ఎన్నికల హామీలో చెప్పిన విధంగా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.12,500 కాకుండా రూ.13,500 ఇవ్వాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నప్పటికీ దానిని ఐదేళ్లకు పొడిగిస్తూ రూ.67,500 ఇస్తామని స్పష్టం చేశారు. రైతు మరణిస్తే.. ఆ కుటుంబానికి అర్హత ఉంటే, ఆ రైతు భార్యకు రైతు భరోసా వర్తింపజేసేలా మార్గదర్శకాలను సైతం సడలిస్తామని చెప్పారు.
పండగలా..రైతు భరోసా
Oct 15 2019 7:50 AM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement