గుజరాత్ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో ఓట్ల కోసం కాంగ్రెస్ యువనేత అల్పేశ్ ఠాకూర్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీ భోజనం ఖర్చు రోజులకు రూ.4 లక్షలంటూ పఠాన్ జిల్లాలోని రాధన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న కాంగ్రెస్ అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తైవాన్ మహిళ మెస్సీ జో స్పష్టం చేశారు. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. తైవాన్ నుంచి తెప్పించిన స్పెషల్ పుట్టగొడుగులు (మష్రూమ్స్) మోదీ తింటారని, వాటివల్లే ఆయన అందంగా, ఆరోగ్యంగా ఉంటారన్నది అవాస్తవమని చెప్పారు. అల్పేశ్ చేసిన ఆరోపణల్లో నిజంలేదని, అందుకు నిదర్శనంగా తైవాన్ మహిళ పలు విషయాలను వెల్లడించిన వీడియోను ప్రమోద్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.