విశ్వవేదికపై అరుణ రెడ్డి ఇలా.. | Sakshi
Sakshi News home page

విశ్వవేదికపై అరుణ రెడ్డి ఇలా..

Published Thu, Mar 15 2018 12:31 PM

ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ జిమ్నాస్టిక్స్‌ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డి కొత్త చరిత్ర లిఖించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో అరుణ మహిళల వాల్ట్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది. తద్వారా ప‍్రపంచకప్‌ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా  ఈ హైదరాబాద్‌ అమ్మాయి రికార్డు నెలకొల్పింది. కాంస్య పతకం సాధించే వరకూ ప‍్రపంచానికి పెద్దగా పరిచయం లేని అరుణారెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.