జనసేన పార్టీకి విశాఖలో బిగ్ షాక్ తగిలింది. ఇసుక అంశంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం నగరంలో లాంగ్ మార్చ్ చేపట్టిన సమయంలోనే ఆ పార్టీ సీనియర్ నేత పసుపులేటి బాలరాజు గుడ్‌బై చెప్పారు. జనసేనకు రాజీనామా చేసిన ఆయన ఈ సందర్బంగా పార్టీ అధినాయకత్వం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేనలో ప్రజాసమస్యలపై చర్చ జరగడం లేదని, ఆ పార్టీతో ప్రజాసమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు తక్కువ అని ఆయన తేల్చి చెప్పారు. ఇసుక కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. పవన్ కల్యాణ్ మార్చ్‌లు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు.