'యూత్' ట్రైలర్: హీరో వెనక పడుతున్న ముగ్గురమ్మాయిలు
తమిళ నటుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం యూత్. ఈ మూవీకి కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వం వహించడం విశేషం. జీవీ ప్రకాశ్ కుమార్ పైసా పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా సంగీతం అందించాడు. ఇటీవలే తమిళ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. తాజాగా యూత్ తెలుగు ట్రైలర్ వదిలారు. యూత్ తెలుగు ట్రైలర్'మీకు పుట్టినవాడు సాధారణమైన అబ్బాయి కాదు మేడమ్.. ఆ దేవుడే మీకు బిడ్డగా పుట్టాడు. వాడిని బ్యాడ్ బాయ్స్‌తో చేరనివ్వకండి' అన్న సంభాషణతో వీడియో మొదలవుతుంది. తీరా హీరో.. తనను ముగ్గురమ్మాయిలు ప్రేమిస్తున్నారని తెగ సంబరపడిపోతాడు. ఫైటింగ్, లవ్, కామెడీకి ఏమాత్రం కొదవ లేనట్లుగా చూపించారు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేలా ట్రైలర్ కట్ చేశారు. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది.