అమిత్‌ షా కాన్వాయ్‌ని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు | TDP activists stop Amit Shah convoy at Alipiri in Tirumala | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా కాన్వాయ్‌ని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

May 11 2018 12:39 PM | Updated on Mar 22 2024 11:06 AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు చేదుఅనుభవం ఎదురైంది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన ఆయనకు టీడీపీ శ్రేణులు నల్లజెండాలతో నిరసనలు తెలుపుతూ, గో బ్యాక్‌ నినాదాలు చేశారు. అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర షా కాన్వాయ్‌ని అడ్డుకునే యత్నం చేశారు. నిరసనల నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు.. ఆందోళనకారుల్ని చెదరగొట్టి షా కాన్వాయ్‌ని పంపించేశారు.

అందుకే దాడి జరిగింది: కాగా, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి ఘటనపై కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వి హనుమంతరావు స్పందించారు. ‘‘నోటికొచ్చినట్లు మాట్లాడి మోసం చేశారు కాబట్టే దాడి జరిగింది. ఒక్క తిరుపతిలోనేకాదు బీజేపీకి దేశమంతా ఇదే పరిస్థితి వస్తుంది. వారు ఆ వేంకటేశ్వరుడి ఆగ్రహం చవిచూడక తప్పదు’’

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement