ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు ఈజ్ ఆఫ్ కరప్షన్ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో లంచాలు లేనిదే పనులు జరగడం లేదన్నారు. గజ దొంగలు పాలిస్తే ఎలా ఉంటుందో దానికి కాకినాడే నిదర్శనమని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటాలు తప్ప చేసిందేమీలేదని జననేత ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లాలో అంతులేని అవినీతి జరుగుతోందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలను టీడీపీకి కట్టబెట్టినా.. సంతలో పశువులను కొన్నట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొన్నారని వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సంతచెరువు వద్ద జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు.