‘చిత్తూరు ఎస్పీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు’
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ నిర్బంధం, చిత్తూరు జిల్లాలో ఓట్ల తొలగింపు సర్వేలపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కంబాల జోగులు, రక్షణనిధి, అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్... సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ నేతల అక్రమ నిర్బంధం, ఓట్ల తొలగింపు అంశాలను సీఈవో దృష్టికి తీసుకు వెళ్లారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి