిపై నేరం రుజువు కాలేదు. జీవిత ఖైదు పడిన నిందితులు వీరే.. కురువ రామాంజనేయులు, రామయ్యనాయుడు, కురువ రామకృష్ణ, కోతుల బాలు, కోతుల చిన్న ఎల్లప్ప, కోతుల పెద్ద ఎల్లప్ప, గంటల వెంకటరాముడు, గంటల శీను, బీసన్నగారి రామాంజనేయులు(40), బీసన్నగారి రామాంజనేయులు(42), బీసన్నగారి పెద్ద బీసన్నలకు జీవితఖైదు పడింది. చాకలి నారాయణ, కర్రి గిడ్డయ్య, చెరుకులపాడు గోపాల్, చిన్న వెంకటలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బీసన్నగారి పెద్ద బీసన్న వయస్సు ప్రస్తుతం 83 ఏళ్లు. నిందితుడు ఆత్మహత్యా యత్నం.. నిందితుల్లో ఒకరైన రామాంజనేయులును వాహనంలో కడపకు తీసుకెళ్తుండగా తలను వాహనం కిటికీకి కొట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకే.. నారాయణరెడ్డి, బోయ సాంబశివుడు హత్యకేసులో తమకే ఎందుకు జీవితఖైదు పడిందని, కేఈ శ్యాంబాబుకు ఎందుకు శిక్ష పడలేదని నిందితులు కురువ రామాంజనేయులు, బీసన్నగారి రామాంజనేయులు ప్రశ్నించారు. కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకు పోవాల్సిందేనని, ఆ కుటుంబాన్ని ఎవరూ నమ్మొద్దని.. వారెలాంటి సాయం చేయరని, తమకు తగిన శాస్తి జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.చట్టం, కోర్టులపై నమ్మకం పెరిగింది.. నారాయణరెడ్డి సతీమణి,మాజీఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనంతరం.. కర్నూలులోని తన స్వగృహంలో నారాయణరెడ్డి సతీమణి, కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఈ అంశంపై స్పందించారు. కోర్టు తీర్పుతో, పోలీసులు కేసులో చూపిన తెగువతో తమకు, ప్రజలకు చట్టంపై, కోర్టులపై నమ్మకం పెరుగుతోందన్నారు. తన భర్త నారాయణరెడ్డి బతికుంటే ఎమ్మెల్యే కాలేమన్న భయంతోనే కేఈ శ్యాంబాబు కుట్ర పన్ని హత్య చేయించారని ఆమె ఆరోపించారు. నారాయణరెడ్డి హత్య కేసు తీర్పును చూసి ప్రజలు కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉండాలని శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. నారాయణరెడ్డి సోదరుడు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. కేఈ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే తన తండ్రిని, తన సోదరుడిని పోగొట్టుకున్నామన్నారు.

మందుపాతర్లు పేల్చిన మావోయిస్టులు
వాజేడు/ఎంజీఎం/సాక్షి, హైదరాబాద్: కర్రిగుట్టలు మరోసారి దద్దరిల్లాయి. ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టల పైనున్న పెనుగోలు గ్రామ సమీప నూగూరు అటవీ ప్రాంతంలో అమర్చిన మందుపాతరలను మావోయిస్టులు పేల్చేశారు. అనంతరం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్రే హౌండ్స్‌కు చెందిన కమాండోలు వడ్ల శ్రీధర్ (జేసీ4973/పీసీ1785), ఎన్.పవన్‌కల్యాణ్ (జేసీ10541/పీసీ) టి.సందీప్ (జేసీ 4638/పీసీ8124) అక్కడికక్కడే మృతి చెందారు. పైడిపల్లికి చెందిన అర్ఎస్ఐ సీహెచ్ రణదీర్ గాయపడ్డారు. మరో ఇద్దరు జవాన్లు కూడా గాయపడినట్లు సమాచారం. కాగా మెరుగైన వైద్యం కోసం రణదీర్‌ను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు. ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. భారీ ఎన్కౌంటర్ మరుసటి రోజే.. కర్రిగుట్టల్లో చేపట్టిన కగార్ ఆపరేషన్ 17 రోజులకు చేరుకుంది. కర్రి గుట్టలను చుట్టు ముట్టిన భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే బుధవారం ఎన్కౌంటర్ చోటు చేసుకోగా భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కూంబింగ్ కోసం వచ్చే దళాలను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకుని ముందే అమర్చిన మందుపాతరలను రిమోట్ల సహాయంతో పేల్చివేసినట్లు తెలుస్తోంది. 35 – 40 మందితో కూడిన మావోయిస్టుల బృందం (మహిళలు కూడా ఉన్నారు) ఇందులో పాల్గొన్నట్టు సమాచారం. మృతదేహాలు పరిశీలించిన మంత్రి, డీజీపీ గ్రేహౌండ్స్ కమాండర్ల మృతదేహాలను రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, డీజీపీ జితేందర్, గ్రే హౌండ్స్ ఏడీజీ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, ము లుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ మార్చురీ వద్ద పరిశీలించారు. ఈ ఘటనపై వాజేడు పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 62, 148, 191(1), 191(3), 103, 109 ఆర్/డబ్ల్యూ 190 బీఎన్ఎస్, సెక్షన్ 25(1–బీ)(ఏ), 27 ఏఆర్‌ఎమ్‌ఎస్ యాక్ట్, సెక్షన్ 10, 13 ,18,20, కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కాగా మందుపాతర్ల పేలుడులో మరణించిన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ (30)కు 9 నెలల క్రితమే వివాహమైనట్లు తెలిసింది. నాలుగు గంటల పాటు పోస్టుమార్టం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వరంగల్ ఎంజీఎం మార్చురీకి చేరుకున్న పోలీసుల మృతదేహాలకు ఫోరెన్సిక్ నిపుణులు నాలుగు గంటల పాటు పోస్టుమార్టం జరిపారు. బుల్లెట్ల గాయాలతోనే జవాన్లు మృతి చెందినట్లు ఫోరెన్సిక్ డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు: డీజీపీ ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐఈడీల కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పోలీసులపై దూరంలో మాటేసిన మావోయిస్టులు మందుపాతరలు పేల్చారని డీజీపీ తెలిపారు. సెర్చ్ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా భారీ కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు కాల్పులు ఆపేసి పారిపోయారన్నారు. ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దు: మావోయిస్టులు పోలీసుల వలలోపడి ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దని మావోయిస్టులు మరోమారు హెచ్చరించారు. ఈ మేరకు మావోయిస్టు వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట గురువారం ఒక లేఖ విడుదల అయ్యింది. ‘పోలీసు బలగాల కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి కర్రిగుట్టలపై బాంబులు అమర్చాం. ఈ విషయం ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేశాం. అయినా కొంతమంది ఆదివాసీ, ఆదివాసీయేతర ప్రజలకు పోలీసులు మాయ మాటలు చెప్పి నమ్మిస్తూ, డబ్బులు ఇస్తూ ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారు. షికారు పేరుతో వారిని కర్రిగుట్టల వైపు పంపిస్తున్నారు. మా రక్షణ కోసం అమర్చిన బాంబులు పేలి వారు చనిపోతున్నారు. కాబట్టి ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం..’అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఏడేళ్ల ప్రేమ అంతలోనే .. ! పాపం ఆ యువకుడు..
జమ్మికుంట(కరీంనగర్): ఇటీవల యువతలో ఒకరిని ప్రేమించడం, మరొకరిని పెళ్లాడటం కామన్‌గా మారిపోయింది. అయితే కొందరు దీన్ని జీర్ణించుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతుండటమే బాధకరం. అలాంటి దారుణ ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకెళ్తే..కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో ఆమె ఇటీవలే వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఇది తెలిసి మనస్తాపం చెందిన ఎల్లేష్ సెల్ఫీ వీడియో తీసుకోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా ఆ వీడియోలో తన ఫోన్లో ఆమెకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయని..యువతి వచ్చే వరకు తన శవాన్ని తీయవద్దని కోరాడు. అలాగే తనను ఇంతలా మోసం చేసిన ఆ యువతి కుటుంబంపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడ్డ యువకుడు7 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యకరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడితో ఏడేళ్ల నుండి ప్రేమ… pic.twitter.com/lx0DPxyUEd— Telugu Scribe (@TeluguScribe) May 8, 2025
వీడియోలు


యుద్ధానికి ముందు ఫోన్ చేసి.. వీర జవాను మురళీ నాయక్ తల్లిదండ్రులు కన్నీరు


భారత్ అంటే వణుకు నిజం ఒప్పుకున్న పాక్ ఎంపీ


War Updates: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ


రోజులు దగ్గర పడ్డాయి.. బాబు సర్కారుకు సజ్జల వార్నింగ్


భారత్ బాలిస్టిక్ క్షిపణులు, వీటి పవర్ చూస్తేనే సగం చస్తారు


పాక్ ను చీల్చి చెండాడిన ఆయుధాలను.. గూస్ బంప్స్ గ్యారెంటి వీడియో


యుద్ధంలో తెలుగు జవాన్ మృతి ..తల్లిదండ్రులను ఓదార్చిన జగన్


మరో పెద్ద తలకాయ లేచింది!


పాక్ ఆర్మీ బేస్ పై విరుచుకుపడిన భారత్ డ్రోన్లు


మరోసారి దాడికి పాక్ ప్లాన్.. మోదీ కీలక ఆదేశాలు