సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసుకు సంబంధించి ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సతీష్, హేమంత్‌కు సన్నిహితంగా ఉంటున్న ఓ యువతికి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే స్నేహితుల ఇద్దరి మధ్య ఆర్థికపరమైన విభేదాలు ఉన్నట్లు ఆమె పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా సతీష్ బాబు హత్య జరిగిన సమయంలో ఆమె కూడా హేమంత్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. స్నేహితులు ఇద్దరు నెలకొల్పిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఈ యువతి ఉద్యోగం చేస్తోంది. అయితే ఆమెతో వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు సన్నిహితంగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.