ఆంధ్రప్రదేశ్ అభివృద్దిపై పదేపదే కేంద్రాన్ని తప్పుపట్టడం టీడీపీ నాయకులకు ఫ్యాషన్ అయిందని బీజేపీ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి సమావేశంలో ఆయన ప్రసంగిస్తుంటే అధికార పార్టీలు అడ్డుపడటంతో అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులకు, వీర్రాజుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.