ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రత్యర్థులు తన చిన్నాన్నను హత్య చేసి కుట్ర రాజకీయాలకు తెరతీసినా బాధను దిగమింగి.. సంయమనం పాటిస్తూ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ‘జగన్ అనే నేను’ అంటూ ఆయన పలికే మాటల కోసం వైఎస్ జగన్ అభిమానులే కాదు సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో రాజన్న పాదయాత్ర ఘట్టాన్ని ‘ యాత్ర’గా తెరకెక్కించిన సినిమా దర్శకుడు మహి వి రాఘవ్ ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.