పాక్‌ క్రికెట్‌ జట్టులో కోహ్లి, ధావన్‌.. | A Video Shows Kohli And Dhawan To Play For Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌ క్రికెట్‌ జట్టులో కోహ్లి, ధావన్‌..

Sep 8 2019 2:26 PM | Updated on Mar 22 2024 11:30 AM

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు తరఫున టీమిండియా ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌లు ఆడినట్లు ఉన్న ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా ఆటగాళ్లు అయ్యి ఉండి పాకిస్తాన్‌ తరఫున ఆడటం, అందులోనూ దాయాది దేశం కోసం ఆడటాన్ని భారత క్రికెట్‌ అభిమానులు ఎంతమాత్రం సహించరు. కాకపోతే ఇది ఎవరో సృష్టించిన వీడియో. దీన్ని ఒక పాకిస్తాన్‌ జర్నలిస్టు షేర్‌ చేశాడు.  ఇందుకు ఒక క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. ‘పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు శ్రీనగర్‌లో క్రికెట్‌ ఆడుతుంది. పాకిస్తాన్‌ తరఫున కోహ్లి ఆడుతున్నాడు’ అని పేర్కొన్నాడు. 2025లో శ్రీనగర్‌ క్రికెట్‌ స్టేడియంలో టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ భాగంగా కోహ్లి, ధావన్‌లు పాకిస్తాన్‌ జట్టు తరఫున ఆడుతున్నట్లు చూపించారు.

Advertisement
 
Advertisement
Advertisement