ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అరెస్ట్‌ | MLA Kotamreddy Sridhar Reddy Arrested | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అరెస్ట్‌

Oct 6 2019 8:58 AM | Updated on Mar 21 2024 11:35 AM

సాక్షి, నెల్లూరు : రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని  ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని డీజీపీ గౌతం సవాంగ్‌కు ఆయన స్పష్టం చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement