టీడీపీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు | TDP EX MLA BK Parthasarathi Controversial Comments On AP Advocates | Sakshi
Sakshi News home page

టీడీపీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Dec 23 2019 3:50 PM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదులపై అనంతపురం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మూడు రాజధానులు ఏర్పడితే న్యాయవాదులు అంతా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్నారు. కర్నూలు హైకోర్టు, విజయవాడ, విశాఖ హైకోర్టు బెంబీల్లో పని చేయాలంటే న్యాయదులంతా మూడు వివాహాలు చేసుకోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు కాదు రాజధాని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. కాగా, బీకే వ్యాఖ్యలపై న్యాయవాదులు మండిపడుతున్నారు. తమను అవమానించేలా బీజే వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయన వెంటనే తమకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement