రాష్ట్రం విడిపోయాక మొట్ట మొదటి సీఎంగా చెట్టు కింద పాలన చేశానని చెప్పుకునే చంద్రబాబు బండారం బట్టబయలైందని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కష్టపడుతున్నానని చెప్పి తన పాలనలో రాష్ట్రాన్ని దోచేశారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహాయకుడు దగ్గరే రూ.2 వేల కోట్లు దొరికితే బాబు, లోకేష్, వారి అనుచరులు, బినామీల దగ్గర ఎన్ని వేల కోట్లు దొరుకుతాయన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు. షెల్ కంపెనీల పేరుతో బాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.