చదువులను తీసుకొస్తున్నాం:సీఎం జగన్ | YS Jagan Mohan Reddy Tweets About Education Service | Sakshi
Sakshi News home page

చదువులను తీసుకొస్తున్నాం:సీఎం జగన్

Jul 30 2019 8:00 AM | Updated on Mar 20 2024 5:21 PM

విద్య వ్యాపారం కాదని, అదొక సేవ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లును ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు చదువులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల ఫీజులపై నియంత్రణ, మౌలిక సదుపాయాలపై పర్యవేక్షణకు కమిషన్లను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లులను ఆమోదించామన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement