ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను హత్య చేసిన భార్య | Women kills husband for insurence money in Hyderabad | Sakshi
Sakshi News home page

Sep 3 2018 6:51 PM | Updated on Mar 22 2024 11:06 AM

మిర్యాలగూడకు చెందిన కేస్యా నాయక్, పద్మ భార్యాభర్తలు. ప్రభుత్వ ఉద్యోగి అయిన నాయక్‌ చనిపోతే, అతడి ఉద్యోగంతోపాటు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయనే దురాశతో భార్య పద్మ, మరో వ్యక్తి వినోద్ సాయంతో హత్య చేసింది. ముందుగా నాయక్‌కు ఊపిరాడకుండా చేసి, అనంతరం కారును ఓ ఎలక్ట్రిక్ పోల్‌కు ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పద్మతోపాటు వినోద్ కూడా నేరం చేసినట్లు అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement