లైంగిక వేధింపులను మౌనంగా భరించే వాళ్లు కొందరైతే.. ఎదురించేవాళ్లు మరికొందరు. తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని గల్ల పట్టి పోలీసులకు అప్పగించారు ఓ మహిళ. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ఆకతాయిని కటకటాల వెనక్కి నెట్టారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.