కొండచిలువను చుట్టి సంచీలో వేసిన మహిళ

 జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువను ఓ మహిళ చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని చుట్టి సంచీలో వేసి.. అడవిలో వదిలిపెట్టారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. విద్యా రాజు(60) అనే మహిళ వన్యప్రాణుల సంరక్షణా కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఎర్నాకుళంలోని తరంగిణి అపార్టుమెంటు వద్దకు కొండచిలువ చేరుకుందన్న వార్త తెలుసుకుని అక్కడకు వెళ్లారు. నలుగురు వ్యక్తుల సహాయంతో కొండచిలువను పట్టుకున్నారు. దానికి హాని కలగకుండా ఓ బ్యాగులో వేసి అడవిలో వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top