వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం ఖరారు చేసింది. చాహల్, పాండ్యాకు చోటు కల్పిస్తున్నట్టు ప్రకటిస్తుంది. అయితే, అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు నిరాశే ఎదురైంది. కాగా, ఆల్ రౌండర్ల స్థానంలో హార్దిక్ పాండ్యాతో పాటు విజయ్ శంకర్‌కు చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలో ప్రపంచకప్‌లో పాల్గొనబోయే జట్టు ఈవిధంగా ఉంది.