వైరల్‌: అల్లుడి కోసం 67 రకాల వంటకాలు

కొత్త అల్లుడు అత్తారింటికి వస్తే వారికి మర్యాదలు ఆకాశాన్నంటుతాయి. కొత్త బట్టలు, కానుకలతోపాటు పిండి వంటలతో అల్లుడికి మొహం మొత్తేలా చేస్తారు కొందరు అత్తా మామలు. ఈ క్రమంలోనే భోజనంలోకి పలు రకాల కూరలు, రకారకాల స్వీట్స్‌, పిండివంటలతో అరిటాకు వేసి మరీ వడ్డించేస్తారు. ఈ పద్దతి మనకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అల్లుడు ఎప్పుడొచ్చినా వారికి ఇలా స్వాగతం పలుకుతారు అత్తింటివారు. ఆంధ్రాకు చెందిన ఓ అత్తగారు కూడా ఇటీవల పెళ్లైన తన కూతురు, ఆమె భర్త(అల్లుడు) కోసం తమ పద్దతిలో మర్యాద చేయాలనుకున్నారు. ఇంటికి వస్తున్న అల్లుడి కోసం ఏకంగా 67 రకాల వంటలు వండి 5 కోర్స్‌ మీల్స్‌ అరిటాకును సిద్దం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top