రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం యుద్ధప్రాతిపదికన పూర్తి కావాల్సిన ప్రాజెక్టు అది. చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే ఇప్పటికే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేది. 960 మెగావాట్ల జలవిద్యుత్ అందుబాటులోకి వచ్చేది. విశాఖపట్నంలో తాగు, పారిశ్రామిక నీటి అవసరాలు తీరడంతోపాటు 540 గ్రామాల ప్రజల దాహార్తి తీరేది.