మనో నిబ్బరం ఉండాలేగానీ సాధించలేనిది ఏదీ ఉండదు. ఇందుకు ఈ వికలాంగ బాలుడి ఆటే నిదర్శనం. అతని ధైర్యం ముందు వైకల్యం ఓటమితో తల వంచింది. వైకల్యంతో కాళ్లు లేకపోయినా మనో నిబ్బరంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నాడు. తన మిత్రులతో కలసి వారితో సమానంగా క్రికెట్ ఆడుతూ.. కళ్లు చెదిరే షాట్స్ కొట్టడమే కాకుండా వికెట్ల మధ్య అతను చేతులతో చేసే రన్నింగ్‌ను చూసి అతని సంకల్ప బలానికి కళ్లు ఆర్పకుండా చూస్తూ ఉండిపోతున్నారు. ఐఎఫ్ఎస్ అధికారిని సుధా రమెన్ ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.