Virender
-
పిల్లలూ... చదవాలి లా
ఆ ఇంటి కుర్రాడు ఫోన్ లో వచ్చిన లింక్ నొక్కాడు. బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. మరో ఇంటి కుర్రాడు మార్ఫింగ్ ఫొటో పెట్టాడు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఇంకో ఆకతాయి బైక్ రేస్ చేశాడు. కేసు నెత్తిన పడింది. ఇవన్నీ ‘తెలియక’ చేసినవే. కానీ చట్టం ‘తెలియదు’ అనే మాటను క్షమించదు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచి లీగల్ పాఠాలు ఉండాలంటున్నారు రిటైర్డ్ ఐపిఎస్ వీరేందర్. ‘మిషన్ లీగల్ స్టడీస్ ఇండియా’ పేరుతో ఆయన ఢిల్లీలో చేస్తున్న కృషి దేశం అందుకోవాల్సి ఉంది.‘ఇగ్నొరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ యాన్ ఎక్స్క్యూజ్’ అని చట్టంలో మొదటి పాఠం. ‘మా వాడు బుద్ధిమంతుడు సార్, తెలియక చేశాడు’ అని తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా లాభం ఉండదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. తప్పులు... శిక్షలునేటి పిల్లల ప్రపంచం స్క్రీన్ అంత చిన్నది... లేదా స్క్రీన్ అంత పెద్దది. స్క్రీన్ మీద ఏది కనిపిస్తే అదే నిజం అనుకుంటున్నారు. సైబర్ నేరం చేస్తే జైలుకు వెళ్తారని తెలియదు. అమ్మాయి ఫోటో అనుమతి లేకుండా షేర్ చేస్తే పోక్సో అవుతుందని తెలియదు. బైక్‌పై ముగ్గురు వెళ్తే, హెల్మెట్ లేకపోతే, మైనర్ డ్రైవింగ్ చేస్తే తలిదండ్రులకు కూడా జైలు శిక్ష పడుతుందని తెలియదు. మనం కూడా మార్కులు, ర్యాంకులు, ఐఐటి.. నీట్ అంటూ పరుగెత్తిస్తాం. కానీ రోడ్డు మీద ఎలా నడవాలి, ఫోన్ లో ఏం చేయకూడదు, ఆపద వస్తే ఏ చట్టం కాపాడుతుంది అనే ‘బతుకు పాఠం’ చెప్పం. ఫలితం? చిన్న తప్పు చేసి జీవితాన్ని బజారున పడేసుకుంటున్నారు.బడిలో చట్టం నేర్పిస్తే?‘లీగల్ స్టడీస్’ అనే సబ్జెక్ట్ సి.బి.ఎస్.ఇ.లో 11, 12 క్లాసులకు ఆప్షనల్‌గా ఉంది. ఆర్.టి.ఐ ఎలా వేయాలి, కన్సూ్యమర్ హక్కులు ఏంటి, సైబర్ చట్టాలు, మహిళా రక్షణ చట్టాలు, ట్రాఫిక్ రూల్స్ అన్నీ అందులో ఉంటాయి. కానీ ఢిల్లీలో 1500 స్కూల్స్ ఉంటే కేవలం 29 స్కూల్స్ మాత్రమే ఈ సబ్జెక్ట్ ఆఫర్ చేస్తున్నాయి. ఎందుకు? ‘దీనివల్ల కెరీర్ ఏముంది’ అని స్కూల్స్ అనుకుంటాయి. ‘మార్కులు రావు’ అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఇది మార్కుల పాఠం కాదు, మనిషిగా బతికే పాఠం. దీన్ని ఎవరు చె΄్పాలి? రిటైర్డ్ జడ్జిలు, లాయర్లు, పోలీస్ అధికారులు వారానికి ఒక పీరియడ్ తీసుకుంటే చాలు.కోర్టులో నల్లకోటు వేసుకునే లాయర్ బడిలో చాక్‌పీస్ పడితే చట్టం పిల్లల భాషలోకి దిగివస్తుంది. ‘కేసు’ అంటే భయం పోయి ‘క్లారిటీ’ వస్తుంది. సినిమాల్లో చూసే పోలీస్, లాయర్ కాకుండా నిజమైన చట్టం తెలుస్తుంది. నేర్చుకుంటే నేరం ఆగుతుంది. ఒక పిల్లవాడికి తన హక్కులు తెలిస్తే, ఎదుటివాడి హక్కులూ తెలుస్తాయి. ‘రోడ్డు నాదే’ అని బైక్ నడిపేవాడు ‘రూల్ అందరిదీ’ అని నమ్ముతాడు. చట్టం తెలిసిన పౌరుడు పోలీస్‌కు సాయం చేస్తాడు, భయపడడు. మోసం జరిగితే కన్సూ్యమర్ కోర్టుకు వెళ్తాడు. అమ్మాయిని ఏడిపిస్తే అది ‘ఈవ్ టీజింగ్’ కాదు, ‘క్రిమినల్ ఆఫెన్ ్స’ అని గట్టిగా చె΄్తాడు. సమాజం మారాలంటే శిక్ష ఎందుకు పడుతుందో తెలియాలి. అది బడి నుంచే తెలియాలి.