వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో జరిగిన భేటీపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయిన వైఎస్ జగన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చ జరిపాము. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను.’ అని పేర్కొన్నారు. ఇక ఆ ట్వీట్ తెలుగు, ఇంగ్లీష్ రెండు బాషల్లో చేయడం విశేషం. ఇక ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకున్న వైఎస్ జగన్ నేడు (ఆదివారం) ఢిల్లీలో ప్రధానితో సమావేశమైన విషయం తెలిసిందే.