village farmers
-
బలవంతపు భూసేకరణ చేస్తే.. కలెక్టరేట్లో ఉరి వేసుకుంటాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు వెస్ట్: బలవంతంగా తమ భూములు లాక్కుంటే కలెక్టరేట్లోని చెట్టుకు ఉరి వేసుకుంటామని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి రైతులు హెచ్చరించారు. రాజధాని భూసేకరణ నుంచి ఉండవల్లి గ్రామాన్ని తొలగించాలని కోరుతూ పెద్దఎత్తున రైతులు సోమవారం గుంటూరు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ సాయికాంత్ వర్మ వారికి హామీ ఇచ్చారు. అనంతరం రాయపూడిలోని సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజుకూ రైతులు వినతిపత్రం ఇచ్చారు.తాము రాజధానికి వ్యతిరేకం కాదని, మా తాత ముత్తాతల నుంచి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూములను కాపాడుకోవడం కోసం భూ సమీకరణ, భూసేకరణలకు వ్యతిరేకంగా 12 ఏళ్లుగా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. ప్రజా ప్రయోజనార్థం సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి, కొండవీటి వాగు అభివృద్ధి పనులకు ఇప్పటికే పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామన్నారు. అమరావతి రాజధానికి కావాల్సినంత భూమి సీఆర్డీఏ వద్ద ఉందని, అందులో నిర్మాణాలు పూర్తిచేసుకోవాలని రైతులు సూచించారు.మాకున్న కొద్దిపాటి భూమిని కుటుంబ సభ్యులు పంచుకుంటే వచ్చే వాటా చాలా తక్కువగా ఉంటుందని, ఈ భూమిని సీఆర్డీఏకి ఇస్తే వారు తిరిగి ఇచ్చే ప్లాట్ల పరిమాణం ఏమాత్రం సరిపోదని.. అందుకే భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నామని వారు స్పష్టంచేశారు. తమకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమని తేల్చిచెప్పారు. తాము 12 ఏళ్లుగా భూ సమీకరణకు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం కక్షగట్టి భూసేకరణకు సిద్ధమైందన్నారు. ఇప్పటికే 280 మందికి నోటీసులు ఇచ్చారని, ఊరు పేరులేని పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చి రైతులకు సమాచారం తెలీకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తంచేశారు.మార్టీపై ఎందుకీ కక్ష?మేం చిన్న సన్నకారు రైతులం. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం ఇప్పటికే భూములిచ్చాం. ఇప్పుడు మళ్లీ భూసేకరణ అంటూ బెదిరిస్తున్నారు. ఉన్న ఎకరాన్ని కూడా ఇవ్వాలంటున్నారు. మాకు వ్యవసాయం తప్పితే మరో పని తెలీదు. ప్రభుత్వం మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తుందనుకోలేదు. ఏం జరిగినా మేం భూములిచ్చే ప్రసక్తే లేదు. – టి. సంజీవరెడ్డి, ఉండవల్లిరైతులకు ప్రభుత్వం ఏమేలు చేసిందో చెప్పండి మా భూమిని అన్నం పెట్టే తల్లిలా భావిస్తున్నాం. దీనిని లాక్కుంటామంటే ఎలా? ఈ రెండేళ్లలో రైతులకు కూటమి ప్రభుత్వం ఏం మేలు చేసిందో చెప్పండి? పైగా ఇప్పుడొచ్చి భూములపై పడుతున్నారు. నాకు కేవలం అర ఎకరా పొలమే ఉంది. దీనిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేదిలేదు. – జి. బుసిరెడ్డి, ఉండవల్లిరిజిస్ట్రేషన్లు చేయడంలేదు.. మా భూములకు రిజిస్ట్రేషన్లు కూడా చేయడంలేదు. ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఒక విధంగా ప్రభుత్వం రైతులను బెదిరిస్తోంది. పిల్లల చదువుల కోసం భూమి పత్రాలు పెట్టి అప్పు తీసుకుందామన్నా అవకాశంలేకుండా చేస్తున్నారు. ప్లాట్ ఇచ్చేదెప్పుడు? అది అమ్ముడుపోయేదెప్పుడు? అప్పటి వరకూ మేం పిల్లల చదువును ఏం చేయాలి. – ప్రభాకర్, ఉండవల్లిఅధికారంలోని వారు ఏం త్యాగం చేస్తున్నారు? అభివృద్ధిని అడ్డుకోవడం రైతుల అభిమతం కాదు. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం ఇప్పటికే అర ఎకరం భూమిచ్చా. మిగిలి ఉన్న కొద్దిపాటి భూమినీ ఇప్పుడు ఇచ్చేయమంటున్నారు. అధికారంలో ఉన్న వారు అమరావతి రాజధాని కోసం ఏమాత్రం త్యాగం చేస్తున్నారో చెప్పాలి. – పి. పోతిరెడ్డి, ఉండవల్లిప్రభుత్వం విధానం మార్చుకోవాలి.. కులమతాలకు, పార్టీలకతీతంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం అర్ధంచేసుకోవాలి. ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజేషన్ ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలి. ఇప్పటికే కొండవీటి వాగు కోసం భూమి ఇచ్చాం. రైతులను బెదిరించే ధోరణికి స్వస్తి పలకాలి. – ఎం. శ్రీనివాసరెడ్డి, ఉండవల్లి -
గ్రామ రైతులపై రాజన్న మాట..
-
అన్నదాతలు కూలీలయ్యారు..
