నీ ఏకాగ్ర‌త‌ను మెచ్చుకోవాల్సిందే | How Young Girl Shows Off Tennis Skills | Sakshi
Sakshi News home page

నీ ఏకాగ్ర‌త‌ను మెచ్చుకోవాల్సిందే

Apr 23 2020 7:25 PM | Updated on Mar 22 2024 11:26 AM

ముంబై : టెన్నిస్‌, క్రికెట్‌, ఇత‌ర ఏ ఆటైనా స‌రే.. ఆట‌గాడు ఆడుతున్నాడంటే క‌చ్చితంగా కంటికి, చేతికి కో-ఆర్డినేష‌న్ చాలా అవ‌స‌రం ప‌డుతుంది. అప్ప‌డే క‌దా ఒక ఆట‌గాడు ప‌రిపూర్ణ‌మైన షాట్ ఆడడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీంతో పాటు ఆట‌లో బ్యాలెన్సింగ్ అనేదానికి చాలా ప్రాముఖ్య‌త ఉంటుంది. తాజాగా  వుమెన్స్ టెన్నిస్ అసోసియేష‌న్‌(డ‌బ్ల్యూటీఏ) త‌న ట్విట‌ర్‌లో ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక అమ్మాయి టెన్నిస్ ప్రాక్టీస్ సంద‌ర్భంగా బ్యాలెన్సింగ్ ఎంత బాగా చేసిందనేది చూపించారు. ఆమె తన కుడి చేతిలో రాకెట్ ప‌ట్టుకుని టెన్నిస్ బాల్‌తో ఆడుతూనే న‌డుముకు రింగ్ వేసుకొని బ్యాలెన్స్ చేసుకుంది. ఇక్క‌డ విష‌యం ఏంటంటే ఆమె ఆడుతున్నంత సేపు త‌న ఏకాగ్ర‌త చెద‌ర‌నివ్వ‌డ‌మే కాకుండా ఒక్క‌సారి కూడా రింగ్ కింద‌కు ప‌డ‌నివ్వ‌లేదు. త‌ర్వాత అదే రింగ్‌ను చేతిలోకి తీసుకొని.. రాకెట్‌తో బాల్‌ను కొడుతూనే ఏక‌కాలంలో  రింగ్‌ను బ్యాలెన్స్ చేసింది. (అయ్యో ! ర‌ణ్‌వీర్ ఎంత ప‌ని జ‌రిగే..)

డ‌బ్ల్యూటీఏ ట్విట‌ర్‌లో  స్పందిస్తూ.. ' ఈ అమ్మాయి టెన్నిస్ ఆడుతూనే రింగ్‌ను చక్క‌గా బ్యాలెన్స్ చేసింది. కంటికి చేతికి మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఏర్ప‌రచుకుంటునే ఏకాగ్ర‌త కోల్పోకుండా ఆడింది. ఇదంతా చేయాలంటే ఏకాగ్ర‌త, ప్రాక్టీస్‌తో పాటు ఓపిక కూడా ఎంతో అవ‌స‌రం.. ఈ అమ్మాయి అవ‌న్నీ ఎప్పుడో సాధించేసిందంటూ' క్యాప్ష‌న్ జ‌త చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement