టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జవాబుదారీతనం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విమర్శించారు. మంగళవారం విజయవాడలో విలేరులతో మాట్లాడుతూ.. రైతులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. రైతు సుఖీభవ పేరుతో కేటాయించిన రూ. 5 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారో అన్న విషయంపై స్పష్టత లేదని విమర్శించారు. రైతులకు రెండు విడతల్లో చెల్లించాల్సిన రుణమాఫీ రూ. 8300 కోట్ల ప్రస్తావనే బడ్జెట్‌లో లేదన్నారు.