గుజరాత్ ఎన్నికల రెండో దశ పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ రాజకీయ ఆరోపణలు తారాస్థాయికి చేరుతున్నాయి. గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్‌తో కుమ్మక్కైందన్న ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ యువనేత అల్పేశ్ ఠాకూర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అవికాస్తా అభ్యంతరకరంగా ఉండటంతో బూమరాంగ్ అయ్యాయి.