దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరిట వైద్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 25న లక్నోలో జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ, ఆరెస్సెస్ కార్యకర్త రాకేశ్ సిన్హా హాజరుకానున్నారు. యూపీ అసెంబ్లీ స్పీకర్ హృదయ నారాయణ్ దీక్షిత్ అధ్యక్షత వహించనున్నారు.