అతని కృషిఢిల్లీ రిటైర్డ్ ఐ.పి.ఎస్. ఆఫీసర్ వీరేందర్ పుంజ్ ఈ విషయంలో మొదటగా కళ్లు తెరిచారు. 2012 నిర్భయ కేసు సమయంలో ఆయన్ను ఒక ప్రశ్న వెంటాడింది. ‘నిందితుల్లో ఒకడు మైనర్. వాడికి చిన్నప్పుడే చట్టం పాఠం చెప్పుంటే ఈ దారుణం జరిగేదా?’... ఈ ప్రశ్నకు జవాబుగా రిటైర్ అయ్యాక స్కూల్ బ్యాగ్ తగిలించుకున్నాడు. ‘మిషన్ లీగల్ స్టడీస్ ఇండియా’ పేరుతో బడి బడికీ తిరుగుతున్నాడు. పిల్లలతో మాట్లాడుతున్నాడు. ‘మీ హక్కులు తెలుసా?’ అని అడుగుతున్నాడు. పిల్లలు ఆయనకు ఉత్తరాలు రాశారు. ‘మాకు లీగల్ స్టడీస్ కావాలి’ అని. ‘"WE WANT LEGAL STUDIES SUBJECT IN OUR SCHOOLS" ‘ అని ప్లకార్డులు పట్టుకున్నారు. చిన్నప్పుడు హిట్ అండ్ రన్ కేసులో తండ్రిని పోగొట్టుకున్న వీరేందర్‌కు న్యాయం జరగలేదు. ఆ గాయమే ఇవాళ వేల మంది పిల్లలకు చట్టం అనే కవచం ఇచ్చేలా చేస్తోంది. ఒక్క పిరియడ్ చాలుచట్టం పుస్తకంలో కాదు, బుర్రలో ఉండాలి. మామిడి పండు తియ్యగా ఉండాలంటే మొక్క సమయం నుంచి నీళ్లు పోయాలి. పౌరుడు బాధ్యతగా ఉండాలంటే బడిలోనే చట్టం నేర్పాలి. క్లాస్‌రూమ్‌లో ఒక్క పిరియడ్ చట్టం వింటే చాలు. జీవితం సేఫ్. రేపు మీ పిల్లల స్కూల్లో ‘లీగల్ స్టడీస్’ ఉందా అని అడగండి. లేకపోతే అడిగించండి. చట్టం తెలిసిన బిడ్డ ఇంటికి భరోసా, దేశానికి ధీమా. – కె. -
చావు తెలివి తేటలు
న్యూఢిల్లీ: న్యాయం నుంచి తప్పించుకోవడానికి ఒక దొంగగారు ఎంత దూరం వెళ్లారో తెలుసా? ఏకంగా యమలోకం వరకూ!.. అవును, దొంగతనాలు చేసిచేసి.. విచారణలంటే విసుగొచ్చిన ఒక మహా మేధావేం చేశాడో తెలుసా? తాను చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. రెండేళ్లుగా ’చనిపో యినవాడి’ హోదాలో హాయిగా బతికేస్తున్నాడు. ఈ టెక్నాలజీ ఉంది చూశారూ.. అదిమాత్రం మనోడిని రెండేళ్ల తర్వాత పట్టించేసింది పాపం.కోర్టులు, కేసులు నా వల్లకాదెహే..ఆ ఘనుడి పేరు వీరేందర్ విమల్ (35). ఇతను దొంగతనాలు, తుపాకుల కేసుల్లో రెగ్యులర్ కస్టమర్. కోర్టులో నాన్–బెయిలబుల్ వారెంట్లు వస్తూ ఉంటే, విమల్‌కు ఒళ్లు మండింది. ’ఈ కోర్టులు, పోలీసులు, కేసులు... నా వల్ల కాదసలు! నేను ఇంకో దారి చూసుకోవాలి,’ అనుకున్నాడు. సాధారణంగా మనుషులు చనిపోతే స్వర్గానికి వెళ్తారు. కానీ ఈ వీరేందర్ విమల్ మాత్రం.. న్యాయం నుంచి తప్పించుకోవడానికి చనిపోయినట్లు నటిస్తూ, ’భూలోక స్వర్గానికి’ వెళ్లిపోయాడు!కళ్లు మూసుకుని.. ‘కన్ను మూసినట్లు’ ఇచ్చేశారు2021లో, విమల్ ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. పాత సినిమాల్లో విలన్లు చేసే పనిని, ఈయన ఏకంగా ప్రభుత్వంతోనే చేయించాడు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ జారీ చేసినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్‌ను సృష్టించాడు. ఆ సర్టిఫికెట్లో, ‘ఈ వీరేందర్ విమల్ అనే వ్యక్తి ఇక లేరు, ఆగస్ట్ 24, 2021న మరణించితిరి’ అని ఉంది! కోర్టులో ఆ ’చావు పత్రం’ సమర్పించగానే, జడ్జి గారు కూడా ‘మరణించిన వ్యక్తిని ఏం విచారించగలంలే’ అనుకుని కేసులను క్లోజ్ చేసేశారు. అక్కడ విమల్, ’చనిపోయిన వారి’ జాబితాలో చేరి, హాయిగా బతికేస్తున్నాడు. పోలీసులు కూడా, ‘పాపం, వాడు పోయాడు’ అని సైలెంట్ అయ్యారు.కానీ ట్విస్ట్ ఏంటంటే..పాత ఫైళ్లు దుమ్ము దులిపి చూస్తుంటే.. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) ఆదిత్య గౌతమ్ గారికి డౌటనుమానం వచ్చింది. వెంటనే ’విమల్ మరణ మిస్టరీని తెరిచారు. తీరా చూస్తే.. ‘అసలు చావలేదని.. ఆ మరణ ధ్రువపత్రం అంతా నకిలీది!’ అని తేలింది. పోలీసులేమో... అసలు ఎవడీడు? చావు పేరిట కూడా మమ్మల్ని మోసం చేస్తాడా?’ అని పళ్లు కొరికారు.గోరఖ్‌పూర్‌లో ‘బతికున్న దెయ్యం’పోలీసులు అతన్ని వెతకడానికి.. పాత పద్ధతులు వదిలేశారు. ’క్రైమ్ కుండ్లి’ (బయోమెట్రిక్ డేటాబేస్), ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనే సైన్స్ ఫిక్షన్ టెక్నాలజీని వాడారు. అంతే మనోడు అడ్డంగా దొరికిపోయాడు. విమల్ తాజా ఫొటోని ఆ సాఫ్ట్‌వేర్‌లో పడేయగానే.. ‘ఇతను చనిపోలేదు, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో బిందాస్‌గా బతికేస్తున్నాడు‘ అని చూపించింది! పోలీసులు గోరఖ్‌పూర్ వెళ్ళి, రెండేళ్లుగా ఖుషీఖుషీగా బతికేస్తున్న ఆ ’బతికున్న దెయ్యాన్ని’ పట్టుకుని లోపలేసేశారు.నీతి: దొంగతనాలు చేయకండి. ఒకవేళ చేసినా.. దయచేసి ’చచ్చిపోయినట్లు’ నటించకండి. ఎందుకంటే, ఢిల్లీ పోలీసుల టెక్నాలజీ... మీరెక్కడున్నా జాతకం పట్టిస్తుంది. -
మానసిక ఆరోగ్యమస్తు
సాక్షి, హైదరాబాద్: మనిషి జీవనవిధానంలో చోటుచేసుకుంటున్న మార్పులు నిత్య జీవితంలో అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. శారీరక సమస్యలతోపాటు మానసిక రుగ్మతలు కూడా పెరుగుతున్నాయి. ఐదేళ్ల క్రితం వచ్చిన కోవిడ్ మహమ్మారి తర్వాత అందరూ మానసిక ప్రశాంతత అవసరాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యం, వెల్నెస్ రంగంలో కూడా వేగంగా మార్పులు వస్తున్నాయి. భారతీయుల్లో ముఖ్యంగా యువత, విద్యార్థులు ‘మెంటల్ హెల్త్ అండ్ వెల్నెస్’పై దృష్టిపెడుతూ మానసిన వైద్య నిపుణుల వద్ద ‘కౌన్సెలింగ్’ తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. డిమాండ్ పెరుగుతుండటంతో మనదేశంలో ‘మెంటల్ హెల్త్ సెక్టార్’లో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. బెయిన్ ఇండియా ప్రైవేట్ ఈక్విటీ రిపోర్ట్–2024 ఇదే విషయాన్ని వెల్లడించింది. మెంటల్ హెల్త్ వెల్నెస్ రంగంలో అవకాశాలు భారీగా పెరుగుతున్నట్టు పేర్కొంది. 2023లో 372 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇండియా హెల్త్‌కేర్ మార్కెట్ విలువ.. 2025 చివరికల్లా 638 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బజాజ్ ఫిన్సర్వ్ ఏఎంసీ నివేదిక అంచనా వేసింది. మనదగ్గరా పెరిగిన డిమాండ్ తెలంగాణలో కూడా మెంటల్ హెల్త్ నిపుణులకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో మెంటల్ హెల్త్ ఎకోసిస్టమ్ ఏర్పడేందుకు దోహపడేలా మెంటల్ హెల్త్ స్టార్టప్‌ల స్థాపన మొదలైంది. అగర్తలా ఎన్ఐటీలో బీటెక్ పూర్తిచేసిన హైదరాబాద్‌కు చెందిన తరుణ్‌సాయి 2020లోనే మెంటల్ వెల్బీయింగ్ ఫైండ్హోప్ స్టార్టప్‌ను ప్రారంభించాడు. ఇది భారత్‌లోనే మొట్టమొదటి మెంటల్ హెల్త్ స్టార్టప్‌గా గుర్తింపు పొందడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్’నుంచి నిధులు కూడా సాధించింది.