ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయిన 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్ కే సింగ్.. పునర్విభజన చట్టంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో విభజన చట్టాల అమలుకు ప్రత్యేక వ్యవస్ధ ఉండేదన్నారు. కానీ ఏపీ పునర్విభజన చట్టం అమలుకు పర్యవేక్షణ వ్యవస్ధ అనేదే లేదని తెలిపారు. గతంలో విభజన చట్టం అమలుకు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్ బాధ్యులుగా ఉండేవారన్నారు.