జలపాతాన్ని తలపించిన బిల్డింగ్‌!

ముంబై : నగరంలోని కఫే పరేడ్‌ ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌ జలపాతాన్ని తలపించింది. బిల్డింగ్‌ పై నుంచి నీరు కారుతున్న వీడియో చూపరులను ఆకట్టుకుంది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఓ నెటిజన్‌ ట్విటర్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశాడు. ‘వాటర్‌ ఫాల్స్‌ ఇన్‌ న్యూ కఫే పరేడ్‌’అంటూ పేర్కొన్నాడు.  ఈ వీడియో కూడా వైరల్‌గా మారడంతో.. భారీ వర్షాల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని చాలా మంది  భావించారు.

అయితే భారీ వర్షాల కారణంగా బిల్డింగ్‌పై వర్షపు నీరు కిందకు వచ్చిందనే వార్తలను సదురు బిల్డింగ్‌ నిర్వాహకులు ఖండించారు. బిల్డింగ్‌పై ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త వాటర్‌ ట్యాంక్‌ను పరీక్షిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు వారు తెలిపారు. వాటర్‌ ట్యాంక్‌కు లీక్‌ ఏర్పడటంతో నీరు కిందకు ప్రవహించిందని పేర్కొన్నారు. 

మరోవైపు భారీ వర్షాలతో ముంబైలో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు చెరవులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top