రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బవానా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ బాణ సంచా కర్మాగారంలో శనివారం సాయంత్రం మంటలు ఎగిసిపడి 17 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో 10 మంది మహిళలు ఉన్నారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. ఊపిరాడక లేదా మంటల్లో సజీవంగా దహనమై వారు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనం నుంచి 17 మృతదేహాలను వెలికితీశామని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.