breaking news
Cuffe Parade
-
జలపాతాన్ని తలపించిన బిల్డింగ్!
-
జలపాతాన్ని తలపించిన బిల్డింగ్!
ముంబై : నగరంలోని కఫే పరేడ్ ప్రాంతంలోని ఓ బిల్డింగ్ జలపాతాన్ని తలపించింది. బిల్డింగ్ పై నుంచి నీరు కారుతున్న వీడియో చూపరులను ఆకట్టుకుంది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఓ నెటిజన్ ట్విటర్లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. ‘వాటర్ ఫాల్స్ ఇన్ న్యూ కఫే పరేడ్’అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో.. భారీ వర్షాల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని చాలా మంది భావించారు. అయితే భారీ వర్షాల కారణంగా బిల్డింగ్‌పై వర్షపు నీరు కిందకు వచ్చిందనే వార్తలను సదురు బిల్డింగ్ నిర్వాహకులు ఖండించారు. బిల్డింగ్‌పై ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త వాటర్ ట్యాంక్‌ను పరీక్షిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు వారు తెలిపారు. వాటర్ ట్యాంక్‌కు లీక్ ఏర్పడటంతో నీరు కిందకు ప్రవహించిందని పేర్కొన్నారు. మరోవైపు భారీ వర్షాలతో ముంబైలో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు చెరవులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. -
ముంబయిలో అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి!
-
ముంబయిలో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి!
ముంబయి : దక్షిణ ముంబయిలోని కఫె పరేడ్ ప్రాంతంలోని మేకర్ టవర్స్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 20 అంతస్తుల భవనంలో ఈ రోజు ఉదయం మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడే సరికి టవర్స్‌లోని పలువురు భయంతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అలాగే మంటల్లో చిక్కుకున్న 11మందిని సురక్షితంగా రక్షించారు. కాగా దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. కాగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎండీ శేఖర్ బజాజ్ ఫ్లాట్ నుంచి ముందుగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.