ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనను తరిమెల నాగిరెడ్డి చూసి ఉంటే ఏం చేసేవారో అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబులాంటి నాయకుడు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. తరిమెల నాగిరెడ్డిని ప్రజలు నేటికి మర్చిపోలేరని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెన్నా నది మీదుగా తరిమెల గ్రామానికి వంతెన కావాలని అడుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 28వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని తరిమెల గ్రామంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగట్టారు.