ప్రస్తుతం యువత టిక్‌టాక్ మోజులో పడి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రాణాలకు అపాయమని తెలిసినా.. యువత ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తూ వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. తాజాగా ఒక యువకుడు కదులుతున్న ట్రైన్‌లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ టిక్‌టాక్‌లో షేర్ చేయాలనే మోజులో ప్రమాదమని తెలిసినా తన విన్యాసం కొనసాగించాడు. ఇంతలో అతని చేయి పట్టు తప్పి ఒక్కసారిగా కిందపడ్డాడు.