ఇంగ్లండ్‌ గడ్డపై విరాట్‌ కోహ్లి ఫేవరేట్‌ షాట్‌

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై ఆస్ట్రేలియా మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అతడి ఇమేజ్‌ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ముందే ఇలా చేయడం చర్చనీయాంశమైంది. ఈ ప్రయత్నాలను భారత అభిమానులు తిప్పికొడుతున్నారు. ‘ఫాక్స్‌ స్పోర్ట్స్‌ ఆస్ట్రేలియా’  తన ఫేస్‌బుక్‌ పేజీలో కోహ్లిపై ప్రత్యేకంగా రూపొందించిన ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఇందులో గత ఇంగ్లండ్‌ పర్యటనలో కోహ్లి వైఫల్యాలను జతపరిచింది. అంతేకాకుండా ఈ వీడియోకు ‘ఇంగ్లండ్‌ గడ్డపై విరాట్‌ కోహ్లి ఫేవరేట్‌ షాట్‌’ అని సెటైరిక్‌ క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్‌ గడ్డపై కోహ్లి సాధించిన సెంచరీలు మరిచిపోయారా? అంటూ చురకలంటిస్తున్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top