పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎత్తిపోతల పథకానికి కరెంటు సప్లై చెయ్యడానికి మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ఒక్కొక్క ట్రాన్స్‌ఫార్మర్ కెపాసిటీ 220 కె.వి ఉండగా అందులో ఒకటవ నెంబర్ ట్రాన్స్‌ఫార్మర్ అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని సబ్ స్టేషన్ వద్ద ఉన్న వాటర్ ట్యాంకర్ల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.