► నాడు పదులసంఖ్యలో పని కల్పించిన రైతులు ► నేడు పొట్టకూటి కోసం ఉపాధి పనుల్లో కూలీలుగా ► బోర్లున్నా నీళ్లు లేక బీళ్లుగా మారిన పొలాలు ► ఇదీ మొగసాలమర్రి కరువు రైతుల దీనగాథ మొన్నటిదాకా పదుల సంఖ్యలో కూలీలకు పని కల్పించిన రైతులే ఇప్పుడు పొట్ట కూటి కోసం కూలీలు గా మారారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలుగా పనిచేస్తున్నారు. పంటలు సాగు చేసేందుకు బోర్లలో నీళ్లులేక..కుటుంబాలను పోషించుకునేందుకు దారిలేక కూలీలుగా మారారు. బి.కొత్తకోట మండలంలోని మొగసాలమర్రిలో రైతుల జీవితాలను కరువు తిరగరాసింది. పరిస్థితులు తలకిందులై సేద్యం చేసిన చేతులు పొట్టకూటి కోసం కూలీ కూలీ పనులు చేస్తున్నాయి. బి.కొత్తకోట : కరువు కాఠిన్యం ఎంతటివారినైనా అతలాకుతలం చేస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం బి.కొత్తకోట మండలంలోని మొగసాలమర్రి గ్రామం. గ్రామంలో 140 కుటుంబాలుండగా, వంద కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. ఒక్కో కుటుంబంలోని రైతులకు సగటున మూడు బోర్లున్నాయి. మొత్తం 300 బోర్లుంటాయి. వీటిలో ఒక్కబోరులోనూ నీళ్లు లేవు. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. దీంతో పొలాలు బీళ్లుగా మారాయి. మొన్నటిదాకా పదులసంఖ్యలో కూలీలకు పనికల్పించిన రైతులే ఇప్పుడు పొట్టకూటి కోసం కూలీలుగా మారారు. ఇక్కడి ఎగువచెరువులో ఉపాధి హామీ పథకం కింద మట్టిని తీసి పొలాలకు తరలించే పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో గ్రామ రైతులంతా కూలీలుగా పనిచేస్తున్నారు. గ్రామంలో 100 రోజుల పనులు చేసిన రైతులకు మళ్లీ పనులు ఇవ్వడంలేదు. మిగిలిన రైతులు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 45మంది రైతులు పనిచేస్తున్నారు. - ఆవులమ్మి..కూలీగా.. మొగసాలమర్రికి చెందిన రైతు సీ.వెంకటరమణారెడ్డికి 4.5ఎకరాల సేద్యం ఉంది. దీనికోసం 3బోర్లు వేయించాడు. ఒకబోరులో కొద్దిపాటి నీళ్లు వస్తుండడంతో కొంతపోలంలో పంటవేశాడు. నీళ్లు నిలిచిపోయి సేద్యం ఆగిపోయింది. కుటుంబాన్ని పోషించుకునేందుకు నాలుగు ఆవుల్లో రెండింటిని రూ.1.17లక్షలకు విక్రయించాడు. ఈ సొమ్ముతో బోర్లు వేసేందుకు చేసిన అప్పులు తీర్చాడు. అప్పు ఇంకా లక్ష మిగిలే ఉంది. ఇక దిక్కులేని పరిస్థితుల్లో భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకునేందుకు మరోమార్గంలేక ఉపాధి కూలీగా మారాడు. చెరువులో మట్టితీసే పనులకు రోజూ కూలీగా వెళ్తున్నాడు. వెంకటరమణారెడ్డి కుమారుడు పనుల కోసం బెంగళూరుకు వలసవెళ్లాడు. 30 మందికి పని కల్పించిన రైతు .. మొగసాలమర్రికి చెందిన వై.దేవేంద్రరెడ్డి మొన్నటి వరకు 30 మంది కూలీలకు పని కల్పించిన రైతు. తొమ్మిది ఎకరాల పొలంలో 35ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. సేద్యం తప్ప మరొకటి తెలియదు. అలాంటిది ఇప్పుడు ఉపాధి పనికి వెళ్తేగానీ కుటుంబం గడవని దుస్థితి. ఎగువచెరువుకింద నాలుగెకరాలు ఉన్న పెద్దరైతు ఇతనే. ఇదికాక బోర్లకింద ఐదెకరాల సేద్యం ఉంది. పంటలసాగు కోసం 2010నుంచి 8బోర్లు వేయించాడు. వీటీలో కొన్నింటిలో కొద్దిపాటి నీటితో సాగుచేస్తూ వచ్చాడు. ఇప్పుడు కరువు పరిస్థితులతో బోర్లన్నీ అడుగంటాయి. పంటలేదు. పొలాలన్నీ బీళ్లయ్యాయి. దీంతో ఒకసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. కుటుంబం గడవడమే ఇబ్బందికరంగా మారింది. ఇద్దరు కుమార్తెల చుదువు, కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారింది. దీనికితోడు రూ.2లక్షల అప్పులు తీర్చేందుకు రెండు పశువులను రూ.40వేలకు విక్రయించాడు. చేతిలోచిల్లిగవ్వలేదు. ఇక కూలీకి వెళ్లడం తప్పనిసరి అయ్యింది. ప్రస్తుతం మొగసాలమర్రి సమీపంలోని ఎగువచెరువులో ఉపాధి హమీపథకం కింద జరుగుతున్న మట్టిపనుల్లో దేవేంద్రరెడ్డి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. రోజుకు 30మందికి పని ఇచ్చిన తాననే కూలీగా మార్చింది కరువేనని మాటలకందని ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు.