నగరంలో లాభాపేక్ష లేని స్మార్ట్ మైండ్స్ కౌన్సెలింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ‘లైఫ్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్’పై శిక్షణా తరగతులను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది. అదేవిధంగా యూ అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్ విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, దంపతులు వంటి వారికి కౌన్సెలింగ్ సేవలు అందిస్తోంది. ‘పాజ్ ఫర్ పర్స్పెక్టివ్–మెంటల్ హెల్త్ సరీ్వసెస్’, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ విభాగం, అన్ని ప్రధాన ఆసుపతుల్లోనూ మెంటల్ హెల్త్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాయి.కౌన్సెలింగ్‌కు వచ్చేవారి సంఖ్య పెరిగింది మెంటల్ హెల్త్ రంగంలో కౌన్సెలింగ్‌కు సంబంధించిన స్టార్టప్‌లతో పాటు యాప్‌లు కూడా విరివిగా వస్తున్నాయి. అవి ఇంకా విస్తృతంగా జనబాహుళ్యంలోకి రాలేదు. మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు అన్నివర్గాల వారు మా కౌన్సెలింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. గతంతో పోలి్చతే వైవాహికబంధంలో సమస్యలు, రిలేషన్షిప్స్ విషయంలో కౌన్సెలింగ్ కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్, యూ అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్ -
జీవితం తీరూతెన్నూ మార్చిన కరోనా
సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పటివరకు సాఫీగా సా గిన జీవనయానం ఇక ముందు అలాగే ఉండబోదు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు.. ఆ తరువాత రోజుల్లో ఎదురయ్యే సమస్యలకు ఎలాంటి పొంతన ఉండదు. అందరి జీవితాల్లో ఎంతోకొంత మేర మార్పులు సహజం’ అంటున్నారు మానసిక నిపుణులు. వివిధ వర్గాలు ముఖ్యంగా దిగువ, ఎగువ మధ్యతరగతి ప్రజల జీవితాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని, మనిషి ప్రవర్తన, సంబంధాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా 220 మందిని 21 అంశాలపై సైకాలజిస్ట్ డాక్టర్ సి.వీరేందర్, సోషియాలజీ ప్రొఫెసర్ రామయ్య వివిధ ప్రశ్నలను అడిగి సమాధానాలను రాబట్టారు. కరోనాతో ముడిపడిన వివిధ అంశాలు, అవి చూపే ప్రభావాలు, వివిధ వర్గాల ప్రజల ఆలోచన తీరు, ఏయే విషయాల్లో మార్పులొస్తాయనే దానిపై అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాలను, దీనిపై తాము చేసిన విశ్లేషణలను వీరేందర్ ‘సాక్షి’కి తెలిపారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. బతకాలంటే సవాళ్లు ఎదుర్కోవాల్సిందే.. కరోనాతో వ్యక్తిగత జీవితంలో, మనుషుల వైఖరుల్లో మార్పులొస్తాయి. ఆలోచనలు, ప్ర వర్తన, జీవనశైలి, అటవాట్లు మారతాయి. కు టుంబం, వ్యక్తులు, డబ్బు.. వీటి ప్రాధాన్యత మారుతుంది. వ్యక్తుల మధ్య సామాజికంగా, వ్యక్తిగతంగా మార్పులు తప్పవు. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న సందర్భంలో, తదనంతరం ఎదురయ్యే పరిణామాలను ఎవరికి వారు తమ పరిధుల్లో ఎదుర్కొనేందుకు తగిన పద్ధతులు, విధానాలను సిద్ధం చేసుకోవాలి. కనువిప్పు కలిగించింది.. కరోనా ప్రభావంతో ఎదురయ్యే ఒత్తిళ్లతో వివి ధ అంశాల్లో అనిశ్చితి చోటుచేసుకుంటుంది. వైవాహిక సంబంధాలు, విడాకులు వంటి వా టిపైనా కరోనా ప్రభావం పడింది. విహారయాత్రలు, విదేశీ ప్రయాణాలు వంటివి చేపట్టకూడదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ గడ్డు కాలంలోనూ మనుషుల్లో మానవత్వం వికసించింది. సమాజం చెడిపోయిందని నిరాశ, నిస్పృహలతో ఉన్న వారికి కరోనా సమయం కనువిప్పు కలిగించింది. -
నేనే చంపాను.. కాదు నేనే చంపాను!
న్యూఢిల్లీ: దేశరాజధానిలో మద్యం తాగి భార్యను రోజూ వేధిస్తున్న వీరేందర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గురువారం కూడా మద్యం తాగి వచ్చి గొడవచేయటంతో భార్య మిథిలేశ్, ముగ్గురు పిల్లలు కత్తితో తండ్రిపై దాడిచేశారు. దీంతో వీరేందర్ అక్కడిక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులకు వింత పరిస్థితి ఎదురైంది. వీరేందర్‌ను హత్యచేసింది నేనంటే నేనేనంటూ ముగ్గురు పిల్లలు, భార్య పోలీసుల ముందుకు వచ్చారు. అయితే.. స్థానికుల సమాచారం, బంధువుల విచారణ ఆధారంగా.. పెద్ద కుమారుడిని అరెస్టు చేశారు. -
వైద్యం వికటించి బాలిక మృతి
వైద్యం వికటించి బాలిక మృతి చెందిందని ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో శనివారం చోటుచేసుకుంది. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రసికంటి శైని(8) అనే బాలిక గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె తల్లి దండ్రులు చికిత్స నిమిత్త సిరిసిల్లలోని ప్రైవేట్ వైద్యుడు వీరేందర్ ఆర్.ఎమ్.పీ. వద్దకు తీసుకొచ్చారు. అతను పాపను పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ చేసిన కొద్ది సేపటికే బాలిక మృతిచెందడంతో.. బాలిక తల్లిదండ్రులు బంధువులు వైద్యం వికటించడం వల్లే బాలిక మృతిచెందిందని.. ఆందోళనకు దిగారు. -
పత్రాల లీక్ కేసులో ‘రక్షణ’ కార్మికుడు అరెస్ట్
న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యం వ్యవహారంలో అరెస్టయినవారి సంఖ్య 13కు చేరిం ది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ కార్మికుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. చమురు శాఖలో పత్రాల లీక్‌లో కీలక నిందితుడికి అతను నకిలీ ఐడీ కార్డును అందించి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బొగ్గు, విద్యుత్ మంత్రి త్వ శాఖల్లోనూ పత్రాల లీక్ వ్యవహారం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. పత్రాల లీకేజీలో రక్షణ శాఖలో క్యాజువల్ వర్కర్‌గా పనిచేస్తున్న వీరేందర్‌కుమార్ నిందితులకు సహకరించి నట్లు పోలీసులు గుర్తించారు. ఇండియన్ డిఫె న్స్ అకౌంట్స్‌సర్వీస్ అధికారి ఐడీ కార్డును వీరేందర్ దొంగిలించి నకిలీ కార్డును తయారుచేసి నిందితులు లల్తా ప్రసాద్, రామ్‌కుమార్ కు ఇచ్చాడని, దాంతోపాటు రక్షణ శాఖ లెటర్‌హెడ్‌ను వాడుకుని వాళ్లు వివిధ శాఖల్లోకి అక్రమంగా ప్రవేశించారని అధికారులు చెప్పారు. కాగా కార్పొరేట్ గూఢచర్యం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాలని కాంగ్రెస్ లోక్‌సభలో డిమాండ్ చేసింది. -
ప్రేమికుల రోజు నిషేధానికి సహకరించండి
కలెక్టరేట్: ప్రేమికుల రోజును నిషేధించడంలో తమ కార్యకర్తలకు ప్రభుత్వం సహకరించాలని, దీనివల్ల భారతదేశ సంస్కృతిని కాపాడినట్లవుతుందని బజరంగ్దళ్ హిందీనగర్ జిల్లా ప్రముఖ్ వీరేందర్ కోరారు. గురువారం నాంపల్లిలోని కాశీ విశ్వనాథ దేవాలయంలోబజరంగ్దళ్, వీహెచ్‌పీ నాయకులు సంయుక్తంగా ‘బ్యాన్ వాలెంటైన్స్‌డే-సేవ్ భారత్’ పేరుతో వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రేమకు ప్రతి రూపమైన భారతదేశ సంస్కృతిని ఇటువంటి కార్యక్రమాలతో విదేశీ శక్తులు కలుషితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సహ కార్యదర్శి గిరిధర్, కిరణ్, రాకేష్, లక్ష్మణ్, సాయి, శంకర్ పాల్గొన్నారు. వీహెచ్‌పీని అడ్డుకోవాలని సీపీఐ వినతి హిమాయత్‌నగర్: ప్రేమికుల దినోత్సవం రోజున ‘జంటలు బహిరంగంగా కనిపిస్తే పెళ్లి చేస్తామ’ంటూ హెచ్చరిస్తున్న విశ్వహిందూ పరిషత్, శివసేనల ఆగడాలను అడ్డుకోవాలని సీపీఐ నార్త్ జోన్ కార్యదర్శి డాక్టర్ సుధాకర్, తదితరులు గురువారం అదనపు సీపీ అంజనీ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అసాంఘిక కార్యకలాపాల పేరుతో ఆ సంస్థలు ఈనెల 14న యువతీ యువకులపై తమ ప్రతాపం చూపుతామంటూ కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో ప్రచారం చేస్తున్నాయని గుర్తు చేశారు. అలాంటి వారి నుంచి కాపాడాలని ఏసీపీని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.వేణు, యువజన నాయకురాలు ఉషారాణి, సీపీఐ నాయకులు రాకేష్‌సింగ్, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. నీతి బాహ్య చర్యకు అడ్డుకట్ట వేయండి సిటీబ్యూరో: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి నీతి బాహ్యమైన చర్యలు జరుగకుండా కట్టడి చేయాలని మెరాజ్ ఖాన్ ఉమెన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మెరాజ్ ఖాన్ రాష్ర్ట గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రేమికుల దినోత్సవం పేరుతో జరిగే చర్యలతో శాంతికి భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గవర్నర్ స్పందిస్తూ దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చార ని తెలిపారు. -
తెలంగాణ మంత్రులతో భేటీ
వినతిపత్రం సమర్పించిన ముంబై తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ముంబై నుంచి తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. బృందంలోనినాయకులు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పూలబొకే అందజేసి ముంబైలో ఉంటున్న తెలంగాణ ప్రజల తరపున అభినందనలు తెలియజేశారు. సోమవారం పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. ముంబైలోని వలస ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర ఇబ్బందులు, పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రులకు అందజేశారు. ఈ బృందం ఈ నెల ఏడున ముంబై నుంచి బయలుదేరింది. కేసీఆర్, మంత్రులతో భేటీ అయిన వారిలో వేదిక నాయకులు బత్తుల లింగం, ఎడ్ల సత్తయ్య, స్వామి, వీరేందర్, అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక కార్యదర్శి మచ్చ ప్రభాకర్ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ జేఏసీ కార్యదర్శి నల్లా రాధాకృష్ణ, సత్తిరెడ్డితోపాటు వీళ్లంతా సచివాలయం డి-బ్లాక్‌లోని మంత్రుల కార్యాలయలకు వె ళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎన్జీఓ అధ్యక్షుడు, కార్యదర్శి దేవి ప్రసాద్, కారం రవీందర్‌రెడ్డితోనూ భేటీ అయ్యారు.


