పర్యావరణానికి హాని కలిగించే క్రాకర్స్‌కు సుప్రీం నో.. | No complete ban on firecrackers | Sakshi
Sakshi News home page

పర్యావరణానికి హాని కలిగించే క్రాకర్స్‌కు సుప్రీం నో..

Oct 23 2018 11:51 AM | Updated on Mar 20 2024 3:51 PM

 దేశంలో బాణాసంచా నిషేధంపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. బాణాసంచా విక్రయాల తయారీ, విక్రయాలను నిషేధించలేమని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. లైసెన్స్‌ కలిగిన వ్యాపారులే బాణాసంచా విక్రయించాలని, ఆన్‌లైన్‌లో విక్రయాలు జరపరాదని పేర్కొంది. రాత్రి 8 గంటల నుంచి పది గంటల వరకే బాణాసంచా కాల్చాలని సూచించింది. పర్యావరణానికి హానికలిగించని క్రాకర్స్‌ను కాల్చాలని పేర్కొంది. కాగా అంతకుముందు బాణాసంచాపై నిషేధం విధించాలనే పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు తయారీదారుల ఉపాధి హక్కుతో పాటు దేశం‍లోని 130 కోట్ల మంది ఆరోగ్యంగా జీవించే హక్కు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు గతంలో పేర్కొంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement