మృగాలుగా మారిన కొందరు పాల్పడిన దుశ్చర్యకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతోంది. ఓ షార్క్‌ను బోట్ కు కట్టేసి ఈడ్చుకెళ్లి మరీ చంపిన ఘటన కలవరపాటుకు గురిచేస్తోంది. ఫ్లోరిడాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గల్ఫ్ ఆఫ్ సమ్మర్‌లో ఈ ఏడాది జూన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మోటర్ బోట్‌కు తాడుతో దాని తలకు గాలం వేశారు. ఆపై ఆ అరడుగుల మూగజీవిని కట్టేసి ఈడ్చుకెళ్లారు. పైగా ఈ ఘటనను స్నాప్‌ఛాట్‌లో పోస్ట్ చేశారు కూడా. పైగా అది విలవిల కొట్టుకుంటుంటే నవ్వుతూ ఆనందించారు. ఈ క్రమంలో పలువురు కామెంట్లు చేయగా.. వారితో సంవాదానికి కూడా దిగారు.