ఆభరణాలు బయటపడకపోతే పదవికి రాజీనామా చేస్తా | YSRCP demands CBI probe on Lord Venkateswara Ornaments | Sakshi
Sakshi News home page

ఆభరణాలు బయటపడకపోతే పదవికి రాజీనామా చేస్తా

May 23 2018 11:44 AM | Updated on Mar 20 2024 1:48 PM

తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, హైదరాబాద్‌లలోని ఆయన నివాసాలకు తరలించారంటూ బుధవారం వైఎస్సార్‌ సీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 12 గంటల్లోగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా తెలంగాణ పోలీసులతో చంద్రబాబు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయపడతాయని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఇంట్లో ఆభరణాలు బయటపడకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 12 గంటల కంటే ఎక్కువ సమయం చంద్రబాబుకు ఇస్తే తిరుమల ఆభరణాలు విదేశాలకు తరలిపోతాయని అన్నారు. కేవలం హెరిటేజ్‌ వ్యాపారంతోనే చంద్రబాబు ఇన్ని ఆస్తులు కూడబెట్టారంటే సాధ్యమైన పని కాదని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement